గుంటూరు దీక్షాస్థలికి చేరుకున్న వైఎస్ విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గుంటూరు దీక్షాస్థలికి చేరుకున్న వైఎస్ విజయమ్మ

గుంటూరు దీక్షాస్థలికి చేరుకున్న వైఎస్ విజయమ్మ

Written By news on Monday, October 12, 2015 | 10/12/2015


గుంటూరు దీక్షాస్థలికి చేరుకున్న వైఎస్ విజయమ్మ
గుంటూరు : కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యంపై వైఎస్ విజయమ్మ ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైఎస్ జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష నేటికి ఆరో రోజుకు చేరింది. దీంతో ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు హుటాహుటిన గుంటూరు చేరుకున్నారు.
 
కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై వైఎస్ విజమమ్మ మనోవేదన చెందారు.  ఈ సందర్భంగా ఆమె ఉద్వేగానికి గురయ్యారు. అలాగే వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి కూడా అక్కడే ఉన్నారు. మరోవైపు వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల కూడా బెంగళూరు నుంచి గుంటూరుకు బయల్దేరారు.
Share this article :

0 comments: