పేదల బాధలు స్వయంగా చూసి రాసిన మేనిఫెస్టో - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పేదల బాధలు స్వయంగా చూసి రాసిన మేనిఫెస్టో

పేదల బాధలు స్వయంగా చూసి రాసిన మేనిఫెస్టో

Written By news on Monday, April 14, 2014 | 4/14/2014

అభివృద్ధి, సంక్షేమం
  • పేదల బాధలు స్వయంగా చూసి రాసిన మేనిఫెస్టో ఇది
  •   ఎవరూ చేయని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా
  •   వైఎస్ సువర్ణ రాష్ట్ర స్వప్నం కన్నా గొప్ప పాలన అందిస్తాం
  •   నేను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు..చనిపోయాక  అందరి గుండెల్లోనూ నిలిచిపోవాలి.. అదే నా ఆశయం
  •   హైదరాబాద్‌ను మించిన నగరాన్ని రాజధానిగా నిర్మిస్తా
  •   ఉద్యోగులు గర్వపడేలా పీఆర్సీ... సమ్మె కాలానికి జీతాలిస్తాం
  •   {పతి విద్యార్థికీ సొంత తమ్మునిలా ఉద్యోగం ఇప్పించే కృషి చేస్తా 
 పూరి గుడిసెల్లోకి వెళ్లి వారి పేదరికాన్ని చూసిన తర్వాత వారి సమస్యలే నా కుటుంబ సమస్యలుగా భావించా. 20 నుంచి 40 నిమిషాలు వాళ్ల సమస్యలు విన్నా. తినడానికి తిండి కూడా లేని బాధలు వాళ్లవి. ఆ బాధాతప్త గుండెల్లోంచి వచ్చిన దృక్పథమే ఈ మేనిఫెస్టో. ఏసీ రూముల్లో కూర్చుని దీన్ని తయారుచేయలేదు. నేను చూసిందే రాశా. చెప్పిందే చేస్తా. చేసిందే చెప్తా. ఎండనక, వాననక, పగలనక, రాత్రనక రాష్ట్రమంతా తిరిగా. ఎవరూ తిరగనంతగా తిరిగా. ఎవరూ చేయని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా. ఎన్నో దేశాలు తిరిగా. గొప్ప పాలన అందిస్తా... నాయకుడంటే తొలి రోజు నుంచే కార్యాచరణ ప్రణాళిక ఉండాలి.. నేను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. చనిపోయిన తర్వాత అందరి గుండెల్లో నిలిచిపోవాలి. ప్రతి ఇంట్లో నాన్న ఫొటో పక్కనే నా ఫోటో పెట్టుకోవాలి. అదే నా ఆశయం...
 - ఎన్నికల ప్రణాళిక విడుదల చేసిన సందర్భంగా వై.ఎస్.జగన్ ఉద్వేగం
 
  • వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రణాళిక ముఖ్యాంశాలివీ
  • పిల్లల్ని బడికి పంపే తల్లి ఖాతాలో డబ్బు. ‘అమ్మ ఒడి’ పథకం కింద 1 నుంచి 10వ తరగతి వరకు ప్రతి బిడ్డకు నెలకు రూ.500 చొప్పున ఇస్తారు. ఇంటర్ చదివిస్తే  రూ. 700, డిగ్రీలో రూ.1,000 వేస్తారు.
  • వృద్ధులు, వితంతువుల పింఛన్లు రూ. 700కు పెంపు. పింఛన్ల వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు. వికలాంగుల పింఛను రూ. 1,000కి పెంపు.
  •  ప్రభుత్వ బాధ్యతగా రైతులకు గిట్టుబాటు ధర, మద్దతు ధర.
  •  ఇందుకోసం రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు.
  • ఆరోగ్యశ్రీ, రేషన్, పింఛన్.. ఏ కార్డ్డుఅయినా అదే గ్రామంలోనే, అదే వార్డులోనే 24 గంటల్లో జారీ చేసేలా ప్రతి గ్రామంలో, వార్డులో ప్రత్యేకంగా ప్రభుత్వ ఆఫీసు ఏర్పాటు.
  • 2019 నాటికి విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా చేస్తామని హామీ.
  •  వ్యవసాయానికి రోజుకు 7 గంటల నిరంతరాయంగా ఉచిత విద్యుత్. అది కూడా పగటి పూటే ఇచ్చే ఏర్పాటు.
  •  రూ. 20 వేల కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ.. మహిళలకు వడ్డీలేని రుణాలు
  • 2019 నాటికి గుడిసే లేని రాష్ర్టంగా తీర్చి దిద్దే లక్ష్యంతో ఏటా 10 లక్షల ఇళ్ల నిర్మాణం. మునుపటిలా పక్కా ఇంటి నిర్మాణానికి మార్జిన్ మనీ, రుణ భారం లేకుండా ప్రభుత్వమే కట్టించి ఇచ్చే ఏర్పాటు.
  • ఇల్లు ఇచ్చినపుడే ఆడపడుచు పేరున ఇంటి పట్టా. బ్యాంకర్లతో మాట్లాడి ఈ ఇల్లే గ్యారంటీగా స్వయం ఉపాధి కోసం రూ.30 వేల వరకు పావలా వడ్డీ రుణం. 
  •   అత్యాధునికమైన, పర్యావరణపరంగా అత్యున్నతమైన, ప్రపంచస్థాయి నగరాలతో పోల్చదగిన రాజధాని సామాన్యుడికి  చేరువగా నిర్మాణం. కొత్త రాజధానికి,
  •  ప్రధాన నగరాలకు మధ్య రాపిడ్ రైల్ ట్రాన్స్‌పోర్ట్.
  •   {పతి కుటుంబానికీ సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ 
  •  ఒక్కో దానిపై అదనంగా రూ. 100 సబ్సిడీ.
 
బెల్ట్ షాపు అనేదే కనిపించకుండా సంపూర్ణ నిర్మూలన. నియోజకవర్గానికి ఒకే ఒక్కచోట మద్యం ఉండే ఏర్పాటు..అక్కడ కూడా సామాన్యుడికి అందుబాటులో లేని విధంగా ధరలుండేలా చర్యలు. అక్రమ మద్యాన్ని గ్రామాల్లోకి రాకుండా అడ్డుకునేందుకు ప్రతి పల్లెలో అదే గ్రామానికి చెందిన 10 మంది మహిళలు పోలీసులుగా నియామకం. వీరికి మద్యనియంత్రణ పర్యవేక్షణతోపాటు సోషల్ ఆడిటింగ్ బాధ్యతలు. 
 
మరింత పకడ్బందీగా ఆరోగ్యశ్రీ అమలు. ఆరోగ్యశ్రీ నుంచి తప్పించిన అన్ని వ్యాధులనూ మళ్లీ చేరుస్తామని హామీ. డాక్టర్ల కొరత లేకుండా జిల్లాకొక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. కొత్త రాజధానిలో 20 ఫ్యాకల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో కూడిన హెల్త్ సిటీ నిర్మాణం. ఆరోగ్యశ్రీలో వైద్యం పొందిన వారు కోలుకునే సమయంలో నెలకు రూ. 3000 సహాయం. 104, 108 వాహనాల సంఖ్య పెంపు
 
  13 జిల్లాలనూ కలుపుతూ పరిశ్రమల కారిడార్లు. విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్, అలాగే, పీసీపీఐఆర్ ఏర్పాటు దిశగా కృషి. మన్నవరంలో ఎన్టీపీసీ-బీహెచ్‌ఈఎల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయడానికి కృషి. రాయలసీమలో అనంతపురం నుంచి కృష్ణపట్నం వరకు మరో కారిడార్.  కారిడార్లకు 8 లేన్ల రోడ్ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థ, రైలు మార్గం, బులెట్ ట్రైన్ సదుపాయం ఏర్పాటు. ఈ కారిడార్లతో అన్ని జిల్లా కేంద్రాలనూ అనుసంధానించేలా రహదారుల నిర్మాణం.
 
  {పతి జిల్లాలోనూ ఆగ్రో ప్రాసెసింగ్ కేంద్రం ఏర్పాటు చేసి, ప్రాసెసింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్, ట్రాన్స్‌పోర్ట్, మార్కెటింగ్ సదుపాయాల ద్వారా వేల కొద్దీ అదనపు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన.
 
  కొత్తగా ఏర్పడబోతున్న సీమాంధ్రలోని పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చర్యలు. అన్ని పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం పెట్టడంతోపాటు, ఉపాధ్యాయుడు-విద్యార్థి రేషియో తగ్గించడం ద్వారా మరిన్ని ఉద్యోగాల కల్పన.
 
  విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి ఎయిర్‌పోర్టులను అంతర్జాతీయ విమాన కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు. ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రైల్వేజోన్ ఏర్పాటు. విశాఖలో మెట్రో రైలు,  విజయవాడ, గుంటూరు, తెనాలి-మెట్రోపాలిటన్ ఏరియాలో  మెట్రో రైలు నిర్మాణం. దుగ్గరాజపట్నం నౌకాశ్రయ నిర్మాణం. మచిలీపట్నం, వాన్‌పిక్ పోర్టుల నిర్మాణం.
 
 సంక్షేమానికి ఇలా..
 * 2009లో వైఎస్‌ఆర్ ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా.. కుటుంబంలో ఒక్కొక్కరికీ 6 కిలోల చొప్పున 30 కిలోల వర కు బియ్యం పంపిణీ.
 * చేనేత కార్మికుల వ్యక్తిగత రుణాల మాఫీ.. చేనేతల పింఛను రూ. 1000కు పెంపు.
 * ప్రతి గ్రామంలోనూ మినరల్ వాటర్‌ను నామమాత్రపు ధరలకే సరఫరా చేసేందుకు ప్రభుత్వ నిధులతో రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్ల ఏర్పాటు.
 * ప్రతి నియోజకవర్గంలో వృద్ధ, అనాథాశ్రమాలు.
 * హిందూ దేవాదాయ సంస్థల నిర్వహణలో ప్రభుత్వ జోక్యం తగ్గింపు.
 
 రైతన్నకు ఇలా..
 * వ్యవసాయ సేవల విస్తరణకు 102 టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు. పశుపాలన సేవల విస్తరణకు 103 టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు.
 * రైతులకు వడ్డీ లేని పంట రుణాలు. యాంత్రీకరణను ప్రోత్సహించటానికి రైతులకు వ్యవసాయ యంత్రాల కొనుగోలుపై సబ్సిడీలు. రైతు రుణాల మాఫీ కోసం కేంద్రంపై ఒత్తిడి.
 * ప్రకృతి విపత్తుల సమయాల్లో కేంద్ర ప్రభుత్వం సహాయం వచ్చే వరకు ఎదురుచూడకుండా రైతును వెంటనే ఆదుకునేందుకు రూ. 2000 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు.
 
 ఉద్యోగులు, నిరుద్యోగులకు..
 * వీలయినంత త్వరగా కొత్త పీఆర్‌సీ, గరిష్టంగా ఫిట్‌మెంట్ ఇచ్చేందుకు చర్యలు.
 * ఉద్యోగులు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చేసిన సమ్మెను ప్రత్యేకమైనదిగా పరిగణించి, వారందరికీ సమ్మె కాలానికి జీతాలు చెల్లింపు. 
 * ఐకేపీలో హెచ్‌ఆర్ పాలసీద్వారా పని చేస్తున్న ఏరియా కోఆర్డినేటర్లు, ఏపీఎంలు, అకౌంటెంట్లు, సీసీల ఉద్యోగాల క్రమబద్ధీకరణ.
 * అధికారంలోకి రాగానే ఆర్టీసీలో కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్‌పై కమిటీ నియామకం. ఆ సిఫార్సుల మేరకు ఆర్టీసీ కార్మికులను రెగ్యులర్ స్కేళ్లలో నియామకం. 
 * గత నాలుగున్నరేళ్ళుగా రాష్ట్రంలో పరిపాలన స్తంభించి ఏటా రిక్రూట్‌మెంట్ జరగనందున, ప్రభుత్వోద్యోగ నియామకాల వయోపరిమితి 34 నుంచి 40కి పెంపు.
 
 ఎస్సీలు, బీసీలు, రిజర్వేషన్లు..
 * దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా పరిగణించేలా అసెంబ్లీలో మరో తీర్మానం.. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేందుకు చర్యలు.
 * బీసీల సంక్షేమానికి రూ. 12000 కోట్లు, చేనేత కార్మికుల సంక్షేమానికి రూ. 1200 కోట్లు.
 * బోయ, వాల్మీకి, కొండ కుమ్మరి, వడ్డెర, మత్స్యకారుల్లో మరికొన్ని కులాలను షెడ్యూల్డు తెగల జాబితాలో చేర్చటానికి అసెంబ్లీలో తీర్మానం.
 * ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కొనసాగింపు.
 
 అభివృద్ధి, ఉపాధి
 * జిల్లాకు ఒక ఎయిర్‌పోర్టు, ఒక యూనివర్సిటీ, ఒక సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి, రెండు జిల్లాలకు ఒక వ్యవసాయ కళాశాల, ప్రతి జిల్లాకు ఆగ్రి ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు. రెండేసి జిల్లాలకు అగ్రి కాలేజ్ ఏర్పాటు.
 * రాష్ట్రంలో మూడు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రతి రెండు జిల్లాలకు వ్యవసాయ డిగ్రీ కళాశాల, పంటలనుబట్టి  ఒకటి చొప్పున వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఏర్పాటు. ప్రత్యేక విద్యా సంస్థలతో పాటు గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణం.
 * కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో ఐటీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్‌లకు ప్రోత్సాహం.
 * ఉపాధి హామీని మున్సిపాలిటీలకు విస్తరించడానికి కేంద్రంపై ఒత్తిడి.
 
 అవినీతికి అడ్డుకట్ట
 * అవినీతి రహిత సమర్థ పాలన అందించేందుకు ప్రత్యేక వ్యవస్థ. అత్యున్నత నిర్ణయాలను అమలుకు ముందే పరిశీలించే వ్యవస్థను సూచించాల్సిందిగా రాష్ట్ర హైకోర్టుకు, కాగ్‌కు విజ్ఞప్తి.
 
 విద్యార్థులకు..
 * అధికారంలోకి రాగానే పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు.
 * ప్రతి గవర్నమెంటు బడిలోనూ ఇంగ్లిషు మీడియం.
 * అన్ని సాంఘిక సంక్షేమ హాస్టళ్ళలో సదుపాయాలు విస్తృత పరిచి, ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంపు.
 * ఎయిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజీ ఏర్పాటు, పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్ల సంఖ్యను రెట్టింపు.
 
 ప్రాజెక్టులన్నీ పూర్తి.. 
 * ఆగిపోయిన సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి..
 * ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదాకు కేంద్రంపై ఒత్తిడి
 * సహకార ఉద్యమ పద్ధతిలో సాగు.. వ్యవసాయానికి ఇద్దరు మంత్రులు
 * కరీంనగర్, శంకర్‌పల్లి, కేటీపీపీ ప్లాంట్ల నిర్మాణం
 * ప్రతీ ఫైలుకూ బార్‌కోడింగ్, ప్రతీ దశలోనూ సమీక్ష
 * 2019నాటికి కరెంటు కోతలు లేని రాష్ట్రం
 * మరమగ్గాలకు రూ.1.50కే యూనిట్ విద్యుత్ సరఫరా
 * అర్చకులకు పింఛను పెంపు, చారిత్రక ఆలయాల అభివృద్ధి
Share this article :

0 comments: