Home »
» జగన్ తో సంప్రదించాక ఉద్యమ కార్యాచరణ
జగన్ తో సంప్రదించాక ఉద్యమ కార్యాచరణ
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణ కోసం నిర్వహించిన వైఎస్సార్ సీపీ ముఖ్యనేతల సమావేశం ముగిసింది. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సంప్రదించాక పోరాట కార్యాచరణ ప్రకటించనున్నారు. ఇందుకోసం పార్టీ నాయకులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి.. వైఎస్ జగన్ ను కలవనున్నారు.తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరాహారదీక్షను బలవంతంగా విరవింపజేసిన నేపథ్యంలో గుంటూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నాయకులు సమావేశమయ్యారు. ప్రత్యేక హోదా పోరాటాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చించారు. వైఎస్సార్ సీపీ ముఖ్యనేతలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
0 comments:
Post a Comment