మరో ప్రజా ప్రస్థానానికి నేటికి 30 రోజులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » మరో ప్రజా ప్రస్థానానికి నేటికి 30 రోజులు

మరో ప్రజా ప్రస్థానానికి నేటికి 30 రోజులు

Written By news on Friday, November 16, 2012 | 11/16/2012

మరో  ప్రజా ప్రస్థానం మొదలై నేటికి 30 రోజులు. ఈ 30 రోజుల్లో షర్మిల దాదాపు15 బహిరంగ సభల్లో ప్రసంగించారు. అనేక రచ్చబండలు నిర్వహించారు. చెట్ల కింద నుంచోని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వాన, ఎండ, చలిలోనూ పాదయాత్ర ఆపలేదు. జ్వరంలోనూ ముందుకు కదిలారు. కుమ్మక్కు కుట్రలపై విరుచుకుపడ్డారు. నీచ రాజకీయాలను కడిగిపారేశారు. అవిశ్వాసం పెట్టకుండా పాదయాత్ర  డ్రామాలేంటీ అంటూ ప్రశ్నించారు. 30 రోజుల్లో 375.3 కిలో మీటర్లు నడిచారు షర్మిల.
కుమ్మక్కు కుట్రలకు నిరసనగా, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అక్రమంగా అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ప్రారంభమైన మరో ప్రజా ప్రస్థానాన్ని ప్రజలు అక్కున చేర్చుకున్నారు. వైఎస్‌ కుటుంబాన్ని నిలబెట్టుకుంటేనే తమ బతుకులు నిలబడేదంటూ షర్మిల అడుగులో అడుగేశారు. వైఎస్ఆర్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన షర్మిల పాదయాత్ర ఆరు రోజుల తర్వాత అనంతపురం జిల్లాలోని  ధర్మవరం నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. అనంతపురం జిల్లాలో 17 రోజుల పాటు సాగిన పాదయాత్ర రాప్తాడు, ఉరవకొండ,  గుంతకల్ నియోజకవర్గాల్లో 195 కిలో మీటర్లు పాటు సాగింది. నవంబర్‌ 8న కర్నూలు జిల్లాలోకి మరో ప్రజా ప్రస్థానం అడుగు పెట్టింది.  మద్దెకెర నుంచి  కర్నూలు జిల్లాలో ప్రారంభమైన షర్మిల పాదయాత్ర పత్తికొండ, ఆలూరు, ఆదోని, మంత్రాలయంల మీదుగా  ముందుకు కదులుతోంది. ఈ 30 రోజుల పాదయాత్రలో షర్మిల అనేక సమస్యలను తెలుసుకున్నారు . రైతులకు ధైర్యం చెప్పారు. తెలంగాణలో కూడా మరో  ప్రజా ప్రస్థానానికి అదిరిపోయే స్పందన వస్తుందని నేతలు ఆ ప్రాంత నేతలు చెప్పారు. 28వ రోజు పాదయాత్రలో పాల్గొన్న తెలంగాణ ప్రాంత వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు  వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి పాలన కోసం ఆ  ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు.source:sakshitv
Share this article :

0 comments: