వైఎస్ఆర్ సీపీ నేతల సమావేశం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీ నేతల సమావేశం

వైఎస్ఆర్ సీపీ నేతల సమావేశం

Written By news on Saturday, October 6, 2012 | 10/06/2012

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం అయ్యారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సుప్రీం తీర్పు, తదనంతర పరిణామాలు, పార్టీని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశంపై చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలతో పాటు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు హాజరయ్యారు. భేటీలో చర్చించిన అంశాలను పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.





'జగన్ను ఎదుర్కొనే సత్తా లేదు'
హైదరాబాద్ : వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి బెయిల్ రాకుండా చేయడానికి కాంగ్రెస్‌, టీడీపీలు ఎంతో కష్టపడి విజయం సాధించాయని ఆళ్లగడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. జగన్‌ జైల్లో ఉంటే తాము చెప్పినట్లు ప్రజలు వింటారని కాంగ్రెస్‌, టీడీపీలు అనుకుంటున్నాయని ఆమె అన్నారు. అయితే... జననేత లోపల ఉన్నా, బయట ఉన్నా ఆయనను ఎదుర్కొనే సత్తా ఆ రెండు పార్టీలకు లేవని శోభా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌, టీడీపీలు ప్రజా విశ్వాసం కోల్పోయిన పార్టీలని ఆమె అన్నారు.



విజయమ్మను కలిసిన కృష్ణబాబు

హైదరాబాద్ : పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ సీనియర్‌ నేత, కోవూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు) శనివారం లోటస్‌ పాండ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మను మర్యాద పూర్వకంగా కలిశారు. కృష్ణబాబుతోపాటు పార్టీ సీనియర్‌ నేతలు మైసూరా రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. 

కృష్ణబాబు నిన్న చంచల్గూడ జైలలులో శుక్రవారం చంచల్‌గూడ జైలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ నెలలోనే ముహూర్తం చూసుకుని కృష్ణబాబు పార్టీలో చేరే అవకాశం ఉంది.
Share this article :

0 comments: