రైతు శ్రేయస్సు కోసం ఉద్యమిస్తాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైతు శ్రేయస్సు కోసం ఉద్యమిస్తాం

రైతు శ్రేయస్సు కోసం ఉద్యమిస్తాం

Written By news on Tuesday, November 12, 2013 | 11/12/2013

రైతుల శ్రేయస్సు కోసం ఎలాంటి ఉద్యమాలకైనా వెనుకాడేది లేదని, వారి సంక్షేమమే తమ పార్టీ ధ్యేయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కల్లూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద చెరకు రైతులు చేపట్టిన నిరాహార దీక్ష శిబిరాన్ని సోమవారం ఆయన సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్నదాతల విలువ వెలకట్టలేనిదని అన్నారు. వారు ఎంత కష్టపడినా ఒక్కోసారి పెట్టుబడి కూడా రావడం లేదని, అలాంటి రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని అన్నారు. చెరకు రైతులు మద్దతు ధర కోసం దీక్ష చేస్తుంటే యాజమాన్యంతో చర్చించాల్సిన స్థానిక ఎమ్మెల్యే, రాత్రికి రాత్రి ఫ్యాక్టరీకి వెళ్లి ధర నిర్ణయించామని ప్రకటించడం ఏమిటని ప్రశ్నిం చారు. ఇతర ప్రాంతాల్లో షుగర్ ఫ్యాక్టరీలు ఏ ధర చెల్లిస్తున్నాయో ఇక్కడా అదేవిధంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు చెరకు కటింగ్, రవాణా ఖర్చులు కూడా ఫ్యాక్టరీ యాజమాన్యాలే భరించాలని, ఎరువులు, పురుగుమందుల కొనుగోలుకు రైతులకు వడ్డీలేని రుణాలను, రాయితీలను అందించాలని కోరారు.

  రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు వారికి మద్దతుగా ఉంటామని చెప్పారు. అనంతరం శ్రీనివాస్‌రెడ్డితో పాటు రైతు సంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, మాదినేని రమేష్, నున్నా నాగేశ్వర్‌రావు, వై.కేశవరావు తదితరులతో కలిసి ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చించారు. రైతులకు మద్దతు ధర పెంచడంతో పాటు ఇతర ప్రోత్సాహకాల గురించి చర్చిం చేదుకు రెండు రోజులు సమయం ఇస్తే ఫ్యాక్టరీ ఎండీ దృష్టికి తీసుకెళ్తామని ఫ్యాక్టరీ వైస్ చైర్మన్ మురళీధర చౌదరి, జీఎం వై. వెంకటరామయ్య చెప్పారు. అనంతరం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ యాజమాన్యానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ సమన్వయకర్తలు మట్టా దయానంద్, నంబూరి రామలింగేశ్వరరా వు, జిల్లా స్టీరింగ్ కమటి సభ్యులు కీసర వెంకటేశ్వరరెడ్డి, జె నర్సింహా రెడ్డి, తుమ్మలపల్లి రమేష్, రావి సత్యనారాయణ, మండల కన్వీనర్ వైకంఠి హరిబాబు, కర్నాటి అప్పిరెడ్డి   పాల్గొన్నారు.
Share this article :

0 comments: