ఇది ఢిల్లీ అహంకారినికి, తెలుగు వాడి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోటీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇది ఢిల్లీ అహంకారినికి, తెలుగు వాడి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోటీ

ఇది ఢిల్లీ అహంకారినికి, తెలుగు వాడి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోటీ

Written By news on Sunday, December 1, 2013 | 12/01/2013

'సమైక్య రాష్ట్ర అవశ్యకత తెలియచేద్దాం'
చిత్తూరు: రాష్ట్ర విభజనను కేంద్రం అడ్డగోలుగా చేస్తోందని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం జిల్లాలోని రామకుప్పంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు విచ్చేసిన అశేష జనవాహినిని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. తొలుత వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడారు. ఈ సమైక్య శంఖారావం సభకు ప్రజల పెద్ద ఎత్తున మద్దతు తెలపడం తనకు చాలా గర్వంగా ఉందని తెలిపారు .ప్రతి ఒక్కరూ భుజం..భుజం కలిపి కదం తొక్కుతూ సమైక్య రాష్ట్రం గురించి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. విభజన జరిగితే సీట్లు గెలుచుకోవచ్చనే ఉద్దేశంతో  కేంద్రం.. ప్యాకేజీలిస్తే సరిపోతుందని చంద్రబాబు నాయుడు కుతంత్రాలకు పాల్పడుతూ  ప్రజల్ని అంధకారంలోకి నెట్టుతున్నారని జగన్ విమర్శించారు.
 
సమైక్య రాష్ట్రం అవశ్యం ఏమిటో రాష్ట్ర ప్రభుత్వానికే కాదు.. కేంద్రానికి కూడా  తెలియచేద్దామని జగన్ అన్నారు.  ఇది ఢిల్లీ అహంకారినికి, తెలుగు వాడి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోటీ అని జగన్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యమై రాష్ట్ర విభజనను ఖండించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. సమైక్య సందేశాన్ని దేశానికి వినిపించేందుకే కుప్పం నుంచి సమైక్య శంఖారావానికి పూనుకున్నట్లు జగన్ తెలిపారు. జిల్లాలోని కుప్పం ఇప్పటికే వెనుకబడి పోయిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.  ఒకవేళ రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర జిల్లాలకు సముద్రం నీరు తప్ప, మంచి నీరు ఎలా వస్తుందని కేంద్రాన్ని నిలదీశారు.
Share this article :

0 comments: