కోర్టు అనుమతిస్తే నేడు లక్నోకు జగన్! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కోర్టు అనుమతిస్తే నేడు లక్నోకు జగన్!

కోర్టు అనుమతిస్తే నేడు లక్నోకు జగన్!

Written By news on Tuesday, December 3, 2013 | 12/03/2013

హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టడంలో భాగంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ను ఈ నెల 3న(మంగళవారం) లక్నోలో, జనతాదళ్ (ఎస్) అధినేత దేవెగౌడను 5న(గురువారం) బెంగళూరులో కలిసేం దుకు అనుమతించాలంటూ వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు. ఈ మేరకు రెండు పిటిషన్లు దాఖలు చేశారు. లక్నో వెళ్లేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.
 
 లక్నో వెళ్లేందుకు వీలుగా మంగళవారం వీలైనంత త్వరగా నిర్ణయాన్ని వెలువరించాలని జగన్ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి కోర్టుకు విన్నవించారు. బెంగళూరు వెళ్లేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ 4వ తేదీకి వాయిదాపడింది. మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలిసేందుకు ఈ నెల 4న చెన్నై వెళ్లడానికి అనుమతించాలన్న జగన్‌మోహన్‌రెడ్డి అభ్యర్థనను సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతించింది. ఈ మేరకు జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం విచారించిన సీబీఐ కోర్టుల ఇన్‌చార్జ్ న్యాయమూర్తి లక్ష్మణ్.. అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు.
 
నేడు కోర్టులో హాజరుకానున్న జగన్..
తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో జగన్ మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుకానున్నారు. అలాగే ఈ మొత్తం వ్యవహారంలో సీబీఐ దాఖలు చేసిన పది చార్జిషీట్లలోని నిందితులందరూ ఒకేసారి కోర్టుకు రానున్నారు. వారిలో మంత్రి గీతారెడ్డి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, శ్యాంప్రసాద్‌రెడ్డి, శరత్‌చంద్రారెడ్డి, అయోధ్యరామిరెడ్డి, పెన్నా ప్రతాప్‌రెడ్డి, ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్, శ్రీనివాసరెడ్డి, పునీత్ దాల్మియా, ఐఏఎస్ అధికారులు బి.పి.ఆచార్య, శామ్యూల్, శ్యాంబాబ్, శ్రీలక్ష్మి, రత్నప్రభ, ఆదిత్యనాథ్‌దాస్, డి.మురళీధర్‌రెడ్డిలతో పాటు ఆడిటర్ విజయసాయిరెడ్డి తదితరులు ఉన్నారు.
Share this article :

0 comments: