వరుస తుపానులతో రైతులు నష్ట పోతున్నా, ఆ రైతులకు రుణమాఫీ చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు రావడం లేదు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వరుస తుపానులతో రైతులు నష్ట పోతున్నా, ఆ రైతులకు రుణమాఫీ చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు రావడం లేదు?

వరుస తుపానులతో రైతులు నష్ట పోతున్నా, ఆ రైతులకు రుణమాఫీ చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు రావడం లేదు?

Written By news on Tuesday, November 26, 2013 | 11/26/2013

తూ.గో: వరుస తుపానులతో రైతులు నష్ట పోతున్నా, ఆ రైతులకు రుణమాఫీ చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు రావడం లేదని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రశ్నించారు. కాట్రేనికోనలో బాధితులతో మాట్లాడిన జగన్ వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రజలను ఆదుకోని ప్రభుత్వంలో రాష్ట్ర పౌరుడిగా ఉన్నందుకు తనకు సిగ్గుగా ఉందని జగన్ అన్నారు.
ఇటువంటి ప్రభుత్వంలో ఉన్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి  ఎందుకు సిగ్గు అనిపించడం లేదని నిలదీశారు. వరుస తుపాన్లతో రైతులు, మత్స్యకారులు నష్టపోతున్నా..ప్రభుత్వం కనీనం కేజీ బియ్యం, లీటర్ కిరోసిన్ ఇవ్వకపోవడం చాలా బాధాకరమన్నారు.
 
నష్ట పోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు తక్షణ సాయంగా ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. వారికి ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి వెంటనే ఆదుకోవాలన్నారు.  ఈ ప్రభుత్వం స్పందించినా.. స్పందించకపోయినా నాలుగు నెలలు ఓపిక పడితే రాబోయే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం
తుపాను బాధితులందరికీ అండగా ఉంటుందని జగన్ తెలిపారు.
Share this article :

0 comments: