రామోజీ ఫిలింసిటీ అసైన్డ్ భూముల్లో ఇందిరమ్మ ఇళ్లకు గ్రహణం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రామోజీ ఫిలింసిటీ అసైన్డ్ భూముల్లో ఇందిరమ్మ ఇళ్లకు గ్రహణం

రామోజీ ఫిలింసిటీ అసైన్డ్ భూముల్లో ఇందిరమ్మ ఇళ్లకు గ్రహణం

Written By news on Thursday, November 15, 2012 | 11/15/2012

* రామోజీ ఫిలింసిటీ అసైన్డ్ భూముల్లో ఇందిరమ్మ ఇళ్లకు గ్రహణం 
* 2007 సంవత్సరంలో 14.30 ఎకరాల్లో 585 మంది పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు
* వైఎస్ హయాంలోనే సర్టిఫికెట్ల పంపిణీ
* లబ్ధిదారులను అడ్డుకున్న ఫిలింసిటీ సిబ్బంది
* పేదలకు అనుకూలంగా తీర్పునిచ్చిన లోకాయుక్త
* గత ఏడాది 162 ఇళ్లకు శంకుస్థాపన చేసిన సర్కారు
* ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకుంటున్న బడాబాబులు.. విద్యుత్, నీటి సౌకర్యానికి బ్రేకులు... పట్టించుకోని అధికారులు
* గూడు కోసం ప్రాణత్యాగానికీ సిద్ధమంటున్న లబ్ధిదారులు

రామోజీ ఫిలింసిటీలోని అసైన్డ్ భూముల్లో పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న వైఎస్ సర్కారు నిర్ణయానికి కొందరు పెద్దలు మోకాలడ్డుతున్నారు. సర్కారు స్థలం కేటాయించినా, ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేసినా.. విద్యుత్, నీటి సరఫరాకు బ్రేకులు వేశారు. అధికారులు కూడా వారికి వంత పాడుతుండటంతో ఏళ్లు గడిచినా పేదల ఇళ్లు మోక్షానికి నోచుకోవడంలేదు. దీంతో ఇళ్లకోసం తాము ప్రాణత్యాగానికైనా వెనుకాడబోమని బాధితులు హెచ్చరిస్తున్నారు.
ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి), న్యూస్‌లైన్: వేల ఎకరాల్లో రాజభవనాలు నిర్మించుకున్న బడాబాబులు పేదల సొంతింటి కలకు మాత్రం మోకాలడ్డుతున్నారు. తమ పలుకుబడితో తెర వెనుక కుయుక్తులు నడుపుతూ పేదల బతుకులతో ఆడుకుంటున్నారు. ఆ కుట్రలకు అధికారులు కూడా వంతపాడుతూ రామోజీ ఫిలిం సిటీలో పేదల ఇళ్ల నిర్మాణానికి గ్రహణం పట్టించారు. ఏళ్లు గడుస్తున్నా తమ కలలు సాకారం కాకపోవడంతో ఆ పేదలు లబోదిబోమంటున్నారు. 

ఇళ్లు కట్టించి ఇవ్వకపోతే ప్రాణత్యాగానికైనా వెనుకాడేది లేదని హెచ్చరిస్తున్నారు. రామోజీ ఫిలింసిటీలో సర్వే నంబర్లు 189, 189/1, 203ల్లో ప్రభుత్వ అసైన్డ్ భూములు 33.20 ఎకరాలుండగా, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2007లో అందులో 14.30 ఎకరాల్లో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించారు. మండల పరిధిలోని రాయపోల్, నాగన్‌పల్లి, పోల్కంపల్లి, ముకునూరు తదితర గ్రామాలకు చెందిన 585 మంది పేదలకు ఫిలింసిటీలో ఇళ్ల స్థలాల సర్టిఫికెట్లను అందజేశారు. అంతేకాకుండా ప్రభుత్వమే లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కూడా అప్పట్లోనే నిర్ణయించారు. అయితే ఆ ఇళ్ల స్థలాల వద్దకు లబ్ధిదారులు రాకుండా ఫిలింసిటీ సిబ్బంది కట్టడి చేశారు. ఈ అన్యాయంపై గతంలో సాక్షి దినపత్రికలో కథనం రావడంతో లోకాయుక్త స్పందించి సుమోటోగా కేసు నమోదు చేసింది. విచారణ అనంతరం లోకాయుక్త తీర్పు కూడా పేదలకే అనుకూలంగా వచ్చింది. 

ఆ తర్వాత అనేక అడ్డంకులు, ఆందోళనల మధ్య గతేడాది (2011) జనవరి మొదటి వారంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో 162 మందికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని హౌసింగ్ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా గతేడాది ఫిబ్రవరి ఒకటిన ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. ఇళ్ల నిర్మాణం కోసం అక్కడ బోరుతోపాటు కరెంటు సౌకర్యం కల్పిస్తామని అధికారులు అప్పట్లో ప్రకటించారు. దీంతో లబ్ధిదారులు తమకు కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి పూజలు కూడా జరిపారు. ఆ తర్వాత తెరవెనుక నుంచి కొన్ని శక్తులు పనిచేయడంతో అది కేవలం ప్రకటనలకే పరిమితమైంది. 

అక్కడ విద్యుత్‌తో పాటు నీటి సౌకర్యం కల్పించకపోవడంతో ఇళ్ల నిర్మాణాలకు బ్రేకులు పడ్డాయి. తమకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలంటూ లబ్ధిదారులు అనేక పర్యాయాలు హౌసింగ్ కార్యాలయం చుట్టూ కాళ్ల చెప్పులరిగేలా తిరిగినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఉన్నతస్థాయిలో వస్తున్న ఒత్తిడి కారణంగానే ఫిలింసిటీలో ఇళ్ల నిర్మాణానికి అధికారులు జంకుతున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ఇళ్ల నిర్మాణం జరిగితే ఫిలింసిటీకి ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతోనే ఈ ప్రతిపాదనను అడ్డుకుంటున్నట్లు సమాచారం. 

అధికారులు అమ్ముడుపోయారు..
ఫిలింసిటీలో ఇళ్ల స్థలాలను పొందిన వారిలో నాగన్‌పల్లి గుడిసెవాసులు దాదాపు 50 మంది ఉన్నారు. తమకు ఇళ్లు కట్టించి ఇవ్వాలంటూ ఈ గుడిసెవాసులు మూడేళ్ల కిందట కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన కూడా చేశారు. అప్పట్లో వీరిలో కొందరు ఆత్మహత్యాయత్నానికి కూడా పూనుకున్నారు. ఆ తర్వాత ఇళ్ల గురించి ఈ గుడిసెవాసులు అనేక పర్యాయాలు హౌసింగ్ కార్యాలయం ఎదుట ధర్నాలు కూడా చేశారు. అయినా అధికారులు మాత్రం ఈ విషయం గురించి పట్టించుకోవడం మానేశారు. దీంతో అధికారులు రామోజీరావుకు అమ్ముడుపోయారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. వెంటనే ఫిలింసిటీలో ఇళ్లు కట్టించి ఇవ్వకపోతే చావడానికైనా వెనుకాడేది లేదని వారు హెచ్చరిస్తున్నారు. 

రాజశేఖరరెడ్డి ఉంటే ఇళ్లు కట్టించేవారు
రాజశేఖరరెడ్డి పుణ్యాన మాకు ఇళ్ల స్థలాలు వచ్చాయి. ఆయన జీవించి ఉంటే మాకు ఇళ్లు కట్టించి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అధికారులు ఎవరికో అమ్ముడుపోయి ఇళ్లను నిర్మించడానికి వెనుకాడుతున్నారు. ఇప్పటికైనా మాకు ఫిలింసిటీలో ఇళ్లు కట్టించి ఇవ్వాలి.
-పి. అరుణమ్మ, రాయపోల్


చావుకైనా వెనుకాడం...
ఫిలింసిటీలో మాకు ఇళ్లు కట్టించడానికి అధికారులు ఎందుకు వెనుకాడుతున్నారో అర్థం కావడం లేదు. ఇళ్లు నిర్మించి ఇవ్వాలని గతంలో కలెక్టర్ ఆఫీసు ఎదుట ధర్నా చేసినా అధికారులు స్పందించలేదు. అప్పుడు నేను ఆత్మహత్యాయత్నానికి కూడా ప్రయత్నించాను. ఇల్లు కోసం చావడానికైనా నేను సిద్ధం.
-ఒరుసు బాలమ్మ, నాగన్‌పల్లి 


గుడిసెల్లో ఉండలేకపోతున్నాం...
నాగన్‌పల్లిలో గుడిసెల్లో ఉండలేకపోతున్నాం. వర్షాలు పడితే గుడిసెల్లోకి నీరు వచ్చి నానా తిప్పలు పడుతున్నాం. రాత్రి వేళల్లో పురుగు, పుట్ర వచ్చి భయపడుతున్నాం. మాకు ఫిలింసిటీలో వెంటనే ఇళ్లు కట్టించి ఇవ్వాలి. ఇళ్లు కట్టించి ఇవ్వకపోతే మాకు చావే గతి.
-వల్లెపు చెన్నమ్మ, నాగన్‌పల్లి


విద్యుత్ సౌకర్యం లేక వాయిదా...
ఫిలింసిటీలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అక్కడ విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. విద్యుత్ సరఫరా గురించి ఆ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. కరెంటు సౌకర్యం ఏర్పాటు చేయగానే ఇళ్ల నిర్మాణం చేపడతాం.
-సుభా



source:sakshi
Share this article :

0 comments: