ఎలుకలను నివారించలేమని చేతులెత్తేసిన కామినేనికి జగన్ దీక్షపై మాట్లాడే అర్హత లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎలుకలను నివారించలేమని చేతులెత్తేసిన కామినేనికి జగన్ దీక్షపై మాట్లాడే అర్హత లేదు

ఎలుకలను నివారించలేమని చేతులెత్తేసిన కామినేనికి జగన్ దీక్షపై మాట్లాడే అర్హత లేదు

Written By news on Monday, October 12, 2015 | 10/12/2015


రక్తపరీక్ష జాప్యం వల్లే హెచ్చుతగ్గులు
♦ జగన్ రక్త నమూనాలు సేకరించిన రెండు గంటలకు పరీక్షలు:జీజీహెచ్ సూపరింటెండెంట్
♦ రక్త నమూనాల్లో తేడాలే తప్ప ఇతర కారణాలు ఏమీలేవని వెల్లడి
♦ వైఎస్సార్‌సీపీ నేతలు నిలదీయడంతో తడబడిన సూపరింటెండెంట్

 సాక్షి, గుంటూరు: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షపై రాష్ర్టప్రభుత్వం ఎంత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదో బట్టబయలయ్యింది. జగన్ దీక్షపై మం త్రులు కామినేని, ప్రత్తిపాటి విమర్శలు చేయడంతో నిజాలు వెల్లడించాలంటూ గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ ఉదయ్‌కుమార్‌ను వైఎస్సార్‌సీపీ నాయకులు నిలదీయడంతో నిజాలు బయటపడ్డాయి.  షుగర్ లెవెల్స్ హె చ్చు తగ్గులకు కారణం తాము సేకరించిన రక్త నమూనాల్లో తేడాలే తప్ప ఇతర కారణాలు ఏమీ లేవని ఇన్‌చార్జి సూపరింటెండెంట్ చెప్పా రు.

వైఎస్ జగన్ షుగర్ పరీక్షల కోసం రక్త నమూనాలను సేకరించిన రెండు గంటల తరువాత పరీక్షలు నిర్వహించడం వల్లే హెచ్చు తగ్గులు వచ్చాయని చెప్పారు. ఆదివారం ఉదయం పూట షుగర్ తక్కువగా ఉందనే విషయాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు తెలియజేశామన్నారు. అయితే షుగర్ తక్కువగా ఉండటంపై అనుమానం వచ్చి తిరిగి 11.30 గంటలకు ముగ్గురు వైద్యులతో కూడిన బృందాన్ని రక్తనమూనాలు సేకరించి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు పంపగా వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా రిపోర్టును మీడియాకు వెల్లడిస్తున్నట్లు తెలిపారు.

ముగ్గురు వైద్యులతో కూడిన డాక్టర్ల బృందం ఇచ్చిన నివేదికలో జగన్ షుగర్ లెవెల్స్ సాధారణంగా ఉన్నట్లు ఇన్‌చార్జి సూపరింటెండెంట్ వెల్లడించారు. అనంతరం కీటోన్ బాడీస్ పరీక్ష రిపోర్టు చూపాలని వైఎస్సార్ సీపీ నాయకులు సూపరింటెండెంట్‌ను నిలదీయడంతో ఆయన నీళ్ళు నమిలారు. శనివారం రాత్రి నిర్వహించిన కీటోన్ బాడీస్ పరీక్ష నివేదిక తమకు ఆదివారం రాత్రి వరకు అందలేదని, ఆరిపోర్టు నివేదిక మంత్రులకు, మీడియాకు ఎలా వచ్చిందో తమకు తెలియదన్నారు.

ఆ రిపోర్టులో ఉన్న వివరాలు స్పష్టంగా లేకపోవడంతో తిరిగి ఆదివారం కీటోన్ బాడీస్ పరీక్ష చేయించామని, కీటోన్ బాడీస్ లేవని రిపోర్టులో తేలిందని గందరగోళంగా సమాధానం చెప్పారు. జీజీహెచ్‌లో కీటోన్ బాడీస్ పరీక్ష నిర్వహించే ల్యాబ్ ఉన్నప్పటికీ రూ. 20 విలువ చేసే స్ట్రిప్ లేదనే కారణంతో క్యాబినెట్ ర్యాంకు ఉన్న ప్రతిపక్ష నేతకు వైద్య పరీక్షలు ఇష్టం వచ్చినట్లు ప్రైవేటు వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో చేయడం దారుణమైన విషయం. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు జీజీహెచ్‌లో విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు వైఎస్ జగన్ చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతుందని బొత్స సత్యనారాయణ చెప్పారు. ‘ప్రతిపక్ష నేతగా క్యాబినెట్ హోదాలో ఉన్న వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్ష చేస్తుంటే ప్రభుత్వం బాధ్యతా రహితంగా కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ వైద్యు లు జగన్‌కు రాత్రి నిర్వహించిన పరీక్షల రిపోర్టులు మాయం అయ్యాయి. ఐదు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నప్పటికీ  హోదా వచ్చే వరకు దీక్ష విరమించబోమని చెబుతున్నారు’ అని బొత్స అన్నారు.

అయితే బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న కామినేని, ప్రత్తిపాటి విజ్ఞత కోల్పోయి మాట్లాడుతున్నారని, మంత్రులు తమ మాటలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని, జగన్ షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయని మాట్లాడుతున్న మంత్రి కామినేని ఆధారాలతో నిరూపించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ వైద్యులు జగన్‌కు పరీక్షలు నిర్వహించిన వెంటనే ఆయన హెల్త్ బులిటెన్‌ను బహిర్గతం చేయాలని, ఆయన ఆరోగ్యం గురించి లిఖితపూర్వకంగా తమకు నివేదిక ఇవ్వాలని బొత్స జీజీహెచ్ సూపరింటెండెంట్‌ను కోరారు.

మాజీ మంత్రి కొలుసు పార్థ సారథి మాట్లాడుతూ జీజీహెచ్‌లో ఎలుకలు కొరికి పసికందు మృతిచెందితే ఎలుకలను నివారించలేమని చేతులెత్తేసిన కామినేనికి జగన్ దీక్షపై మాట్లాడే అర్హత లేదు. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి మాట్లాడుతూ ఐదు కోట్ల ఆంధ్రుల కోసం జగన్ చేస్తున్న దీక్షను సైతం రాజకీయం చేస్తున్నారంటే ప్రభుత్వం ఎంతకు దిగజారిందో అర్ధమవుతుందన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు ఎంపీ  వై.వి.సుబ్బారెడ్డి, పార్టీ నాయకులు జీజీహెచ్ సూపరింటెండెంట్‌ను కలిసి జగన్ ఆరోగ్య పరీక్షలకు  సంబంధించిన రికార్డులను ఇవ్వాలంటూ కోరారు.
Share this article :

0 comments: