ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం

ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం

Written By news on Tuesday, July 17, 2012 | 7/17/2012


కడప, న్యూస్‌లైన్: ‘రైతులకు సకాలంలో విత్తనాలు అందవు..విత్తనాలు ఉంటే ఎరువులుండవు..ఎంతో కష్టనష్టాలకోర్చి పంటలు సాగు చేస్తే..అప్రకటిత కరెంట్ కోతలు. భూగర్భజలాలు అడుగంటిపోయి ఎన్ని బోర్లు వేసినా నీళ్లురాక చావే శరణ్యమని రైతన్నలు భావిస్తున్నా రు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. ఇది చేవలేని ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం. దీనికి ముందుచూపు లేక పాలనఅస్తవ్యస్తంగా నడుస్తోంది. రైతన్నలను ఆదుకునే నేతలు ఈ ప్రభుత్వంలో లేర’ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ధ్వజమెత్తారు. రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సోమవారం పులి వెందులలో వైఎస్సార్ సీపీ ‘మహాధర్నా’ చేపట్టింది. ఈ ధర్నాకు విజయమ్మ పాల్గొని, ప్రసంగించారు. విజయమ్మ ప్రసంగం ఆమె మాటల్లోనే....‘ హెచ్చెల్సీ నుంచి న్యాయంగా మాకు రావల్సిన నీటి వాటా ఎంతో చెప్పాలని డీఆర్సీ మీటింగ్‌లో డిమాండ్ చేశా. పదిరోజుల తర్వాత చెబుతానని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బదులిచ్చారు. జిల్లాకు 3.96 టీఎంసీల నీటి వాటా ఉంటే సగం కూడా సర్కారు విడుదల చేయడం లేదు. సీబీఆర్ వద్ద పలుమార్లు ధర్నాలు చేశాం. నీటిని పంపింగ్ చేయాలని సూచించాం. కలెక్టర్‌కు విన్నవించాం. ప్రభుత్వం స్పందించడం లేదని కలెక్టర్ చేతులెత్తేశార’ని అన్నారు.ఎమ్మెల్యేలు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్సార్‌సీపీరైతువిభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి ,మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, అవినాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
Share this article :

0 comments: