ధైర్యంగా ఉండండి! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » ధైర్యంగా ఉండండి!

ధైర్యంగా ఉండండి!

Written By news on Wednesday, November 14, 2012 | 11/14/2012మంగళవారం 27వ రోజు మరో ప్రజాప్రస్థానంలో భాగంగా షర్మిల 9.5 కి.మీల మేర పాదయాత్ర చేశారు.  ఆదోని సమీపంలోని మిల్టన్ స్కూల్ నుంచి ప్రారంభమై కొత్త బస్టాండ్, నిర్మల టాకీస్ రోడ్, వీబీఎస్ సర్కిల్, శ్రీనివాస భవన్ సర్కిల్, రియా హాస్పిటల్, పీఎన్ రోడ్, జామియా మసీద్, పూల్ బజార్, గణేష్ సర్కిల్, మీటర్ మజీద్ రోడ్డు, అవన్నపేట స్కూల్ మీదుగా ఎమ్మిగనూరు రోడ్డుకు పాదయాత్ర చేరుకుంది. రాత్రికి ఇక్కడే బస ఉంటుంది. నేటి పాదయాత్రలో శోభా నాగిరెడ్డి, వాసిరెడ్డి పద్మ, ఎం. మారెప్ప, ఆళ్ల నాని తదితర వైయస్ఆర్ సీపీ నాయకులు పాల్గొన్నారు.
ఆదోని ఏరియా ఆసుపత్రి వద్ద షర్మిల వైయస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గౌలిపేట శక్తి మైదాన్‌ వద్ద ఆమె మహిళలతో రచ్చబండ నిర్వహించారు. వంటగ్యాస్ నుండి మొదలుపెట్టి కరెంటు వరకూ అన్నిటినీ ప్రభుత్వం పెంచేసి తమ జీవితాలను దుర్భరం చేసేసిందని మహిళలు షర్మిలతో వాపోయారు. పేదలను పట్టించుకోని ఈ పాలన రాబందుల రాజ్యమని షర్మిల వ్యాఖ్యానించారు. అయితే జగనన్న వస్తాడనీ, రాజన్న రాజ్యం వస్తుందనీ అంతవరకూ ధైర్యంగా ఉండాలనీ షర్మిల మహిళలను కోరారు. ఇదిలావుండగా షర్మిల తన 27 రోజుల పాదయాత్రలో మొత్తం 348.3 కిలోమీటర్ల నడక పూర్తి చేశారు.


http://ysrcongress.com/news/news_updates/dhairyamgaa_undandi_.html
Share this article :

0 comments: