వైఎస్ జగన్ హెల్త్ బులెటిన్ విడుదల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్ హెల్త్ బులెటిన్ విడుదల

వైఎస్ జగన్ హెల్త్ బులెటిన్ విడుదల

Written By news on Tuesday, October 13, 2015 | 10/13/2015


వైఎస్ జగన్ హెల్త్ బులెటిన్ విడుదలజీజీహెచ్ సూపరింటెండెంట్ రాజునాయుడు
గుంటూరు: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 24  గంటలు తమ పర్యవేక్షణలో ఉండాలని గుంటూరు ప్రభుత్వాసుపత్రి(జీజీహెచ్) వైద్యులు తెలిపారు. జగన్ కు క్రమేణా ప్లూయిడ్స్ అందిస్తున్నామని జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజునాయుడు వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జగన్ ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోందని, మెల్లగా కోలుకుంటున్నారని చెప్పారు. జగన్ కు బీపీ 130/80, కీటోన్స్ 3 ప్లస్, యూరిక్ యాసిడ్ 13.2 గా ఉందని తెలిపారు. పూర్తిస్థాయిలో కోలుకునేదాకా జగన్ ఆస్పత్రిలోనే ఉండాలని ఆయన సూచించారు. ఏడు రోజుల పాటు నిరాహారదీక్ష చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో పోలీసులు బలవంతంగా జీజీహెచ్ కు తరలించారు. ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
Share this article :

0 comments: