2014 వరకూ‌ కాంగ్రెస్‌తో చంద్రబాబు చీకటి ఒప్పందం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 2014 వరకూ‌ కాంగ్రెస్‌తో చంద్రబాబు చీకటి ఒప్పందం

2014 వరకూ‌ కాంగ్రెస్‌తో చంద్రబాబు చీకటి ఒప్పందం

Written By news on Sunday, September 22, 2013 | 9/22/2013

చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన వెనుక ఉన్న అసలు కారణం 'అధికారం కోసం ఆరాటం.. శ్రీ జగన్‌పై పోరాటం'..రాష్ట్రం అనిశ్చిత పరిస్థితుల్లో ఉందని,చక్కదిద్దాలని చెబుతున్న చంద్రబాబే నిజానికి అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నారు 

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వివరించేందుకు అని చంద్రబాబు పైకి ప్రచారం చేసుకుంటున్నా , వైయస్  జగన్ బెయిల్ పై  బయటకు వస్తే తనకు రాజకీయ భవిష్య‌త్ ఉండదని ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి స‌హా అన్ని పార్టీల నేతలను  చంద్రబాబు కలిశారు

చంద్రబాబు నాయడు ఢిల్లీకి ఏ ప్రతిపాదనలతో వెళ్ళారు? ఇరు ప్రాంతాల టిడిపి నాయకులను ఢిల్లీ తీసుకు వెళ్లడం వెనుక ఉన్న రాజీ మార్గం ఏమిటి? ఇరు ప్రాంతాల నాయకులు కూడా ఏదో ఒక రాజీ మార్గానికి అంగీకరించారా? తెలంగాణ ప్రాంత నేతలు సమైక్యాంధ్రకు అంగీకరించారా లేక సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు ప్రత్యేక తెలంగాణకు ఒప్పుకున్నారా?ఇవన్నీ సమధానం చెప్పాలి 

 ఢిల్లీ పెద్దలకు చంద్రబాబ చెప్పింది సమైక్యాంధ్ర గురించీ కాదు.. తెలంగాణ వాదం గురించీ కాకుండా.. కేవలం  శ్రీ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్‌ ఇవ్వకుండా నిరోధించాలని రాష్ట్రపతిని, ఇతర రాజకీయ పార్టీల నాయకులను చంద్రబాబు కోరారు.

ఏదో ఒకలా తాను అధికారంలోకి రావాలన్న ఆరాటమే చంద్రబాబులో కనిపిస్తోంది.  ఒక పక్కన సమైక్యాంధ్ర, మరో పక్క ప్రత్యేక తెలంగాణ , ఇంకో పక్కన తనకు అధికారం ఇవ్వండి.. ఆరు నెలల్లోపల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానంటారు

ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాంక్షిస్తే.. సీమాంధ్రుల సెంటిమెంటును గౌరవిస్తే.. ఈ అనిశ్చిత పరిస్థితి తొలగే వరకూ సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించండి అని చంద్రబాబు ఒక్క మాట ఎందుకు అనలేకపోతున్నారు. చంద్రబాబుది ప్రజలను మోసగించే విధానమే తప్ప మరొకటి కాదు

 కాంగ్రెస్‌వారిని కలవనని చంద్రబాబు చెబుతున్నారు, అయితే వారిని పగలు కాకుండా చీకట్లో మాత్రమే రహస్యంగా కలుసుకుని కుట్రలు చేస్తారు. చంద్రబాబు పక్కన ఉంటే కార్పొరేట్‌ సంస్థల యజమానులైన ఎంపిలు కేంద్ర మంత్రులతో ఎలాంటి సయోధ్య నడుపుతున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు

  శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై  పోరాటం చేయదలచుకుంటే.. దాని కోసమే వెళ్ళామని చంద్రబాబు ధైర్యంగా చెప్పాలి . సమైక్య ఉద్యమం కోసం వెళ్ళానని అబద్ధాలు చెప్పాల్సిన అగత్యం ఏమొచ్చింది

 సమైక్యాంధ్ర కోసం సమస్య పరిష్కారానికి వెళ్ళానని చంద్రబాబు చెబుతున్న మాట శుద్ధ అబద్ధo. రాష్ట్రపతిని కలిసేందుకు అనుమతి కోరుతూ చంద్రబాబు తన సంతకంతో పంపించిన లేఖలో 'వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి, ఆయనకు సంబంధించిన వారి అవినీతి, మనీ లాండరింగ్‌ కేసులపై విచారణకు సంబంధించి చర్చించడానికి మీ అనుమతి కావాలి' అని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ లేఖలో సమైక్యాంధ్ర గురించి ఒక్క వాక్యమైనా ఉందా? 
 సమైక్యాంధ్ర కోసమే ఢిల్లీ వెళ్ళినట్లు చెబుతున్న చంద్రబాబు లేఖలో  రావణకాష్టంలా మారిపోయిన రాష్ట్రం గురించి, సీమాంధ్ర ఉద్యమం గురించి ఒక్క వాక్యమైనా ఎందుకు లేదు

 ప్రజల్ని  చంద్రబాబు ఇప్పటికింకా మోసం చేస్తూనే ఉన్నారు. ఇంత మోసకారి గనుకే చంద్రబాబును సీమాంధ్రులు గాని, తెలంగాణ వారు గాని నమ్మడం లేదు. చంద్రబాబు ఉభయభ్రష్టుడు అయ్యారు. తనను తానే నాశనం చేసుకునే ఒక వ్యవస్థగా చంద్రబాబు తయారయ్యారు. టిడిపిని ఎన్టీఆర్‌ ఏ ఆశయాలతో స్థాపించారో వాటిని తుంగలో తొక్కి టిడిపినిని కాంగ్రెస్‌కు పిల్ల పార్టీగా తయారు చేశారు

విచారణ పూర్తయిన తరువాత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌ పొందడానికి అర్హుడు అని సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. శ్రీ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్‌ అనివార్య0 

.సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ఆదేశాల మేరకూ శ్రీ జగన్‌ ఆస్తుల కేసులో సిబిఐ విచారణ సెప్టెంబర్‌ నాటికి పూర్తి చేసింది, ఆ విషయాన్ని సిబిఐ కోర్టుకు రాతపూర్వకంగా తెలియజేసింది. శ్రీ జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు విని, తీర్పును రిజర్వు చేసింది . ఈ పరిస్థితుల్లో సిబిఐ కోర్టును ప్రభావితం చేసే విధంగా చంద్రబాబు జగన్  గారి బెయిల్‌ గురించి ప్రకటనలివ్వడం, రాష్ట్రపతి దగ్గర మాట్లాడడం, బెయిల్‌ ఇవ్వకుండా చూడమని ప్రధానిని కోరడం ఎంత వరకూ సబబు 
. ఇది కోర్టు ధిక్కార నేరం కాదా?

 శ్రీ జగన్మోహన్‌రెడ్డి బయటికి వస్తే.. టిడిపి, కాంగ్రెస్‌ పార్టీలు బతకవని కనుక ఆయనను లోపలే ఉంచండి, ఎన్నికలైపోయే వరకూ బయటికి రానివ్వకండి అని చంద్రబాబు నాయుడు చెప్పడం తగునా ?తొమ్మిదేళ్ళు సిఎంగా, మరో తొమ్మిదేళ్ళుగా ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న వ్యక్తికి తగిన పనేనా?

ఒక పక్కన తాను కలవదలచుకున్న కేంద్ర నాయకులను కలుస్తూనే.. మరో పక్కన బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను  కలవడంలో రాజకీయ కారణాలు లేవని చంద్రబాబు చెబుతున్నారు. మరి ఎందుకు వెళ్ళారని మీడియా ప్రశ్నిస్తే.. వ్యక్తిగతం అన్నారు. రాజకీయ నాయకులకు వ్యక్తిగతం ఏమిటి? రాజ్‌నాథ్‌కు చంద్రబాబుకు ఉన్న వ్యక్తిగత సంబంధం ఏమిటి? మోడిని ముఖ్యమంత్రిగా తీసేయకపోతే.. కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తామని ఎక్కడ బడితే అక్కడ ఎవరూ అడగక ముందే చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు ప్లేటు ఫిరాయిస్తున్నారు. అంటే బిజెపి అధికారంలోకి వచ్చేస్తుందేమో.. మోడి ప్రధాని అయిపోతారేమో అనే భయమా?

శ్రీ జగన్‌కు బెయిల్‌ రానివ్వకుండా ఉపయోగించుకునేందుకు 2014 వరకూ‌ కాంగ్రెస్‌తో చంద్రబాబు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారు ,అంతే కాకుండా తన మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై సిబిఐ లాంటి ఏ విధమైన విచారణలూ జరగకుండా మేనేజ్‌ చేసుకోవడమూ ఆ చీకటి ఒప్పందంలో మరో ముఖ్యమైన అంశం .


చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపై 1998లో 'ప్రజా కోర్టులో బిజెపి చార్జిషీట్‌' వేసి, తాము అధికారంలోకి వచ్చినట్లయితే.. చంద్రబాబు పరిపాలన మీద తాము కేంద్ర ప్రభుత్వం చేత విచారణ జరిపిస్తామని ప్రకటించారు . చంద్రబాబు ప్రభుత్వం 100 తప్పుల చేసిందని ఆ చార్జిషీట్‌లో పొందుపరిచారు. ఆ చార్జిషీట్‌లోని నేరాలపై ఎన్‌డిఎ ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా మేనేజ్‌ చేసుకోవడానికే చంద్రబాబు ఆ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు.అంత వరకూ బిజెపిని తిడుతున్న చంద్రబాబు, చంద్రబాబుపై విరుచుకుపడుతున్న బిజెపి 1999లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నారు. 2014లో ఎక్కడ బిజెపి అధికారంలోకి వచ్చి తనపై మరిన్ని తప్పులతో చార్జిషీట్‌ వేసి విచారణకు ఆదేశిస్తుందో అనే భయంతోనే చంద్రబాబు ముందస్తుగా దానితో దోస్తీకి సిద్ధమయ్యారు 



చంద్రబాబు నాయుడు ప్రజలకు చెప్పేదొకటి, నాయకులకు చెప్పేదొకటి.. బయటికి చెప్పేది మరొకటని, ఇంట్లో చెప్పేదొకటి, ఇంటి బయట మరొకటి . పార్టీ ఆఫీసులో ఒకటి.. బయట చెప్పేదొకటి . ఇలాంటి అనిశ్చితమైన మనసుతో చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారు. కడప ఎన్నికలప్పుడు, ఉప ఎన్నికల సందర్భంలో బిజెపితో శ్రీ జగన్‌ కుమ్మక్కైపోయారు.. బిజెపి సంగతి మనం చూడాలని చెప్పిన చంద్రబాబు అవన్నీ మర్చిపోయి అవకాశ వాదంతో ఎవరితో ఎలాంటి ఒప్పందాలకైనా దిగజారిపోవడం ఆయన నైజం  --దాడి వీరభద్రరావు 

చంద్రబాబుది సమైక్య వాదమా? తెలంగాణ వాదమా? లేక పలాయన వాదమా?- దాడి వీరభద్రరావు 

 సమస్యను పరిష్కరించకుండా దూరంగా పారిపోవడం దానికి ఓ కథ చెప్పడం చంద్రబాబుకు అలవాటే . ఈ ప్రపంచంలో అందరి కంటే తానే బిజీగా ఉన్నట్లు పెద్ద బిల్డప్‌ ఇస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై చంద్రబాబు నిర్ణయం ఏమిటో, తమ సిద్ధాంతం ఏమిటో చెప్పాలి. ప్రజలను మరోసారి మోసం చేయవద్దు. సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించమని కేంద్రాన్ని కోరతారా? లేదా? స్పష్టం చేయాలి
Share this article :

0 comments: