మధ్యాహ్నంలోపు కార్యాచరణ ప్రకటిస్తాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మధ్యాహ్నంలోపు కార్యాచరణ ప్రకటిస్తాం

మధ్యాహ్నంలోపు కార్యాచరణ ప్రకటిస్తాం

Written By news on Tuesday, October 13, 2015 | 10/13/2015

 జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్షను బలవంతంగా భగ్నం చేసినంతమాత్రాన ప్రత్యేక హోదా ఉద్యమం ఆగదని, మరింత ఉదృతంగా ముందుకు వెళతామని వైఎస్సార్ సీపీ ముఖ్యనేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.  గడిచిన రెండు రోజుల నుంచి వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నప్పటికీ, లక్ష్యాన్ని సాధించేవరకు దీక్ష కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నారని ఆయన తెలిపారు. అయితే పోలీసులు బలవంతంగా ఆసుపత్రిలో చేర్చి వైద్య సేవలు అందించడం మొదలుపెట్టిన తర్వాత జగన్ ఆరోగ్యం కాస్త కుదుటపడే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు చెప్పినట్లు పేర్కొన్నారు.

దీక్ష భగ్నం నేపథ్యంలో వైఎస్సార్ సీపీ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోందనే విషయాన్ని ఈ రోజు మధ్యాహ్నం లోగా ప్రకటిస్తామన్నారు. 'మంగళవారం 11 గంటలకు గుంటూరులోనే పార్టీ సీనియర్ల సమావేశం జరగనుంది. ఈ భేటీలో సమాలోచనలు జరిపి.. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తో చర్చిచి నిర్ణయాలు ప్రకటిస్తాం' అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు
Share this article :

0 comments: