నాన్న బాటలో నడుస్తున్న తనయుడిగా.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నాన్న బాటలో నడుస్తున్న తనయుడిగా..

నాన్న బాటలో నడుస్తున్న తనయుడిగా..

Written By news on Monday, April 14, 2014 | 4/14/2014

నాన్న బాటే..!నాన్న బాటే..!
అభివృద్ధి.. సంక్షేమం.. ఇది మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయం. ఈ ఆశ య సాధన కోసం ఆయన నిరంతరం శ్రమించారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు ఆయన చేసిన కృషి అమోఘం. ప్రజల కోసం..

 ప్రగతి కోసం పాటు పడిన వైఎస్ రాజశేఖరరెడ్డి తన ఆశయాలు పూర్తిగా నెరవేరక ముందే ఆకస్మికంగా తనువు చాలించారు. మహానేత ఆశయ సాధన కోసం ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీతో జనం ముందుకు వచ్చారు. పార్టీ మేనిఫెస్టోలో అభివృద్ధి.. సంక్షేమానికి పెద్దపీట వేసి నాన్న బాటలో నడుస్తున్న తనయుడిగా..  జనం మనిషిగా గుర్తింపు పొందారు.

 అన్నదాతకు అండగా..
 రైతులకు పగటిపూట 7గంటల నాణ్యమైన ఉచితవిద్యుత్ గిట్టుబాటు ధరకోసం రూ.3వేలకోట్లతో ధరల స్థిరీకరణ నిధి  తెగుళ్లు, భూసార పరీక్షల కోసం102 మొబైల్‌వ్యాన్లు103 వాహనంతో పశువుల డాక్టర్లను ఊళ్లోకి రప్పించడం
రెండు జిల్లాలకో వ్యవసాయకళాశాల .

 ఉన్నత విద్యకు అవకాశం
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోలో పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంటు చేర్చడంవల్ల పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివే అవకాశం ఉంది. గతంలో ఫీజు రీయింబర్స్‌మెంటు కొంతమేర మాత్రమే వచ్చింది. వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో ఈ విధంగా చేర్చడం పేద విద్యార్థుల పాలిట వరంగా చెప్పవచ్చు.
 - జగదీష్(బీటెక్ విద్యార్థి), పులివెందుల,
 
 
 నిరుద్యోగులకు వరం
 కడపలో స్టీలు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల మెనిఫెస్టోలో ప్రకటించడం శుభపరిణామం. జిల్లాలో అనేక మంది ఉపాధి అవకాశాలకు ఇతర ప్రాంతాలకు వలస  వెళ్లాల్సి వస్తుంది. స్టీలు ఫ్యాక్టరీ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది. ఇది నిరుద్యోగులకు ఓ వరమని చెప్పాలి
 -ఎస్.అజ్మతుల్లా, రాజంపేట
 
 
 అమ్మఒడితో ప్రతి పిల్లవాడికి ఉపయోగకరం
 అమ్మఒడితో ప్రతి పిల్లవాడికి ఉన్నత చదువు లభిస్తుంది. పిల్లల్ని కూలికి పంపక  బడికిపంపే ప్రతి తల్లికి, కుటుంబానికి ఇద్దరు పిల్లలకు రూ. 1000లు ప్రతి నెల బ్యాంకు  అకౌంట్‌లో జమ చే యడంతో ప్రతి పిల్లవాడికి మంచి చదువు లభిస్తుంది.
 -రామాంజనేయరెడ్డి ( శివాణి లారీ ట్రాన్సుఫోర్టు ఎర్రగుంట్ల)

 ప్రతి ఇంటికి ఒక పెద్ద దిక్కు
 అమ్మ ఒడి పథకం ద్వారా పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లి బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయడం అంటే ప్రతి ఇంటికి పెద్దదిక్కు లాంటిది. ప్రతి తల్లిని అక్కలా, చెల్లిలా భావించారు. అందుకే వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇలాంటి పథకం ప్రవేశ పెడుతున్నారు.
 - రేణుక, రెడ్డివారిపల్లె, కోడూరు.
 
  అమ్మఒడితో ఎంతో మేలు
 జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టోలో అమ్మఒడి పథకం ద్వారా పుట్టినబిడ్డ నుండి డిగ్రీ చదివే విద్యార్థుల వరకు ప్రతినెల వారి తల్లి అకౌంట్‌లో నిధులు జమ చేస్తాననడం గర్వకారణం. ఈ పథకం ద్వారా ప్రతి చిన్నారి చదువుకుని ఉన్నతస్థాయికి ఎదిగే అవకాశాలు ఉన్నాయి. ఇచ్చిన మాటపై వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిలబడ్డాడు. ఆయన బాటలోనే ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి కూడా నడుస్తుండటం గర్వకారణం.
 - తోటపవన్‌కళ్యాణ్, ఎలక్ట్రికల్ డిప్లామా విద్యార్థి, నరసాపురం, కాశినాయన మండలం.
 
 నిరుద్యోగులకు ఎంతో ఉపయోగకరం
 వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగుల జీవన భృతికి, ఉద్యోగ అవకాశాలకు ప్రాధాన్యత ఇవ్వడం హర్షించదగ్గ విషయం. ఇలాంటి విధానం రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీ కూడా చేపట్టలేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గత నాలుగు సంవత్సరాలుగా ప్రజల్లో ఉండటం వలన ముఖ్యంగా యువత ఇబ్బందులు ఆయనకు తెలిశాయి.     -పసుపులేటి వెంకటేశ్వర్లు, నిరుద్యోగి, బ్రహ్మంగారిమఠం
 
 ఉద్యోగ భద్రత  
 రాష్ట్ర ఉద్యోగులను సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకునే విధానం ఈ మేనిఫెస్టోలో ఉండటం ఎంతో హర్షించదగ్గ విషయం. ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లాగా చూసే విధానం ఏ పార్టీలు తమ మేనిఫెస్టోలో పొందుపర్చలేదు.
 - సుమిత్ర , ఉద్యోగి, బ్రహ్మంగారిమఠం
 
 
 జగనే సీఎం అవుతారు నాయనా
 చనిపోయిన మహారాజు 75 రూపాయలు ఉన్న పింఛన్‌ను 200 రూపాయలకు పెంచాడు. ఆయన దయ వలన అంతో ఇంతో మేలు జరుగుతున్నది. ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి వృద్ధులకు 700 రూపాయలు, వికలాంగులకు వెయ్యి రూపాయలు పింఛన్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. నా మనమడు జగన్ కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు.
     -బి.నారాయణమ్మ,   ఆకులనారాయణపల్లె, కాశినాయన మండలం.
 
 వికలాంగులకు చేయూత
 వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో వికలాంగులకు పెన్షన్ పెంచడంతో మమ్మల్ని ఆర్థికంగా ఆదుకున్నట్లయింది. పనులు చేయలేని మాకు నెలకు రూ.1000 పెన్షన్ ఇవ్వడం జగన్‌కే సాధ్యం.    - ఆంజనేయులు, వికలాంగుడు, కోడూరు.
 
 పేదల గుండెచప్పుడు జగన్
 వైఎస్ జగన్ పేద ప్రజల గుండె చప్పుడు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకంతో పేద రోగులకు జీవం పోశాడు. ఇప్పుడు జగన్ ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాల్టీ హాస్పిటల్‌ను ఏర్పాటు చేస్తామని ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టడం సాహసోపేత నిర్ణయం. ఇది పేదలందరికీ మేలు చేసే కార్యక్రమం.     -ఎస్.కరిముల్లా, రాజంపేట
 
 డ్వాక్రా రుణాల రద్దు హర్షణీయం
 వైఎస్సార్‌సీపీ అధికారంలో వస్తే మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న డ్వాక్రా రుణాల రద్దు నిర్ణయం ఎంతో సంతోషకరం. ఇంత వరకు ఏ ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్నారు.
 - నర్సింహారెడ్డి (వ్యాపార వేత్త ఎర్రగుంట్ల)
 
 డ్వాక్రా రుణ మాఫీ ఆర్థిక చేయూత
 డ్వాక్రా మహిళలకు రుణ మాఫీతో ఆర్థిక చేయూత లభిస్తుంది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి పావలా వడ్డీకి రుణాలు ఇచ్చారు. ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రుణ మాఫీ చేస్తున్నారు. ఇది ఎవరికీ సాధ్యం కాదు.
 - పి.మునెమ్మ, డ్వాక్రా మహిళ కుక్కలదొడ్డి
 
 మహిళాభివృద్ధికి పెద్ద పీట  
 వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మేనిఫెస్టోలో మహిళలకు పెద్ద పీట వేసింది. డ్వాక్రా రుణాల రద్దుతోపాటు బెల్టుషాపు రద్దు, ప్రతిగ్రామంలో 10మంది మహిళా పోలీసులు,  ఇలాంటి నిర్ణయాలు చాలా బాగున్నాయి.
 - హకీం (స్థానికుడు), వేంపల్లె
 
 రైతుల సంక్షేమం పట్ల శ్రద్ధ తీసుకున్నారు..
 వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి మాదిరే  రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోను తయారు చేశారు. ప్రతి రెండు జిల్లాలకు ఒక వ్యవసాయ యూనివర్సిటీ, జిల్లాలో పశువైద్యశాలలు ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. అలాగే రెండు వేల కోట్లతో రైతుకోసం ప్రత్యేక ప్యాకేజి ప్రకటించడం హర్షణీయం.
 - పి.రవీంద్రనాథరెడ్డి, పెద్దపసుపల,

 వ్యవసాయానికి పెద్ద పీట
 వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ మేనిఫెస్టోలో వ్యవసాయానికి పెద్ద పీట వేయడం అభినందనీయం. దివంగత నేత వైఎస్‌ఆర్ హయాంలో కూడా రైతులకు ఎంతో మేలు జరిగింది. అదే కోవలోనే వైఎస్ జగన్ కూడా నడుస్తున్నారు. వ్యవసాయ స్థిరీకరణ పథకానికి 2వేల కోట్లు నిధులు వెచ్చించడం రైతులపై ఉన్న అభిమానమని తెలుస్తోంది.
 - ఎస్.రామగంగిరెడ్డి(రైతు), కుప్పాలపల్లె

 రైతు బాంధవుడు
 వై.యస్.జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో రైతుల సమస్యల పట్ల ఒక స్పష్టతను కల్పించారు. ముఖ్యంగా నిరంతరాయంగా వ్యవసాయానికి 7 గంటల విద్యుత్ సౌకర్యం, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతు కుటుంబాలు ఇంటి అవసరాలకు ఉపయోగించే విద్యుత్‌లో 150 యూనిట్‌లకు రూ.100, రైతులు పండించే పంటకు నష్టపోయే రైతుకు ఆర్థిక ప్యాకేజిలు వంటివి ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధానం చూస్తే రైతుల పట్ల తండ్రికున్న భావన తనయునికి ఉన్నట్లు కనిపిస్తోంది.     - ఎ.ఓబుళరెడ్డి, రైతు, చౌదరివారిపల్లె
 
 కనీస మద్దతుధర రైతులకు గౌరవం
 వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో మద్దతు ధర ప్రకటించడం రైతులకు గౌరవం. దానికోసం నిధిని కేటాయించడం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఒక్కరికే సాధ్యం. ఇకపై రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు ఉండవు.
 - డి.క్రిష్ణమరాజు, రైతు రాఘవరాజపురం.
Share this article :

0 comments: