వంద గంటలు దాటిన జగన్ దీక్ష - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వంద గంటలు దాటిన జగన్ దీక్ష

వంద గంటలు దాటిన జగన్ దీక్ష

Written By news on Sunday, October 11, 2015 | 10/11/2015

గుంటూరు:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రాణాలు లెక్కచేయకుండా చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష వందగంటలు దాటింది. రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజనాలు, రాష్ట్ర భవిత కోసం గుంటూరులోని నల్లపాడు రోడ్డులో ఈ నెల 7వ తేదీన జగన్ ప్రారంభించిన దీక్ష ఆదివారంతో ఐదు రోజులు పూర్తిచేసుకుంది. గత ఐదురోజులుగా అన్నపానీయాలు తీసుకోకుండా మొక్కవోని సంకల్పంతో చేస్తున్న నిరాహార దీక్ష వల్ల జగన్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నది. ఆయన షూగర్ లెవల్స్, బీపీ లెవల్స్ గణనీయంగా తగ్గిపోయాయి. జగన్ పూర్తిగా నీరసించిపోయారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశముందని, జగన్ వెంటనే నిరాహార దీక్ష విరమించాలని వైద్యులు సూచించారు. జగన్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుండటంతో ప్రతి మూడు గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఇప్పటికే మూడుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు.

దీక్షలో ఉన్న జగన్ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో వైఎస్సార్సీపీ కీలక నేతలు దీక్షా శిబిరం వద్ద అత్యవసరంగా సమావేశమై చర్చించారు. జననేత నిరాహార దీక్షపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం స్పందించకపోవడం దారుణమని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం జగన్ దీక్ష విరమించాలని నేతలు సూచించారు. అయినా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దీక్ష కొనసాగించాలని జగన్ నిర్ణయించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్పష్టమైన వైఖరి వచ్చేవరకు దీక్ష కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. దీంతో జగన్ ఆరోగ్యంపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. మొక్కవోని సంకల్పంతో దీక్ష చేస్తున్న జగన్ కు ప్రజామద్దతు వెల్లువెత్తుతున్నది.
Share this article :

0 comments: