చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలి

చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలి

Written By news on Sunday, June 7, 2015 | 6/07/2015

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవిలో కూర్చునే నైతిక హక్కు లేదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎంత అద్వానంగా చంద్రబాబు వ్యవహరించింది అర్ధం అవుంతుదని, అందరికి నీతులు చెప్పే చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.అందరిని దొంగలని మాట్లాడే చంద్రబాబు దీనికి ఏమి సమాధానం చెబుతారని అన్నారు. పశువులను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొంటున్నారని అన్న చంద్రబాబు తానే ఎలా కొంటున్నది బట్టబయలైందని అన్నారు.ఫ్రీలీ నిర్ణయం తీసుకో అని చంద్రబాబు అనడం అర్దం ఏమిటంటే మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరని చెప్పడం అన్న మాట అని బొత్స భాష్యం చెప్పారు.చంద్రబాబు ఫోన్ ఎక్కడా టాప్ కాలేదని, స్టీవెన్సన్ ఫోన్ ఆధారంగా ఈ విచారణ జరిగిందని,అందులో చంద్రబాబు దొరికిపోయారని బొత్స అన్నారు.
Share this article :

0 comments: