వైఎస్ఆర్ సీపీ సమైక్యానికి సానుకూల స్పందన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీ సమైక్యానికి సానుకూల స్పందన

వైఎస్ఆర్ సీపీ సమైక్యానికి సానుకూల స్పందన

Written By news on Tuesday, November 26, 2013 | 11/26/2013

వైఎస్ఆర్ సీపీ సమైక్యానికి సానుకూల స్పందన
హైదరాబాద్ : రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే మూడు ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్ష అని ఆపార్టీ సీనియర్ నేత  మైసూరారెడ్డి  తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు జాతీయ స్థాయిలో వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కృషికి సానుకూల స్పందన వచ్చిందని ఆయన అన్నారు. మైసూరారెడ్డి మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ తీర్మానం లేకుండా ఆర్టికల్ 3 ప్రకారం విభజన సమంజసం కాదన్నారు.
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్, కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ ఇప్పటివరకూ అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీలను కలిశామన్నారు. తమ వాదనతో పలు పార్టీల నేతలు ఏకీభవించారని మైసూరారెడ్డి తెలిపారు. కొన్ని పార్టీల నేతలు అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారన్నారు.

తమ వాదన విని కొంతమంది నేతలు విస్మయం చెందారని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఇంతగా దిగజారి వ్యవహరిస్తుందని అనుకోలేదని కొందరు నేతలు తమతో చెప్పారని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న విషయం అందరికి చెప్పామన్నారు. రాష్ట్రపతిని కలిసినప్పుడు కూడా అదే అంశం చెప్పామని... మిగిలిన రాజకీయ పార్టీలను కూడా త్వరలోనే కలుస్తామని మైసూరారెడ్డి తెలిపారు
Share this article :

0 comments: