వైఎస్ జగన్ కు షర్మిల పరామర్శ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్ కు షర్మిల పరామర్శ

వైఎస్ జగన్ కు షర్మిల పరామర్శ

Written By news on Monday, October 12, 2015 | 10/12/2015


వీడియోకి క్లిక్ చేయండి
గుంటూరు: వైఎస్ షర్మిల గుంటూరు చేరుకున్నారు. వెంటనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దీక్ష నేటికి ఆరు రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయనను పరామర్శించేందుకు వచ్చారు.

అంతకు ముందే వైఎస్ జగన్ ను పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు ఈ రోజు హైదరాబాద్ నుంచి గుంటూరుకు బయల్దేరి వైఎస్ జగన్ ను పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆయన సోదరి వైఎస్ షర్మిల గుంటూరుకు బయల్దేరారు. సోమవారం మధ్యాహ్నం షర్మిల బెంగళూరు నుంచి గుంటూరుకు పయనమయ్యారు.
Share this article :

0 comments: