జగన్‌ను ఎదిరించడమంటే సునామీకి ఎదురు వెళ్లడమే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌ను ఎదిరించడమంటే సునామీకి ఎదురు వెళ్లడమే

జగన్‌ను ఎదిరించడమంటే సునామీకి ఎదురు వెళ్లడమే

Written By news on Saturday, March 15, 2014 | 3/15/2014

జగన్‌ను ఎదిరించడమంటే సునామీకి ఎదురు వెళ్లడమే
నరసాపురం అర్బన్, న్యూస్‌లైన్ : విశేష ప్రజాభిమానంతో ముందుకు సాగుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం విషయంలో నిర్ధిష్ట లక్ష్యంతో ముందుకు సాగిపోతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదిరించడమంటే భయంకర సునామీలో సముద్రానికి ఎదురు వెళ్లడమేనన్న వాస్తవాన్ని అన్ని రాజ కీయ పక్షాలు గుర్తుంచుకోవాలని నరసాపురం ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. శుక్రవారం నరసాపురం స్టీమర్ రోడ్‌లో నిర్వహించిన వైఎస్సార్ జనభేరి సభా వేదికపై వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కొత్తపల్లి ఉద్వేగంగా ప్రసంగించారు. వైఎస్ జగన్ రాష్ట్రానికి బంగారు భవిష్యత్ ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉం డాలన్న ఏకైక లక్ష్యంతో ఏ పార్టీ చేయని విధంగా ధైర్యం చేసి నిలబడ్డారని అన్నారు. ఆయనను విమర్శించే ముందు ప్రతిపక్షాలు తాము అవలంభిస్తున్న విధానాలను, తప్పుడు పద్ధతులను గుర్తు తెచ్చుకోవాలన్నారు.
 
 జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనానికి, ప్రజల నుంచి ఆయనకు లభిస్తున్న మద్దతు చూసి ఇతర రాజకీయ పార్టీలు ఓర్వలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వం కొన్నినెలల క్రితం దుర్మార్గమైన ఆలోచన ఒకటి చేసిందని వివరించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరపకుండా, కేవలం పార్లమెంట్ ఎన్నికలు మాత్రమే పెట్టాలని ఆలోచన చేసిందన్నారు.
 
 ప్రభుత్వంలో భాగంగా ఉన్న  తాను దానిని వ్యతిరేకించానని చెప్పారు. అతి చిన్న వయసులో పేదల కష్టాలను అవగతం చేసుకుని, ఒక మహోన్నత లక్ష్యంతో ముందుకు వెళుతున్న నాయకుడు దేశంలో వైఎస్ జగన్ తప్ప మరెవరూ లేరని అన్నారు. అందువల్లే తాను నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరానని పేర్కొన్నారు. ఈ పార్టీలోకి రావడం ఆనందంగానూ, గర్వంగానూ ఉందని పేర్కొన్నారు. ఒక చరిత్రకు శ్రీకారం చుట్టబోయే ఎన్నికలు ప్రస్తుతం జరుగుతున్నాయని, మే 7వ తేదీ వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కంటిమీద కునుకు లేకుండా పనిచేసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ గూడూరి ఉమాబాల తదితరులు మాట్లాడారు.
 
Share this article :

0 comments: