కోపమంటే ఏంటో తెలియదు... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కోపమంటే ఏంటో తెలియదు...

కోపమంటే ఏంటో తెలియదు...

Written By news on Monday, May 5, 2014 | 5/05/2014

వీడియోకి క్లిక్ చేయండి
తండ్రి మరణం తట్టుకోలేక ప్రాణాలు వదిలిన వారిని ఓదారుస్తానని ఇచ్చిన మాట కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో కష్టాలు, నష్టాలను చవి చూశారని ఆయన సతీమణి వైఎస్ భారతి అన్నారు. ఒక టీవీ చానెల్ కి ఇచ్చిన ఇంటర్ వ్యూలో ఆమె ఓదార్పుయాత్ర చేయవద్దని కాంగ్రెస్ అధిష్ఠానంతో పాటు, ఎందరో చెప్పారని అయినా ఆయన వెనకడుగు వేయలేదని తెలిపారు. ఓదార్పు యాత్ర విషయంలో ఏం చేస్తారని తాను జగన్ ను అడిగితే... ఇచ్చిన మాట ప్రకారం యాత్ర చేయకుంటే 'నేను పైకి పోయి నాయనకు ఏం సమాధానం చెప్పాలి?' అన్నారని భారతి గుర్తు చేసుకున్నారు.

సన్నిహితులు కూడా బురద జల్లారు
జగన్ రెడ్డి ఎవరు అంటే వైఎస్ రాజశేఖరరెడ్డి కొడుకుగా ప్రజలకు తెలుసునని... అలాంటి తాను ఎవరికి భయపడటం సరికాదు. ఓదార్పు యాత్రకు పోతున్నానని చెప్పారని.. ఆయనంత దృఢ సంకల్పంతో ఉన్నప్పుడు పోవద్దని తనకు చెప్పాలనిపించలేదని భారతి అన్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాక తమ కుటుంబంపై కక్ష సాధింపు మొదలైందని, అయిదేళ్ల క్రితం ఎన్నికలు జరిగే సమయానికి మామ ఉన్నారని, ఆ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటే.... ఆయన ఉన్నప్పుడు... ఆ తర్వాత తమ జీవితాలు ఇంతగా మారిపోతాయా అనిపించిందని ఆమె అన్నారు. కాంగ్రెస్ నుంచి జగన్ బయటకు వచ్చాక, ఆయన గురించి మామ గురించి అనేకమంది రకరకాలుగా విమర్శలు చేశారని వైఎస్ భారతి పేర్కొన్నారు. మామతో సన్నిహితంగా ఉన్నవారు కూడా రెండు, మూడేళ్ల పదవీ వ్యామోహంతో ఆయనపై బురద చల్లటం చూస్తే బాధేసిందన్నారు.

వెండిపళ్లెంతో పుట్టినా వేల కష్టాలకు సంసిద్ధం
పుట్టుకతోనే జగన్ వెండి పళ్లెంతో పుట్టాడని, ఎలాంటి కష్టాలు పడలేదన్నారు. అలాంటి ఆయన మామ చనిపోయాక ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా... వెనక్కి అడుగు వేయలేదని వైఎస్ భారతి అన్నారు. అందర్నీ కలుపుకుపోవడం, కోపం పెట్టుకోరని, ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడరని చెప్పారు. టీవీల్లో, పేపర్లలో రకరకాలుగా వార్తలు వస్తున్నప్పుడు తమకైనా కోపం వస్తుందే కానీ, జగన్ కు మాత్రం కోపం రాదన్నారు. రాజకీయాల్లోకి రాకముందు బెంగళూరులో ఉండేవాళ్ళమని అక్కడ జగన్ కు స్నేహితులు లేకపోవడంతో పిల్లలతో ఎక్కువ సమయం గడిపేవారని, తమది హ్యాపీ ఫ్యామిలీ అని వైఎస్ భారతి అన్నారు.

జైలులో ఉన్న రోజుల్లో నరకం కనిపించింది
జగన్ జైలుకు వెళ్లినప్పుడు తనకు చాలా బాధనిపించిందని వైఎస్ భారతి చెప్పారు. ఇక ఆయన బయటకు వస్తే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని అనుకున్నట్లు ఆమె వెల్లడించారు. రాజకీయాల్లో ఉంటే నీచమైన కుట్రలు చేస్తూనే ఉంటారని, తాను అనుభవించిన బాధను మరోసారి తట్టుకోలేనని జగన్ కు చెబితే నవ్వి ఎక్కడకు వెళతావని అన్నారని గుర్తు చేసుకున్నారు.

జైల్లోనూ జనం కోసమే జగన్...
జగన్ సానుకూల దృక్పదంతో ఆలోచించేవారని... ఇలా జరిగింది... ఇలా ఉండాలి అని అనుకునేవారే కానీ... నాకే ఎందుకిలా జరిగిందని అనుకునేవారు కాదన్నారు. జైల్లో ఉన్న సమయంలో రాష్ట్రంలోని నియోజకవర్గాల గురించి, నీటి వనరులు, ప్రాజెక్టులు గురించి క్షుణ్ణంగా తెలుసుకునేవారని, ఎక్కడ ప్రాజెక్టులు కడితే రైతులకు నీళ్లు అందించవచ్చు తదితర అంశాలను ఆకళింపు చేసుకున్నారన్నారు. కష్టాలు అనుభవించిన తర్వాత పరిణితి వస్తుందనడానికి ఉదాహరణ జగనేనని అన్నారు.

ఇప్పుడు ప్రజలతో మమేకం అయిన జగన్... ఎక్కువ సమయం కుటుంబంతో గడపలేకపోతున్నారని, అయితే పిల్లలతో ఇంకొంచెం సేపు ఆయన గడిపితే బావుంటుందని తనకనిపిస్తుంటుందన్నారు. జగన్ ఎంతో నిజాయితీగా ఉంటారని, లేనిది ఉన్నట్లు అస్సలు చెప్పరని వైఎస్ భారతి అన్నారు. జగన్ చెప్పారంటే అందులో వాస్తవముంటుందన్నారు.

ఆయన బెస్ట్ సీఎం అవుతారు
ప్రస్తుత రాజకీయ నేతలను చూస్తుంటే జగన్ ముఖ్యమంత్రి అయితే బెస్ట్ సీఎం అవుతారని వైఎస్ భారతి తెలిపారు. మహిళలు, రైతుల గురించి జగన్ ఎక్కువగా ఆలోచిస్తారని, ఎన్నికల మేనిఫెస్టోలో వారి అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారన్నారు. దేవుడు ఆశీర్వదించి, వర్షాలు బాగా పడి, పంటలు సమృద్ధిగా పండాలని ఆమె అన్నారు. మాటకు కట్టుబడే కుటుంబం తమదన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించివన్నీ జగన్ నెరవేరుస్తారని వైఎస్ భారతి తెలిపారు.
Share this article :

0 comments: