Home »
» క్రమంగా క్షీణిస్తున్న వైఎస్ జగన్ ఆరోగ్యం
క్రమంగా క్షీణిస్తున్న వైఎస్ జగన్ ఆరోగ్యం
గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. దీంతో దీక్షా శిబిరం వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొంది. కాగా వైఎస్ జగన్ ఆరోగ్యం చాలా విషమంగా వుందని విజయవాడ నుంచి వచ్చిన డాక్టర్ల బృందం తెలిపింది. దీక్ష కొనసాగితే పరిస్థితులు చేజారే ప్రమాదం వుందని డాక్టర్లు తెలిపారు. కాగా కోట్లాది ప్రజల కోసం దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ కు వారు సంఘీభావం తెలిపారు. సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ బోడేపూడి చౌదరి నాయకత్వంలో డాక్టర్లు బృందం వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు వైఎస్ జగన్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
0 comments:
Post a Comment