నియంతలు కూడా ఇలా చేయరు... జగన్ కోసం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » నియంతలు కూడా ఇలా చేయరు... జగన్ కోసం

నియంతలు కూడా ఇలా చేయరు... జగన్ కోసం

Written By news on Saturday, October 6, 2012 | 10/06/2012

జగన్‌పై సాగుతున్న వేధింపులకు పరాకాష్ట - బెయిల్ హియరింగ్‌కు సరిగ్గా ఒకరోజు ముందు ఈడీ అటాచ్‌మెంట్‌కు రావడం. ఈడీకి ఇన్ని రోజులు ముహూర్తమే దొరకనట్టు సరిగ్గా ఇప్పుడే అదీ బెయిల్ కేసు విచారణ జరుగుతున్నప్పుడే ఎందుకు అటాచ్‌మెంట్‌కు వచ్చినట్టు? ఇన్నిరోజులు చిదంబరంను కలవని టీడీపీ ఎంపిలు ఇప్పుడే పనిగట్టుకొని ఎందుకు కలిసినట్టు? కలిసిన మరికాసేపటికి అటాచ్‌మెంట్ నోటీసు ఎందుకు ఇచ్చినట్టు? ఏమీ ఎరగనట్టుగా పాదయాత్ర పేరుతో నడుస్తున్న చంద్రబాబు అధికార పార్టీతో కుమ్మక్కయ్యి ఇదంతా చేయించడమే చూడటానికి చాలా అసహ్యం కలిగించేలా ఉంది.

ఇంతకాలం చాటుమాటుగా సాగిన పొత్తు ఇప్పుడు బట్టబయలు చేసి- ఎవరేమనుకున్నా మనకేమిటిలే అని చంద్రబాబు, కాంగ్రెస్ పెద్దలు బరితెగించి ఆడుతున్నారు. సిబిఐ చెప్పిన వంకలు తక్కువా? సిబిఐ కోర్టులో బెయిల్‌కు వెళితే- జగన్ సహకరించడం లేదు అని అడ్డం పడ్డారు. ఆ తర్వాత హైకోర్టులో సాక్షులను ప్రభావితం చేస్తాడు అని చెప్పారు. ఇప్పుడేమో పై రెండు కారణాలు వదిలేసి విచారణ ఇంకా పూర్తి కాలేదని చెప్తున్నారు. చట్టం అధికారంలో ఉన్నవారి చుట్టం అంటే ఇదే. బెయిల్ వచ్చే వాతావరణం ఉన్న ప్రతిసారీ ఎల్లో మీడియా భీతావహమైన పుకార్లు సృష్టిస్తోంది. అల్లరి చేస్తోంది. తనే దొంగతనం చేసి తనే దొంగ దొంగ అని అరుస్తోంది. 

జగన్ మౌనంగా హుందాగా ఉండటం వల్లేనా ఇంత ఆడుతున్నారు. కేసుల మీద కేసులు చార్జ్‌షీట్‌ల మీద చార్జ్‌షీట్‌లు... కొన్నాళ్లు స్తబ్దుగా ఉండటం... హటాత్తుగా కొత్త పథకంతో రావడం. నియంతల పాలనలో కూడా ఇంత దాష్టీకాలు జరగడం లేదు. విజయలక్ష్మిగారిని, భారతిగారిని వారి వేదనను చూసైనా న్యాయం పక్షం వహించాలి. ఒక వ్యక్తికి బెయిల్ పొందే హక్కును అందరం గౌరవించాలి. తొంభై రోజులు దాటేశాక కూడా జగన్‌ను జైలులో ఉంచారు. ఇప్పుడు మరో ఆరు నెలలు అంటున్నారు. ప్రజాదరణ కలిగి ఉండటమేనా జగన్ చేసిన తప్పు? కాని ఒకటి గుర్తుంచుకోండి... మీరు ఎంత ఇబ్బంది పెడితే అంత ప్రజాదరణ పెరుగుతోంది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ జగన్ జగన్ అని తమ గుండెల్లో జగన్ పేరు రాసుకుంటున్నారు. 
- ఆర్. రమేష్, అల్లూరు, నెల్లూరు జిల్లా

ప్రాణాలిచ్చే కోట్లమంది ఉన్నారు

నిన్నటి పేపర్లో వై.యస్ భారతి రాసింది చ దివాను. చాలా బాధనిపించింది. ఓ తల్లి ఆవేదన, ఓ భార్య బాధ, పిల్లల కన్నీళ్లు వృథా కావు తల్లీ. తుఫాన్ వ చ్చే ముందు నిశ్శబ్దంలో జరుగుతున్నవన్నీ జగనన్న విజయానికి సంకేతాలు. సింహం లాంటి జగనన్నకు సహధర్మఛారిణివి నువ్వు. కలత చెందిన ఆ పసి మనసులకు సర్దిచెప్పి, భూదేవి అంత సహనంతో వుండమ్మా. అంతా మంచే జరుగుతుంది.

ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందనగా నిన్ననే ఈడీ ఆస్తులను జప్తుచేసి, వివరాలు మీడియాకు విడుదల చేయటంలో అంతరార్థం ఏమిటి? సంధించిన అస్త్రం ఫలించినట్లు ఎల్లో మీడియా, టీడీపీ నాయకులు పండగ చేశారు. ఒకింత బాధగా వున్నా. చాలా గర్వంగా కూడా వుంది. ముఫ్పై తొమ్మిదేళ్ల ఓ వ్యక్తిని చూసి జాతీయ స్థాయి నాయకులు సైతం కలవరపడటం దేశ చరిత్రలోనే లేదు. పాలక, ప్రతిపక్షాలు ఒకటై సి.బి.ఐ., ఈడీలను ఆయుధాలుగా ఉపయోగించి, సింహాన్ని బంధించాలని సకల ప్రయత్నం చేస్తున్నారు. బయటికి వదిలి రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేదు వీరికి. ప్రజా బలం వున్న జగనన్నను చూసి ఏడవటం ఎందుకు? ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారని చాలామంది నాయకులు అడుగుతున్నారు. పదేళ్లు అంటే... పదిరోజులు, పది వారాలు, పది నెలలు కాదు కదా! ఒక తెలివైన బిజినెస్‌మేన్‌కి పదేళ్ల సమయంలో వ్యాపారాన్ని అభివృద్ధి చెయ్యటం సాధ్యపడదా?

ఒకవేళ జగన్ ఒక ముఖ్యమంత్రి కొడుకు కావటం వల్లనే అవినీతి జరిగుండవచ్చు అని మీ అనుమాన మైతే.. ఆ కోణంలో అప్పుడు నిర్ణయాలు తీసుకున్న క్యాబినెట్ నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాలని సి.బి.ఐని ఎందుకు ఆదేశించలేదు? బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని, అందుకు సూరీడు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకపోవటమే నిదర్శనమని సి.బి.ఐ వాదన. సి.బి.ఐ ప్రభావితం చేయడం వల్లే భయపడి సూరీడు ఏదైనా చెప్పుండవచ్చని మేము అనుకోవచ్చు కదా. ఇంతమంది కలిసి జగనన్న మీద ఎంత క క్ష కట్టారు? కోట్ల మంది ప్రజలు జగనన్న వైపు వున్నా ఏమీ చెయ్యలేరనా? జగన్ కాంగ్రెస్‌లో వుండి వుంటే ముందు క్యాబినెట్ మంత్రి, తర్వాత ముఖ్యమంత్రి అయ్యేవారని సాక్షాత్తు కేంద్రమంత్రి ఆజాద్ చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ను ప్రతి ఇంటి బిడ్డ అనుకొంటున్నారు. సహనంలో నుంచి పుట్టే నిర్ణయాలు చాలా కఠినంగా వుంటాయి. మా బాధ, కోపాన్ని చెప్పి కొంతమందిని ప్రశ్నించే అవకాశం కల్పించిన ఈ సాక్షి పత్రిక ద్వారా జగనన్నకు నేను ఒకటి చెప్పాలనుకొంటున్నాను. జగనన్నా కష్టం వెనుక సుఖం వుంటుంది. ఓ ఆశయం కోసం పోరాడుతున్నప్పుడు ఈ కష్టాలు సర్వసాధారణం. నీ వెనుక ప్రాణాలిచ్చే కోట్ల మంది ప్రజలున్నారు. నీకు జన్మనిచ్చిన తల్లి విజయమ్మ అయితే, నిన్ను బిడ్డగా భావించే ఎంతోమంది తల్లులు వున్నారు. ఏ తల్లి దీవెన వృథా కాదు. నువ్వు ధైర్యంగా వుండాలి. నాన్న గారి ఆశీస్సులతో, ఆ భగవంతుని దయ వల్ల మనకు మంచి రోజులు వస్తాయి. ఎప్పటికీ సింహం, సింహంలాగే వుండాలి. ఏనాటికైనా విజయం మనదే.

- నాగ శ్రీదేవి, కొండ్లోపల్లి, రాజంపేట

source:sakshi
Share this article :

0 comments: