దీక్ష భగ్నం ఎలా జరిగిందంటే.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దీక్ష భగ్నం ఎలా జరిగిందంటే..

దీక్ష భగ్నం ఎలా జరిగిందంటే..

Written By news on Tuesday, October 13, 2015 | 10/13/2015


దీక్ష భగ్నం ఎలా జరిగిందంటే..
హైదరాబాద్: ముందస్తు వ్యూహం ప్రకారమే పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్షను భగ్నం చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా డిమాండ్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఏడు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.  నిద్రహారాలు మానుకొని యావత్ ఆంధ్రప్రజానీకం భావి ప్రయోజనాలకోసం ఆయన అకుంఠిత పట్టుదలతో దీక్ష కొనసాగించారు.

ఈ క్రమంలో వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ముఖ్యంగా శరీరంలో కీటోన్స్ సోమవారం ప్లస్ 3 ఉండగా.. మంగళవారం తెల్లవారు జాము సమయానికి ప్లస్ 4కు చేరుకుని ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. అంతకుముందు ఆయన దీక్షపై ఏ విధమైన స్పందన తెలియజేయని ప్రభుత్వం ముందస్తు వ్యూహంలో భాగంగానే అందరు నిద్రిస్తున్న సమయంలో పోలీసులను దీక్షా స్థలి వద్దకు పంపించారు. ఆ సమయంలో దీక్షా ప్రాంగాణంతోపాటు చుట్టుపక్కల అంతా నిద్రలోనే ఉన్నారు.

అక్కడికి చేరుకుంటుండగానే కెమెరాల కేబుల్స్ ను కట్ చేయడంతో పాటు లైట్స్ కూడా ఆర్సేసినట్లు తెలిసింది. ఆ వెంటనే వైఎస్ జగన్ వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితి విషమించినందున దీక్ష వెంటనే విరమించాలని కోరారు. కానీ అందుకు నిరాకరించిన వైఎస్ జగన్ తాను దీక్ష కొనసాగిస్తానని చెప్పారు. దీంతో బలవంతంగా పోలీసులు దీక్షను భగ్నం చేశారు. అక్కడి నుంచి ఓ స్ట్రెచర్ పై తీసుకెళ్లి 108 అంబులెన్స్ లో ఎక్కించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు భారీ సంఖ్యలో పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు లాఠీ చార్జికి దిగి అక్కడి వారిని చెల్లా చెదురు చూశారు.

అంబులెన్స్ కు ఎవరూ అడ్డు రాకుండా ముందు కొంతమంది పోలీసులు లాఠీలతో పరుగెత్తుతుండగా వేగంగా అంబులెన్స్ ను గుంటూరు జీజేహెచ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నేరుగా ఐసీయూలోకి తీసుకెళ్లి ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు ప్రయత్నం చేశారు.  ఈ సందర్భంగా తనకు ఫ్లూయిడ్స్ వద్దని, దీక్షను కొనసాగిస్తానని తీవ్రంగా వైద్యులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

అయితే, ఆరోగ్యం విషమించిందని, ఇలాగే కొనసాగితే ఊహించని ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొంటూ బలవంతంగా వైఎస్ జగన్ కు ఫ్లూయిడ్స్ ఎక్కించి దీక్షను భగ్నం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు తల్లి వైఎస్ విజయమ్మ, భార్య వైఎస్ భారతి, సోదరి వైస్ షర్మిల ఆస్పత్రికి వచ్చి ఆయనతో ఉన్నారు. మరోపక్క, పోలీసుల తీరుపట్ల పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా మండిపడ్డారు. ప్రతిపక్ష నేతకు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: