బాబుపై రాజీనామాలకు ఒత్తిడి తేవాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబుపై రాజీనామాలకు ఒత్తిడి తేవాలి

బాబుపై రాజీనామాలకు ఒత్తిడి తేవాలి

Written By news on Monday, September 9, 2013 | 9/09/2013

బాబుపై రాజీనామాలకు ఒత్తిడి తేవాలి
* ప్రజలు, ఉద్యోగుల జేఏసీలు, ఉద్యమకారులకు వైఎస్సార్ కాంగ్రెస్ పిలుపు
* విభజనపై బాబు లేఖ వెనక్కి తీసుకోవాలి
* టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలంతా రాజీనామా చేస్తే కాంగ్రెస్‌పై ఒత్తిడి పెరుగుతుంది
* కోట్లాది మంది 40 రోజులుగా చేస్తున్న ఆందోళనలను కాంగ్రెస్, టీడీపీ వినిపించుకోవాలి
* ఇప్పటికైనా కుమ్మక్కు రాజకీయాలు విడనాడి.. నిజాయితీ రాజకీయాలు చేయాలి
* వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేతలు సుచరిత, శోభానాగిరెడ్డి బహిరంగ లేఖ
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను అడ్డుకోవాలంటే.. ప్రజలు, ఉద్యోగుల జేఏసీలు, ఉద్యమకారులు అందరూ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుమీద అడుగడుగునా వారి రాజీనామాల విషయంలో ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. విభజనకు వ్యతిరేకంగా రాష్ట్రంలో గత 40 రోజులుగా జరుగుతున్న ఆందోళనలు, కోట్ల మంది ప్రజలు వినిపిస్తున్న ఆక్రందనలను ఇప్పటికైనా వినిపించుకోవాలని కాంగ్రెస్, టీడీపీలకు విజ్ఞప్తిచేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలంతా కూడా రాజీనామా చేస్తే.. అక్కడ ఢిల్లీలో ఇక్కడ రాష్ట్రంలో దొంగ నాటకాలు ఆడుతున్న ఈ కాంగ్రెస్ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల మీద ఒత్తిడి పెరుగుతుందన్నారు. కాబట్టి ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ దిశగా ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. ఈమేరకు వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం ఉప నేతలు మేకతోటి సుచరిత, భూమా శోభానాగిరెడ్డి ఆదివారం సంయుక్తంగా ఒక బహిరంగ లేఖ రాశారు. లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది...

‘‘రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో 40 రోజులుగా జరుగుతున్న ఆందోళనలు, కోట్ల మంది ప్రజలు వినిపిస్తున్న ఆక్రందనలు ఇప్పటికైనా వినిపించుకోండి అని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను డిమాండ్ చేస్తున్నాం. ఇంకా కేంద్ర ప్రభుత్వం తన అధికార నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఒక పార్టీగా కాంగ్రెస్ నిర్ణయం మాత్రమే వెలువడిన నేపథ్యంలో ఇప్పటికీ మించిపోయింది లేదు. కాబట్టి, టీడీపీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు ఇప్పటికైనా రాష్ట్ర విభజన మీద తాను ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకుని, తాను రాజీనామా చేసి, తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల చేత కూడా రాజీనామా చేయిస్తే.. అప్పుడు ఈ కాంగ్రెస్, ఈ కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రాన్ని ఎలా విభజించగలరో చూద్దాం రండి!

ఇకనైనా రాష్ట్రంలో ప్రజలందరి బాగునూ కోరుతూ, ఇప్పటికైనా కుమ్మక్కు రాజకీయాలను విడిచి పెట్టి నిజాయితీతో కూడిన రాజకీయాలను చేయవలసిందిగా కాంగ్రెస్, టీడీపీలను మేం కోరుతున్నాం. లేదంటే కోట్లాది మంది ప్రజలకు కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రపు నీళ్లు తప్ప మంచినీళ్లు దొరకని పరిస్థితి వస్తుంది. నీటి కోసం రోజూ కొట్టుకునే పరిస్థితి వస్తుంది. చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు లేక వేరే రాష్ట్రాలకు వెళ్లవలసిన పరిస్థితి వస్తుంది. సంక్షేమ పథకాలు ఆగిపోయి డబ్బులు లేక జీతాలకు కూడా కటకటలాడాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందన్న విషయాన్ని అందరూ గుర్తించాలి.’
Share this article :

0 comments: