పార్టీలకు అతీతంగా వైఎస్ జగన్ కు మద్దతు ఇవ్వాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పార్టీలకు అతీతంగా వైఎస్ జగన్ కు మద్దతు ఇవ్వాలి

పార్టీలకు అతీతంగా వైఎస్ జగన్ కు మద్దతు ఇవ్వాలి

Written By news on Sunday, October 11, 2015 | 10/11/2015

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షకు మద్దతు ఇవ్వాలని హైదరాబాద్ లోని వివిధ ఐఏఎస్ స్టడీ సర్కిల్స్ లో సివిల్స్ పరీక్షల కోసం శిక్షణ తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అన్నారు. ఇప్పటి వరకు వైఎస్ జగన్ ఏం చేసినా విజయం సాధించారని, ప్రత్యేక హోదా విషయంలో కూడా విజయం సాధిస్తారన్న నమ్మకం తమకు ఉందని, అలా జరగాలని కూడా తాము కోరుకుంటున్నామని చెప్పారు. ప్రత్యేక హోదా విద్యార్థిలోకానికి, యువతకు, సామాన్యకు చాలా అవసరం అని వారు చెప్పారు.

కేంద్రం ప్రత్యేక హోదా తప్పకుండా ఇవ్వాలని, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ముఖ్యమైనదని అన్నారు. రాజధాని విషయం నుంచి ప్రతి విషయంలో ఆంధ్రప్రదేశ్ సంస్థాపరంగా, వ్యవస్థాపరంగా చాలా నిర్మాణాలు చేపట్టాల్సి ఉందని, ఇది ఒక్క ప్రత్యేక హోదాతోనే సాధ్యమని చెప్పారు. నాడు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వంతోపాటు, బీజేపీ కూడా హామీ ఇచ్చి మరిచాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ సమస్య తీరాలన్నా, రైతుల సమస్యలు పోవాలన్నా, తీవ్ర అంతరం ఉన్న రెవిన్యూలోటు పూడ్చాలన్నా ప్రత్యేక హోదా అవసరం అని పేర్కొన్నారు. కేంద్రం కొన్ని కొన్ని కారణాలు చూపెడుతూ ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెప్తోందని, కానీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఇప్పటి వరకు అన్ని రంగాల్లో ముందున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడం మూలంగా ఒక్కసారిగా వెనక్కి వెళ్లిపోయిందని, కష్టాల్లో కూరుకుపోయిందని చెప్పారు.
Share this article :

0 comments: