చంద్రబాబూ..మీ నోరు ఎందుకు మూతబడింది? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబూ..మీ నోరు ఎందుకు మూతబడింది?

చంద్రబాబూ..మీ నోరు ఎందుకు మూతబడింది?

Written By news on Friday, December 6, 2013 | 12/06/2013

చంద్రబాబూ..మీ నోరు ఎందుకు మూతబడింది?వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్:రాష్ట్ర విభజనపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎందుకు నోరు మెదపడం లేదని వైఎస్సార్ సీపీ నేత వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపిన నేపథ్యంలో శుక్రవారం వైఎస్సార్ సీపీ సీమాంద్ర బంద్ చేపట్టిన సంగతి తెలిసిందే. తమ పార్టీ చేపట్టిన బంద్ విజయవంతమైందని ఆమె తెలిపారు. ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న బాబు బంద్ విషయంలో వెనుకంజ వేయటాన్ని ఆమె నిలదీశారు. సీమాంధ్రలో తలపెట్టిన బంద్ పై బాబు ఎందుకు స్పందించడం లేదని పద్మ ప్రశ్నించారు.
 
చంద్రబాబు  నోరు మూతపడటానికి కారణాలేంటో ప్రజలకు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.  ప్రజల భాగస్వామ్యంతో బంద్ సంపూర్ణంగా జరిగిందన్నారు. కృష్టా జలాలపై బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును తప్పకుండా ఆశ్రయిస్తామన్నారు.
Share this article :

0 comments: