Home »
» పులివెందులలో వైఎస్ జగన్
పులివెందులలో వైఎస్ జగన్
పులివెందుల: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ శాసన సభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం అర్ధరాత్రి తిరుపతి నుంచి పులివెందుల చేరుకున్నారు. శనివారం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని ఎంపీ వైఎస్. అవినాష్‌రెడ్డి తెలిపారు. శనివారం ఉదయం స్థానిక సుభాకర్‌రెడ్డి ఫంక్షన్‌హాల్లో పెద్దజూటూరుకు చెందిన వైఎస్‌ఆర్ సీపీనాయకులు రామకృష్ణారెడ్డి తమ్ముని కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం ఆయన తొండూరు మండలం బోడువారిపల్లె గ్రామంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి సింహాద్రిపురం మండలం అహోబిలం గ్రామానికి చేరుకుని సీతారాముల విగ్రహాల ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొంటారు. తరువాత పులివెందుల క్యాంపు కార్యాలయానికి చేరుకుని పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. సాయంత్రం 5గంటలకు ప్రొద్దుటూరు చేరుకుని వైఎస్‌ఆర్ సీపీ నాయకులు అంబటి కృష్ణారెడ్డి కుమారుడు ఏర్పాటు చేసిన శ్రేయన్ ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. అనంతరం ఆయన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో హైదరాబాదు బయలుదేరి వెళతారని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు.
0 comments:
Post a Comment