ప్రజా సమస్యలపై బాబుకు చిత్తశుద్ధి లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజా సమస్యలపై బాబుకు చిత్తశుద్ధి లేదు

ప్రజా సమస్యలపై బాబుకు చిత్తశుద్ధి లేదు

Written By news on Sunday, June 7, 2015 | 6/07/2015


ప్రజా సమస్యలపై బాబుకు చిత్తశుద్ధి లేదు
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి

 పులివెందుల : ప్రజా సమస్యలపై చంద్రబాబుకు చిత్తశుద్ధిలేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు. శనివారం స్థానిక వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతుంటే చంద్రబాబు మాత్రం నవ నిర్మాణ దీక్షల పేరుతో పండుగలు చేసుకుంటూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. రైతుల రుణాలు మాఫీకాక, ఇన్‌పుట్ సబ్సిడీ అందక తీవ్ర ఆవేదన చెందుతున్నారన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేక.. చంద్రబాబు చెప్పినట్లు నిరుద్యోగ భృతి అందక కష్టాలు పడుతున్నారన్నారు.

అలాగే డ్వాక్రా మహిళలకు కూడా రుణమాఫీ సక్రమంగా చేయలేదన్నారు. ఏడాది కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. చంద్రబాబు మాత్రం తన అనుచరులకు పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో కాంట్రాక్టులు కేటాయించి అందులో కమిషన్ల రూపంలో దోచుకుంటున్నారన్నారు. సాక్షాత్తూ తన పార్టీ ఎమ్మెల్యే సీబీఐకి అడ్డంగా దొరికినా చంద్రబాబు నోరు మెదపడంలేదన్నారు.

పైగా అవినీతి నిర్మూలించాలని చంద్రబాబు ప్రతిజ్ఞ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జిల్లాలో గండికోటకు నీరు తెప్పిస్తామంటున్న దేశం నేతలు మహానేత వైఎస్‌ఆర్ హయాంలో 80శాతం పూర్తయిన పెండింగ్ ప్రాజెక్టులకు బడ్జెట్‌లో ఎందుకు నిధులు విడుదల చేయలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు. ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా... చంద్రబాబు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుదామా అని ఎదురుచూస్తున్నారన్నారు. చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పేరోజు మరెంతో దూరంలేదని ఆయన పేర్కొన్నారు.

 సమస్యల పరిష్కారానికి కృషి
 పులివెందులలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఉన్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి శనివారం ప్రజలతో మమేకమయ్యారు. కొంతమంది రైతులు 2012కు సంబంధించిన వేరుశనగ సబ్సిడీ, 2014కు సంబంధించిన ఇన్‌పుట్ సబ్సిడీ ఇంకా అందలేదని ఆయన దృష్టికి తేగా.. ఆయన ఢిల్లీలోని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి రైతులకు త్వరగా పరిహారం అందేలా చూడాలని కోరారు.  కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు శివప్రసాద్‌రెడ్డి, వేల్పుల రాము, సర్వోత్తమరెడ్డి, రసూల్, పక్కీరప్ప తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: