సమష్టి సంకల్పం... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సమష్టి సంకల్పం...

సమష్టి సంకల్పం...

Written By news on Thursday, March 13, 2014 | 3/13/2014

వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం బుధవారం జిల్లాలోని మహబూబ్‌నగర్, అచ్చెంపేట, జడ్చెర్ల తదితర ప్రాంతాల్లో నిర్వహించారు. జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్మకిష్టా రెడ్డి హాజరై పతాకావిష్కరణ చేశారు. మహానేత వైఎస్సార్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ప్రతినపూనారు.
 
 మహబూబ్‌నగర్ అర్బన్, న్యూస్‌లైన్: అన్ని వర్గాల ఆదరణ పొందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహానేత వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. అ నంతరం ఎడ్మ పా ర్టీ పతాకాన్ని ఎగురవేశారు.
 
 ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ వై ఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్య తిరేకం కాదన్నారు. కొంతకాలం కలిసి ఉండి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిన తర్వాతే విడిపోతే మంచిదని తమపార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సమైక్యంగా ఉం చడం కోసం ప్రయత్నించారని పేర్కొన్నారు.
 
 ప్రజల శ్రే యస్సు కో సం ఏళ్ల తరబడి రాత్రింబ వళ్లు ప్రజల మధ్య ఉంటూ యువనేత రాజకీ య చరిత్ర లో చెరగని ముద్ర వేశార ని అన్నారు. వైఎస్ రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్‌లు మహానే త ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాజన్న రాజ్యం తిరిగి వస్తుందన్న ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.
 
 పార్టీ ఫ్లీనరీలో ప్రకటించిన పేదకుటుంబాల పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించే అమ్మఒడి, వికలాంగులకు రూ.1500లు, వృద్ధులు, వితంతువులకు రూ.200 నుంచి రూ.500కు పెంచుతామని, తొమ్మిది గంటల కరెంట్ సరఫరా, ఫీజు రీయింబర్స్‌మెంట్, మైనార్టీలకు రాజకీయ రిజ ర్వేషన్లు తదితర అంశాలు అమలవుతాయన్నా రు. జగనన్న సీమాంధ్రలో ముఖ్యమంత్రి కావ డం ఖాయమని, పదేళ్ల పాటు ఉమ్మడి రాజధా ని హైదరాబాద్‌లో ఉండి తెలంగాణ ప్రజలకు బాసటగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశా రు.  కార్యక్రమం లో పార్టీ జిల్లా అధికార ప్రతిని ధులు ఎం.భగవంతురెడ్డి, ఆర్యభవన్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ మాధవయ్య, మాజీ జెడ్పీటీసీలు భీమయ్య గౌడ్, పప్పు జంగయ్య గౌడ్, యువజన, విద్యార్థి, మైనార్టీ విభాగాల జిల్లా కన్వీనర్లు రవిప్రకాశ్, కృష్ణవర్ధన్‌రెడ్డి, మహమూద్ అలీ సనా, తదితరులు పాల్గొన్నారు.
 
 కల్వకుర్తి మున్సిపాలిటీపై జెండా ఎగురవేస్తాం
 మున్సిపాలిటీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, షాద్‌నగర్, కల్వకుర్తిలో తమ పార్టీ అభ్యర్థులు బలమైన పోటీ ఇస్తున్నారని జిల్లా కన్వీనర్ ఎడ్మ వెల్లడించారు. కల్వకర్తి నగరపాలికను సులభంగా కైవసం చేసుకొని తమ పార్టీ జెండాను ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కల్వకుర్తి చైర్మన్ అభ్యర్థిగా సోఫీ అనే యువకుడిని ఎంపిక చేశామన్నారు. అన్ని సామాజిక వర్గాల నుంచి కౌన్సిలర్ అభ్యర్థులను పోటీలు పెట్టి విజయాన్ని సాధిస్తామని పేర్కొన్నారు. మిగతా నాలుగు మున్సిపాలిటీల్లో పదేసి కౌన్సిలర్ స్థానాలను గెలుచుకొని చైర్మన్ ఎన్నికల్లో ప్రధాన భూమిక పోషిస్తామన్నారు.
Share this article :

0 comments: