ఒకవైపు రాజకీయాల్లో నిబద్ధత.. మరోవైపు వెన్నుపోటు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఒకవైపు రాజకీయాల్లో నిబద్ధత.. మరోవైపు వెన్నుపోటు

ఒకవైపు రాజకీయాల్లో నిబద్ధత.. మరోవైపు వెన్నుపోటు

Written By news on Saturday, October 17, 2015 | 10/17/2015

 ఒకవైపు రాజకీయాల్లో నిబద్ధత.. మరోవైపు వెన్నుపోటు. ఒకవైపు పదవులు, ప్రాణాలను సైతం లెక్కచేయని తత్వం, మరోవైపు పదవీకాంక్షతో ఎంతకైనా తెగబడే తెంపరితనం. ఇవీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, సీఎం చంద్రబాబు నాయుడికి మధ్య తేడాలు. అధికారం రాకపోయినా పర్వాలేదు గానీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చేది లేదని జననేత నిలబడితే, అలవి కాకపోయినా రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి లాంటి హామీలిచ్చి అడ్డదారిలో అధికారం దక్కించుకున్న నేత చంద్రబాబు.
  • రాజధాని శంకుస్థాపనకు రాలేను, పిలవకండని చంద్రబాబు నాయుడు సర్కార్ కు బహిరంగ లేఖ రాయడం ద్వారా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తనవి ముక్కుసూటి రాజకీయాలని రుజువు చేసుకున్నారు. వైఎస్ జగన్ చర్యల్లో రాజకీయం కంటే స్వచ్ఛత, నిజాయితీ ఉంటుందనడానికి ఇదో ఉదాహరణ.
  • రాష్ట్ర విభజన అంశంపై కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాగే తమ పార్టీది సమైక్యవాదమని తెగేసి చెప్పారు. అదే చంద్రబాబు మాత్రం వాట్ ఐయామ్ సేయింగ్ అంటూ, రెండుకళ్ల సిద్ధాంతంతో దాటవేశారే తప్ప స్పష్టమైన వైఖరి మాత్రం చెప్పలేదు.
  • 150 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వైఎస్ జగన్ ను సీఎం చేయాలని సంతకాలు చేసినప్పటికీ... సీఎం పదవి కోసం ఆయన అడ్డదారి పట్టలేదు. కానీ చంద్రబాబు మాత్రం సీఎం పదవి కోసం సొంత మామకే వెన్నుపోటు పొడిచారు.
  • కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు డబ్బులిస్తే కిరణ్ సర్కార్ ను పడగొట్టొచ్చనే సలహాలు వచ్చినా వాటిని వైఎస్ జగన్ పట్టించుకోలేదు. ప్రజా సమస్యలపై నిబంధనల ప్రకారం అవిశ్వాసం తీర్మాణం పెట్టారే తప్ప సర్కార్ ను కూలగొట్టలేదు. ఇది జగన్ చేతగానితనమని కామెంట్లు చేసిన వారున్నారు, కానీ ఆయన మాత్రం తాను చంద్రబాబు మాదిరిగా వెన్నుపోటు రాజకీయాలు చేయలేనని తేల్చి చెప్పారు.
  • సొంతవారినైనా అవసరానికి వాడుకుని వదిలేయం చంద్రబాబు సొంతమైతే.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ముఖ్యం.. అధికారం దక్కకపోయినా ఫర్వాలేదనే తత్వం జగన్ ది.
  • 2014 ఎన్నికలకు ముందు గంటా శ్రీనివాసరావు తన టీమ్ తో సహా వైఎస్ఆర్ సీపీలో చేరుతానని.. అందరికీ టికెట్లు ఇవ్వాలన్నారు. టికెట్లు ఇస్తానని ముందే ఇతర నేతలకు మాటిచ్చాను... వారిని మోసం చేయలేనంటూ గంటా లాంటి చాలామంది సీనియర్లను జగన్ తన పార్టీలోకి తీసుకోలేదు. కానీ చంద్రబాబు మాత్రం అలాంటి వారందరినీ తీసుకుని ముందు టికెట్లు ఇస్తానన్న వారందరినీ మోసం చేశారు.
  • రైతులకు రుణమాఫీ చేసేంత ఆర్థికస్థాయి రాష్ట్రానికి లేదని, అమలు చేయలేని హామీని ఎలా ఇస్తామని నిజాయతీగా వ్యవహరించిన నేత వైఎస్ జగన్. కానీ చంద్రబాబు ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారు.
  • రాజకీయాలలో స్వచ్ఛత, ముక్కుసూటితనం, మాట నిలబెట్టుకోవడం, హుందాగా వ్యవహరించడం వంటివి అంతరిస్తున్నాయనే వారు వైఎస్ జగన్ శైలిని పరిశీలించాలి.
  • వెన్నుపోటు, కుటిలత్వం, మోసం చేయడం, నమ్మినవారిని నట్టేట ముంచడం, ఇచ్చిన మాట తప్పడం వంటి లక్షణాలున్న చంద్రబాబుది రాజకీయ దివాళకోరుతనమో.. చతరుతతో విజ్ఞులైన వారే ఆలోచించాలి.
Share this article :

0 comments: