రాజకీయ అవసరాల కోసం వైద్య రంగాన్ని వాడుకుంటున్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజకీయ అవసరాల కోసం వైద్య రంగాన్ని వాడుకుంటున్నారు

రాజకీయ అవసరాల కోసం వైద్య రంగాన్ని వాడుకుంటున్నారు

Written By news on Monday, October 12, 2015 | 10/12/2015


ఉద్యమాన్ని నీరుగార్చే యత్నం
♦ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం
♦ సీఎం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు సిగ్గుచేటు
♦ రాజకీయ అవసరాల కోసం వైద్య రంగాన్ని వాడుకుంటున్నారు
♦ ఉద్యమం చేస్తోంది ప్రత్యేక హోదా కోసం... జగన్ కోసం కాదు
♦ తప్పుడు గ్లూకోమీటర్‌లతో పరీక్షలు నిర్వహిస్తున్నారు
♦ రక్తనమూనాలు ట్యాంపర్ చేస్తున్నారు

 సాక్షి, గుంటూరు: ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరు గార్చేందుకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలకు పాల్పడడం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మండి పడ్డారు.  రాష్ట్రమంత్రులు డాక్టర్ కామినేని శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్షా వేదికపై ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘డాక్టర్లు వ్యవహరిస్తున్న పద్ధతి మంచిది కాదు. యూరినల్ శాంపిల్స్ కావాలంటే నేరుగా డాక్టర్లు, మీడియా సమక్షంలో ఇస్తా. రాజకీయ అవసరాల కోసం వైద్య రంగాన్ని వాడుకుంటున్నారు. ఉద్యమాన్ని నీరు గార్చేందుకు కుట్ర పన్నుతున్నారు.

చంద్రబాబు ఇటువంటి వాటికి పాల్పడడం సిగ్గుచేటు.’ అని జగన్ అన్నారు. ‘ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేస్తున్నది నాకోసం కాదు. హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, విద్యార్థులకు, ప్రజలకు మంచి జరుగుతుంది అని దీక్ష చేస్తుంటే  రాజకీయాలు చేయడం సరికాదు. నేను రాజకీయాలు చూశాను గానీ ఇంత దిగజారుడు రాజకీయాలు ఎక్కడా చూడలేదు. అబద్ధాలు చెబుతున్నారు.’ అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా నాన్న ముందు డాక్టర్. ఆ తరువాతే రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. పులివెందులలో మా మామ పేరున్న డాక్టర్. ఇప్పటికీ ప్రజలకు మంచి సేవలు అందిస్తున్నారు.

’ అని జగన్ ఉద్వేగంగా అన్నారు. ‘ఇక్కడ నుండి నమూనాలు తీసుకెళుతున్నారు అక్కడ టాంపర్ చేస్తున్నారు. వైద్యపరీక్షల ఫలితాలను ఎందుకు రిలీజ్ చేయడం లేదు. తప్పుడు గ్లూకో మీటర్ తెచ్చి దీక్షపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ప్రభుత్వ వైద్యులు తెచ్చిన గ్లూకోమీటర్ 88 చూపిస్తుంటే కొత్త గ్లూకోమీటర్ 77 చూపిస్తోంది. డాక్టర్లు, సూపరింటెండెంట్‌లు మారాలి. మంత్రులు మాట కాదు దేవుడి మాట వినాలి.’ అని జగన్ వ్యాఖ్యానించారు.
Share this article :

0 comments: