ఠాక్రే మృతిపై విజయమ్మ సంతాపం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » ఠాక్రే మృతిపై విజయమ్మ సంతాపం

ఠాక్రే మృతిపై విజయమ్మ సంతాపం

Written By news on Saturday, November 17, 2012 | 11/17/2012

శివసేన అధినేత బాల్ ఠాక్రే మృతిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సంతాపాన్ని వెలిబుచ్చారు. పలువురు స్థానిక, జాతీయ ప్రముఖులు కూడా ఠాక్రే మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఢిల్లీలో భారతీయ జనతాపార్టీ సినియర్ నేత సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ టైగర్ (ఠాక్రే) మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

పార్టీ నేత షానవాజ్ హుస్సేన్ మాట్లాడుతూ దేశం ఒక యోధుడిని కోల్పోయిందన్నారు. ఠాక్రే అంతిమ యాత్రలో పార్టీ శ్రేణులు పాల్గొంటాయని వెల్లడించారు. శివసేనతో తమ అనుబంధం కొనసాగుతుందని పేర్కొన్నారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో నేడు బీజేపీ నేతలకు ఏర్పాటు చేసిన విందును ఠాక్రే మృతి కారణంగా, ప్రధాని మన్మోహన్ రద్దు చేసుకున్నారు.

కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శివసేన అధినేత బాల్ ఠాక్రే శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయనకు చికిత్స చేస్తున్న డాక్టర్ జైల్ ధ్రువీకరించారు. ఠాక్రే శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు కన్నుమూశారని వైద్యులు ప్రకటించారు. దీంతో ముంబైవాసులే కాక, దేశవ్యాప్తంగా ఉన్న ఠాక్రే అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన కన్నుమూసిన మాతోశ్రీ వద్దకు అభిమానులు భారీగా చేరుకుంటున్నారు.


source:sakshi

Share this article :

0 comments: