జగన్‌ విజన్.. రాష్ట్ర అభివృద్ధికి ఆయన సూచనలతో సిద్ధమైన బ్లూప్రింట్. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌ విజన్.. రాష్ట్ర అభివృద్ధికి ఆయన సూచనలతో సిద్ధమైన బ్లూప్రింట్.

జగన్‌ విజన్.. రాష్ట్ర అభివృద్ధికి ఆయన సూచనలతో సిద్ధమైన బ్లూప్రింట్.

Written By news on Sunday, May 4, 2014 | 5/04/2014

సువర్ణ సీమాంధ్ర నిర్మాణానికి నవ సంకల్పం
రాజధాని సహా తొమ్మిది అంశాలపై జగన్ దృష్టి
ఆయన సూచనల్ని పరిగణనలోకి తీసుకుని వైఎస్సార్ కాంగ్రెస్‌లో చర్చ
 వాటి ఆధారంగా అంతర్జాతీయ     కన్సల్టెంట్లతో చర్చించి నివేదిక
 ఆ నివేదికను జగన్‌మోహన్‌రెడ్డికి అందజేసిన నిపుణులు
 దాన్ని పరిశీలిస్తున్న జగన్; అభివృద్ధి రాజధానికే పరిమితం కాకూడదనే ఉద్దేశం
 ప్రాంతాల వారీగా రాష్ట్రమంతటా పరిశ్రమలు, మౌలిక సౌకర్యాలపై దృష్టి
 అన్ని ప్రాంతాల వారికీ     అందుబాటులో ఉండేలా రాజధాని
 హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి కూడా కనెక్టివిటీ
 విద్య, ఆరోగ్యం, నీరు, వ్యవసాయం సహా తొమ్మిది అంశాలపై ఫోకస్
 రాష్ట్ర సంస్కృతికి సైతం పెద్ద పీట
 
 అందరికీ అన్నీ అనుకూలంగా ఉండవు! వాటినే తలచుకుంటూ కూర్చోకుండా అనుకూలంగా లేని వాటన్నిటినీ అవకాశాలుగా మార్చుకోవాలి. సాధించడానికి చెమటోడ్చాలి... ఇదే నాలుగున్నరేళ్లుగా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహార శైలి చెబుతున్న సత్యం. అందుకే ఆయన ఎందరు దాడి చేసినా నిలబడ్డారు. ఏ దేశ చరిత్రలోనూ లేని విధంగా అన్ని పార్టీలూ... వర్గాలూ... మీడియా గొంతులూ ఒక్కటై ఆయనపై కుట్ర చేసినా... నీతిలేని పొత్తులు ఆవిష్కృతమైనా... ఆయన బెదిరిపోలేదు. ఎదిరించారు. ఒక్కడిగానే ఎదురొడ్డి... విజయపతాకం ఎగరేయడానికి సిద్ధమయ్యారు.
 
 ఇది విజన్.. ఈ రాష్ట్ర అభివృద్ధిలో నా ముద్ర చిరస్థాయిగా ఉండాలి... అని భావించే వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి విజన్. 35 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి... ఓ రాష్ట్ర అభివృద్ధికి ఆయన సూచనలతో సిద్ధమైన బ్లూప్రింట్. అభివృద్ధి యావత్తూ రాజధానికే పరిమితం కాకుండా సీమాంధ్రలోని ప్రతి ప్రాంతానికీ అన్నిరకాల సేవలూ అందాలని, అన్ని చోట్లకూ పరిశ్రమలను విస్తృతం చేస్తూ... మానవాభివృద్ధికి, సమ్మిళిత అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్న ముసాయిదా. ఈ ముసాయిదాలో రాజధానితో పాటు పారిశ్రామిక కారిడార్, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పర్యాటకం-వినోదం, క నెక్టివిటీ, నీరు, వ్యవసాయం వంటి తొమ్మిదంశాలూ... తొమ్మిది స్తంభాలు. తొమ్మిది పునాదిరాళ్లు. మేధావులు, అంతర్జాతీయ కన్సల్టెంట్లు, హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ విశ్లేషకుల అంచనా ప్రకారం... ఈ తొమ్మిది స్తంభాలపై నిర్మించే సీమాంధ్రలో మెరుగైన అభివృద్ధి సాధ్యమవుతుంది.  ఈఅభివృద్ధి వ్యూహంలో రైతు నుంచి పారిశ్రామిక వేత్తదాకా... యువత నుంచి వృద్ధుల దాకా అందరి పాత్రా ఉంటుంది.
 
 సామాజిక అభివృద్ధి
 
 సీమాంధ్రలో ప్రజలు సమగ్ర అభివృద్ధి సాధించాలన్నా, మానవాభివృద్ధి సూచికల్లో ముందుండాలన్నా ఆరోగ్యం, విద్య వంటి కీలకాంశాలతో పాటు జీవన ప్రమాణాల పైనా దృష్టి పెట్టాలి.
 వైద్యం, ఆరోగ్యం...
 
 రాష్ట్రంలో కొత్త ఆసుపత్రులు వచ్చి, అవన్నీ స్థానికులకు అందుబాటులో ఉంటేనే జనం సురక్షితంగా ఉంటారు.
 
 ప్రత్యేకంగా దృష్టి సారించటం వల్ల రాయలసీమ ప్రాంతంలో ఆరోగ్య సౌకర్యాలు మెరుగుపడతాయి.
 
 శిశు అభివృద్ధి పథకాల కోసం టెక్నాలజీని వినియోగించుకోవటంతో పాటు ఇతర చర్యలూ చేపట్టాల్సి ఉంటుంది.
 
 వ్యవసాయం... నీరు
 
 సీమాంధ్రలో అత్యధిక జనాభా ఆధారపడ్డది వ్యవసాయంపైనే. మౌలిక సదుపాయాలను మెరుగుపరచటంతో పాటు నీటి లభ్యత, టెక్నాలజీని వాడితే దిగుబడి పెరుగుతుంది. దీంతోపాటు రైతాంగ జీవన ప్రమాణాలూ మెరుగవుతాయి.
 
 వ్యవసాయం
 
 బంజరు భూముల సాగు: మైక్రో బయోలాజికల్ పద్ధతులు వాడటం, మైక్రో న్యూట్రియెంట్లు, బయోమాస్‌ను వినియోగించటం వంటి చర్యలతో బంజరు భూముల సాగు. ప్రత్యేకించి రాయలసీమకు ఇది అవసరం.
 
 ఫుడ్ ప్రాసెసింగ్: ఫుడ్ ప్రాసెసింగ్, గిడ్డంగులు, శీతల గిడ్డంగులు, ప్యాకేజింగ్ పరిశ్రమల వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి.
 
 యూనివర్సిటీ, అభివృద్ధి సంస్థలు
 
 సమగ్ర, ఆధారపడదగ్గ వ్యవసాయ వ్యూహాన్ని రూపొందించడానికి సీమాంధ్ర వ్యవసాయ అభివృద్ధి అథారిటీ (ఎస్‌ఏడీఏ) ఏర్పాటు.
 
 ప్రాంతీయ సమతౌల్యం సాధించడానికి చిత్తూరులో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి. ఇది ఆ ప్రాంతంలో వ్యవసాయ పరిశోధనలకూ సహకరిస్తుంది.
 
 నీరు...
 
 సముద్ర నీటి నిర్లవణీకరణ (డీశాలినేషన్): పెరుగుతున్న నీటి వినియోగాన్ని, డిమాండ్‌ను తట్టుకోవటానికి ఉప్పునీటిని మంచినీటిగా మార్చే టెక్నాలజీపై పెట్టుబడులు.
 
 సౌర విద్యుత్ వినియోగం: నీటి ఎద్దడి విపరీతంగా ఉండే ప్రాంతాల్లో సురక్షిత తాగునీటి కోసం ‘వాటర్ ఫ్రమ్ ఎయిర్’ టెక్నాలజీతో నడిచే వాటర్ డిస్పెన్సర్ల వినియోగం.
 
 రీసైకిల్- రీయూజ్
 
 శుద్ధి చేసిన వేస్ట్ వాటర్‌ను పారిశ్రామిక అవసరాలకు, వ్యవసాయానికి తిరిగి వినియోగించేలా టెక్నాలజీపై పెట్టుబడులు.
 ఆయకట్టు నీటిని తిరిగి వినియోగించేందుకు దాన్ని శుద్ధి చేసే టెక్నాలజీపై పెట్టుబడులు.
 
 మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్
 
 ఆధునిక రవాణా సౌకర్యాలతో పరిశ్రమలకు గానీ, పౌరులకు గానీ కావాల్సిన ప్రాంతానికి వేగంగా వెళ్లే సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. అభివృద్ధికి సైతం అదో చోదకమవుతుంది.
 
 ఆసియాలోనే అతిపెద్ద ప్రైవేటు పోర్టు ఏర్పాటవుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీపడే 5 విమానాశ్రయాలొస్తాయి. హై-స్పీడ్ రైల్, రాజధానిలోను, ఇతర ప్రధాన నగరాల్లోను మెట్రోరైల్, కొత్త 8 లైన్ల రోడ్లు, 4వ నంబరు జాతీయ నీటి రహదారి (వాటర్‌వే) అభివృద్ధి కారణంగా జీడీపీ పెరుగుతుంది.
 
 మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలకు ఉపాధి దొరుకుతుంది. ఉద్యోగ అవకాశాలు 4 శాతం వరకూ పెరుగుతాయి.
 
 విద్యుదుత్పత్తి
 
 దేనికైనా విద్యుత్ సామర్థ్యమే పునాది. ఆ పునాదిపైనే అత్యద్భుతమైన పారిశ్రామిక నగరాలు తమను తాము నిర్మించుకున్నాయి.
 
 సంప్రదాయేతర వనరులపై ఫోకస్ పెట్టి విద్యుత్‌ను అదనంగా ఉత్పత్తి చేయాలి. దీంతో సీమాంధ్ర మిగులు విద్యుత్‌ను ఉత్పత్తి చేసే రాష్ట్రమవుతుంది. దానివల్ల అందుబాటు ధరలోనే రాష్ట్ర ప్రజలకు కరెంటు దొరుకుతుంది.
 
 విండ్ ఫన్నెల్ టెక్నాలజీ (పవన విద్యుత్) ద్వారా పవన విద్యుత్‌ను 4 ప్రాంతాలను, థర్మల్ విద్యుత్‌కు 8 ప్రాంతాలను ప్రతిపాదించాం. దీనివల్ల వచ్చే పదేళ్లలో సీమాంధ్ర విద్యుత్ సామర్థ్యం 20వేల మెగావాట్లకు చేరుతుంది.
 
 పర్యటకం-వినోదం
 సుదూర తీరప్రాంతం ఉంది. అందమైన దేవాలయాలున్నాయి. అద్భుతమైన సహజ సౌందర్యం ఉంది. ఈ మూడింటితో ప్రపంచానికి ‘బ్రాండ్ సీమాంధ్ర’ పరిచయమవుతుంది.
 
 బౌద్ధారామాలు, దేవాలయాలు వీటిలో భాగంగా ఉంటాయి. ప్రతిపాదిత అత్యాధునిక బీచ్ కారిడార్ వినోదానికి మారుపేరుగా ఉంటుంది. దీన్లో ఉండే అంతర్జాతీయ స్థాయి ‘ఓషనేరియం’ కారణంగా రాష్ట్రానికి వచ్చే పర్యటకుల సంఖ్య పెరుగుతుంది.
 
 సీమాంధ్రలో కేవలం బీచ్ కారిడార్‌ను అభివృద్ధి చేయటం ద్వారా 5.5 లక్షల ఉద్యోగావకాశాలు ముందుకొస్తాయి.
 
 సీమాంధ్ర పారిశ్రామిక కారిడార్..
 
  సీమాంధ్రకు జీవరేఖ ఈ పారిశ్రామిక కారిడారే. ఇది పెట్టుబడిదారులతో పాటు చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలన్నిటికీ అందుబాటులో ఉంటుంది. రాష్ట్ర భాగ్య రేఖగా నిలిచే ఈ పారిశ్రామిక కారిడార్‌కు... ఏటా రూ.46,000 కోట్ల విలువైన ఉత్పత్తులు అందించే సత్తా ఉంటుంది. దాదాపు 30 లక్షలకు పైగా ఉద్యోగాలనూ సృష్టిస్తుంది.
 
 ఈ కారిడార్ మూడు జోన్లుగా ఉంటుంది. ఒకటి పెట్రోలియం-పెట్రో కెమికల్ కారిడార్ కాగా... రెండోది మైనింగ్-మాన్యుఫాక్చరింగ్, ఆగ్రో, మెరైన్ ప్రాసెసింగ్ కారిడార్. దీన్లోనే లెదర్, టెక్స్‌టైల్ క్లస్టర్లూ భాగమై ఉంటాయి. ఇక మూడోది ఐటీ/ఐటీ ఆధారిత సేవలు, లాజిస్టిక్స్ కారిడార్. శీతల గిడ్డంగుల చైన్ కూడా దీన్లో భాగమై ఉంటుంది.
 
 ప్రాంతీయంగా ఆర్థిక కార్యకలాపాలు పెంచటానికి, ఎగుమతి ఆధారిత పరిశ్రమల్లోకి పెట్టుబడులను ఆకర్షించడానికి ఇది ఉపకరిస్తుంది.
 
 విద్య..
 
 సైన్స్, ఆర్ట్స్‌తో పాటు అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలతో సీమాంధ్ర దక్షిణ భారత విజ్ఞాన ఖనిగా మారుతుంది.  విదేశీ విద్యా సంస్థలతో కలిసి ఏర్పాటయ్యే కొత్త యూనివర్సిటీలు ఎన్‌రోల్‌మెంట్ రేషియోను 30 శాతం వరకూ పెంచుతాయి. నిపుణులైన సిబ్బంది కూడా బయటకొస్తారు.  స్మార్ట్, వర్చువల్ క్లాస్‌రూమ్‌ల నెట్‌వర్క్‌తో పాఠశాల, శిక్షణ మౌలిక  సదుపాయాల మధ్య అనుసంధానం ఏర్పడుతుంది.
Share this article :

0 comments: