రూ.5 లక్షల కోట్ల స్కాంకు స్కెచ్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రూ.5 లక్షల కోట్ల స్కాంకు స్కెచ్

రూ.5 లక్షల కోట్ల స్కాంకు స్కెచ్

Written By news on Tuesday, December 9, 2014 | 12/09/2014


రాజధానంటూ రియల్ దందా
చంద్రబాబుపై వైఎస్సార్ సీపీ నేత గడికోట ధ్వజం
లక్ష ఎకరాలు కావాలంటూ రూ.5 లక్షల కోట్ల స్కాంకు స్కెచ్

 
సాక్షి, హైదరాబాద్: రాజధాని పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చటి పొలాలను రైతుల నుంచి లాక్కుని ఆయన తాబేదార్లకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌సీ శాసనసభాపక్షం కో ఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి ప్రతిపాదించిన తుళ్లూరు మండలం చుట్టుపక్కల టీడీపీ నేతలు వేలాది ఎకరాలు కొనుగోలు చేసేలా ప్రోత్సహించి చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారని ధ్వజమెత్తారు. రాజధానికి లక్ష ఎకరాలు కావాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.ఐదు లక్షల కోట్ల భూ కుంభకోణానికి పాల్పడేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.  మహారాష్ట్రలో అక్కడి సీఎం దేవేంద్ర పడ్నవీస్ విమానంలో ఎకానమీ క్లాసులో ప్రయాణిస్తుంటే బాబు మాత్రం టీడీపీకి ఎన్నికల్లో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక విమానాల్లో వెళుతున్నారని విమర్శించారు.
 
 ఒక్క హామీనైనా నెరవేర్చారా?
 చంద్రబాబు తన ఆర్నెల్ల పాలనలో మీడియా మేనేజ్‌మెంట్ మినహా ఎన్నికల హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాటాడారు.  ఎన్నికలకు ముందు చంద్రబాబు 200 నుంచి 300 హామీలు ఇచ్చారని, సీఎం పదవి చేపట్టాక మరో 50, 60 వాగ్దానాలు చేసిన ఆయన ఒక్కటీ  నెరవేర్చలేదని విమర్శించారు. వాటిలో ప్రధానమైనవి వ్యవసాయ రుణాల మాఫీ, వ్యవసాయ రంగానికి 9 గంటల విద్యుత్ ప్రధాన అంశాలన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను గడికోట విలేకరులకు చూపారు. వైఎస్ ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి ఎన్టీఆర్ పేరు పెట్టటం మినహా కొత్తగా చేసిందేమీ లేదన్నారు. 104, 108 పథకాలను నిర్వీర్యం చేశారన్నారు. అక్టోబర్ 2 నుంచి ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో అందరికీ మంచినీరు అందిస్తానన్నా అమలు కాలేదన్నారు. రూ.పది వేల కోట్లతో బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఆచరణలో మాత్రం చేసిందేమీ లేదన్నారు. చేనేత కార్మికులను రోడ్డున పడేసిన ఘనత బాబుదేనన్నారు. వైఎస్ హయాంలో కార్మికులకు ఇచ్చిన రూ.7 వేల బీమా కార్డును కూడా రద్దు చేశారన్నారు.
Share this article :

0 comments: