జగన్ రానన్న కారణాలకు జవాబేదీ? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ రానన్న కారణాలకు జవాబేదీ?

జగన్ రానన్న కారణాలకు జవాబేదీ?

Written By news on Saturday, October 17, 2015 | 10/17/2015


జగన్ రానన్న కారణాలకు జవాబేదీ?
టీడీపీ నేతలను ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని నిర్మాణ శంకుస్థాపనకు రానన్న దానిపై విమర్శలు చేస్తున్నారు.. ఆయన రాలేనని స్పష్టంగా పేర్కొన్న కారణాలకు మంత్రులు, టీడీపీ నేతలు ఎందుకు జవాబు చెప్పలేదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కె.పార్థసారథి ప్రశ్నించారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘శంకుస్థాపన కార్యక్రమానికి వైఎస్ జగన్ ఎందుకు రావడంలేదో... అందుకు కారణాలను స్పష్టంగా పేర్కొన్నారు.

ఆయనను తిట్టడానికే మంత్రివర్గంలో పనిచేస్తున్న కొందరు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. జగన్ పేర్కొన్న కారణాలలో ఒక్క అంశంపైనైనా లోపాలు సరిదిద్దుకోలేదు. కనీసం వాటిపై చర్చించనూ లేదు. మీ మాటలను మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం’ అని పార్థసారథి అన్నారు. రాజధాని నిర్మాణంపై రాష్ట్రంలో ప్రతి రాజకీయ పార్టీ, ప్రజాసంఘాలు వ్యతిరేకించినా ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఒక్క అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించలేదని పార్థసారథి దుయ్యబట్టారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
 
* రాజధానికి రైతులు స్వచ్ఛందంగా భూములివ్వకపోతే బలవంతంగానైనా భూసేకరణ చట్టం ద్వారా సేకరిస్తామని సీఎం చంద్రబాబు బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. రైతుల మెడపై కత్తి పెట్టి వారి భూములను తీసుకొన్నారు. అలాంటప్పుడుై రెతుల నుంచి తీసుకున్న 33 వేల ఎకరాలను స్వచ్ఛందంగా తీసుకున్నట్టు ఎలా అవుతుంది?
* రాజధాని నిర్మాణానికయ్యే ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని విభజన చట్టంలోనే పేర్కొన్నారు. అలాంటప్పుడు బలవంతంగా సేకరించిన భూములను సింగపూర్ కంపెనీలకిచ్చి వారిచేత భవనాలు నిర్మించుకోవాల్సిన అవసరం ఏమిటో మంత్రులు చెప్పగలరా?
* కోర్ క్యాపిటల్ నిర్మాణానికి 1,400 ఎకరాలు, రోడ్లు వంటి మౌలిక వసతులకు మరో 500 ఎకరాలు సరిపోతుందని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖే శివరామకృష్ణన్ కమిటీకి నివేదిక అందజేసింది. ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా 33 వేల ఎకరాలను సేకరించింది. ఆ ప్రాంతంలో ఉన్న 50 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కలుపుకున్నారు. ఎందుకో చెప్పగలరా?
* సమీకరించిన భూముల్లో మూడు పంటలు పండే భూములు లేవంటూ ప్రభుత్వమే గ్రీన్‌ట్రిబ్యునల్‌కు తప్పుడు నివేదికలిచ్చింది.  
* జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాసిన తర్వాత శంకుస్థాపనకు రూ.10 కోట్లే విడుదల చేశామని మంత్రులు చెబుతున్నారు. ఇతర ప్రభుత్వ శాఖల నుంచి ఇంతకు మించి ఖర్చు పెట్టబోమని స్పష్టంగా చెప్పగలరా? మన మట్టి- మన నీరు కార్యక్రమానికి జిల్లాకు రూ.3కోట్లు చొప్పున రూ.39 కోట్లు.. విమానాల ఏర్పాటుకు రూ.150 కోట్లు.. శంకుస్థాపన ప్రాంతంలో భూమి చదును, సభావేదికకు రూ.15 కోట్లు.. తాత్కాలిక రోడ్లు వంటి వాటికి రూ.35 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ దుబారా ఖర్చులు ఎందుకో చెప్పగలరా?
* రాజధాని గ్రామాల్లోని కౌలు రైతులు, ఇతర చేతివృత్తుల వారికీ, వ్యవసాయ కూలీలకు ప్రతి నెలా రూ.2,500 పింఛనుగా ప్రభుత్వం ఇస్తామంది. ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదు?
* రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటేనే ఆ పేరుతో చంద్రబాబుకు సింగపూర్ కంపెనీలతో రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి అస్కారం ఉంటుంది. అందుకే ఆయన ప్రత్యేక హోదాకు అడ్డుపడి రాష్ట్రం ఆర్థికంగా బలపడకుండా చేస్తున్నారు.
Share this article :

0 comments: