ఈనెల 18వ తేదీన వైఎస్సార్ సీపీ రాష్ట్రస్థాయి సమావేశం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈనెల 18వ తేదీన వైఎస్సార్ సీపీ రాష్ట్రస్థాయి సమావేశం

ఈనెల 18వ తేదీన వైఎస్సార్ సీపీ రాష్ట్రస్థాయి సమావేశం

Written By news on Friday, November 15, 2013 | 11/15/2013

హైదరాబాద్: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహనరెడ్డి అధ్యక్షతన ఈనెల 18వ తేదీన వైఎస్సార్ సీపీ రాష్ట్రస్థాయి సమావేశం జరుగనున్నట్లు పార్టీ ప్రకటించింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి సీజీసీ, సీఈసీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు, పార్లమెంటు అబ్సర్వర్లు, జిల్లా కన్వీనర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర కన్వీనర్లు, రీజనల్ కోఆర్డినేటర్లకు ఆహ్వానం అందింది. పార్టీలోని సంస్థాగత అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారని వైఎస్సార్ సీపీ తెలిపింది.
Share this article :

0 comments: