రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే నేడు ప్రజలకు కష్టాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే నేడు ప్రజలకు కష్టాలు

రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే నేడు ప్రజలకు కష్టాలు

Written By news on Tuesday, November 13, 2012 | 11/13/2012


* 15 గ్రామాలకు తాగునీటి కోసం వైఎస్ రూ.11 కోట్లు ఇచ్చారు
* ఎల్‌ఎల్‌సీ నుంచి నీరు తెప్పించలేని దీనస్థితి ఇప్పుడుంది
* జగనన్న వస్తే రాజన్న ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు
* మరో ప్రజాప్రస్థానంలో షర్మిల 

 రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే నేడు ప్రజలకు కష్టాలు పడాల్సిన దుస్థితి ఏర్పడిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. తాగు, సాగునీరు లేని దయనీయ స్థితిలో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారని ఆమె అన్నారు. మరో ప్రజాప్రస్థానంలో భాగంగా సోమవారం 26వ రోజు షర్మిల ఆస్పరి మండలం చిరుమాను దొడ్డి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో తనను కలిసేందుకు వచ్చిన రైతులు, కూలీలు, విద్యార్థులతో మాట్లాడుతూ వారి కష్టాలు తెలుసుకుంటూ 13.6 కిలోమీటర్లు నడక సాగించారు. 

చిరుమాను దొడ్డి నుంచి హలిగేర, బెణిగేరి, నాగరూర్ క్రాస్ నుంచి ఆదోని నియోజకవర్గంలోని విరుపాపురంలోకి ప్రవేశించి అక్కడి నుంచి సాదాపురం క్రాస్, దిబ్బనకల్లు క్రాస్ మీదుగా ఆదోనికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో రాత్రి బసచేశారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రధాన ప్రతిపక్షాల వైఖరిని ఎండగట్టారు. జిల్లాలో తాను పాదయాత్ర ప్రారంభించిన రోజు నుంచి ఇప్పటి వరకు ఎక్కడికెళ్లినా తాగు, సాగునీరు, కరెంటు బిల్లులు, గ్యాస్, పింఛన్ల గురించి ప్రజలు బాధపడుతున్నారని, మొద్దునిద్రలో ఉన్న కిరణ్ సర్కార్‌కు ఇవేమీ పట్టడం లేదన్నారు. 

ఆదోని, ఆస్పరి మండలాల్లోని 15 గ్రామాలకు తాగునీరు అందించేందుకు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి రూ. 11 కోట్లు మంజూరు చేసి ఎల్ అండ్ టీ కంపెనీతో పైపులైన్లు వేయిస్తే ఈ ప్రభుత్వం ఎల్‌ఎల్‌సీ నుంచి నీటిని కూడా అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు, కరెంటు కోసం రాజన్న హయాంలో ఏనాడూ ప్రజలు ఆందోళన చెందలేదని ఆమె అన్నారు. రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా మొదలైన హంద్రీనీవా ప్రాజెక్టును సైతం పూర్తిచేయలేని అధ్వాన్న ప్రభుత్వం ఇదని ధ్వజమెత్తారు. 

చంద్రబాబు నాయుడి పాలనలో ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో ఇప్పుడు కిరణ్‌కుమార్ రెడ్డి పాలనలో అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నారు. ప్రజలు అధైర్య పడొద్దని, భవిష్యత్తులో రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని హామీ ఇచ్చారు. జగనన్న సీఎం అయితే ప్రజల కష్టాలన్నీ తీరుతాయని భరోసా ఇచ్చారు. కాగా బేణిగేరి గ్రామ ప్రజలు త మ ఊళ్లో ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారం చేసేందుకు శ్మశానవాటిక కూడా లేదని ఆవేదన వ్యక్తం చేయగా జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని, స్థానిక పార్టీ ఇన్‌చార్జి గుమ్మన జయరాం ఎమ్మెల్యేను చేస్తే శ్మశాన వాటిక ఏర్పాటు, మరుగుదొడ్ల నిర్మాణం చేయిస్తారని చెప్పారు. 


source:sakshi
Share this article :

0 comments: