మరోప్రజాప్రస్థానం 22న తెలంగాణలోకి ప్రవేశం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » మరోప్రజాప్రస్థానం 22న తెలంగాణలోకి ప్రవేశం

మరోప్రజాప్రస్థానం 22న తెలంగాణలోకి ప్రవేశం

Written By news on Friday, November 16, 2012 | 11/16/2012

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈ 22న మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రారంభమవుతుంది. అలంపూర్ నియోజకవర్గం పుల్లూరులో తెలంగాణలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. పాదయాత్రను విజయవంతం చేసేందుకు మహబూబ్‌నగర్ జిల్లాల్లోని 14 నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ లను నియామించారు. షర్మిల జిల్లాలోకి ప్రవేశించినప్పుడు లక్షమందితో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

మహబూబ్‌నగర్ తర్వాత రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో పాదయాత్ర కొనసాగుతుంది. వైఎస్ హయాంలో మొదలై, ప్రస్తుతం ఆగిపోయిన ప్రాజెక్టులను షర్మిల సందర్శిస్తారు. మొత్తం ఏడు నియోజకవర్గాల మీదుగా జిల్లాలో పాదయాత్ర కొనసాగుతుందని తెలంగాణ జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్, వైఎస్‌ఆర్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్థన్ చెప్పారు.

source:sakshi
Share this article :

0 comments: