నిజాలెందుకు రాయరు రామోజీ..? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నిజాలెందుకు రాయరు రామోజీ..?

నిజాలెందుకు రాయరు రామోజీ..?

Written By news on Tuesday, April 29, 2014 | 4/29/2014

నిజాలెందుకు రాయరు రామోజీ..?
2000 నుంచి విశాఖలో ఫార్మా సిటీ ఏర్పాటుకు  ప్రయత్నాలు ఫార్మా సిటీకి 2,143 ఎకరాలు కట్టబెట్టింది చంద్రబాబు కాదా?.. టెండర్ల ప్రాసెసింగ్‌ను  ఎల్ అండ్ టీకి అప్పగించిందీ ఆయనేగా? 13 సంస్థలొచ్చినా వంకలు పెట్టి వాటిని వెనక్కి పంపేయలేదా? ఆ తరవాత బాబు జోక్యం చేసుకున బీఓటీ పద్ధతిని మార్చలేదా? 2003లో రాంకీకి సింగిల్ టెండరుపై   కట్టబెట్టిన మాట వాస్తవం కాదా? సంస్థ ఏర్పాటైన 24 గంటల్లోన కన్సెషన్ ఒప్పందం కుదుర్చుకోలేదా?  ఆపద్ధర్మ సీఎంగా ఉంటూనే ఓకే చేశారుగా? ... పైవన్నీ రాయరెందుకు?  {Xన్‌బెల్ట్‌కు 58 ఎకరాలు చాలన్నది బాబేగా? దాన్నే వైఎస్ కొనసాగించారుగా?  పెంచకుండా వదిలేయటమే వైఎస్ నేరమా?  అందుకే వారు సాక్షిలో రూ. 10 కోట్లు పెట్టి ఉంటే.. 2,143 ఎకరాలిచ్చిన బాబుకేమిచ్చారు? ...ఇవన్నీ మీ పచ్చరాతల్లో కనిపించవెందుకు? రామోజీ? ఇంకెన్నాళ్లిలా?
 
2009 ఎన్నికల ముందు అనుబంధ పేజీలు పెట్టి విషం కుమ్మరించినా... గతేడాది కడప ఉప ఎన్నికల ముందు రోత కథనాలు రాసి కాలకూటం కక్కినా... కోవూరు ఎన్నికల ముందు శివాలెత్తి తప్పుడు రాతలతో చెలరేగిపోయినా... 18 స్థానాల ఉప ఎన్నికల ముందు ఊగిపోయినా రామోజీకి దక్కినదేమీ లేదు. బాబు పొడిచింది కూడా లేదు. ఈ ఎన్నికల ముందూ అదే చేస్తున్నారు. కాకపోతే పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ... మొత్తం అన్ని పేజీలనూ వైఎస్‌పై విషప్రచారానికే కేటాయిస్తున్నారు. ‘హరితలో కోత... జగతికి మేత’ అంటూ సోమవారం పాంచజన్యంలో వండిన కథనం కూడా ఈ కోవలోనిదే. రాంకీ వ్యవహారంలో సీబీఐ వేసిన చార్జిషీట్‌లోని అంశాలే తప్ప కొత్తవి కావివి. అవే మళ్లీ అచ్చేశారు. మరి దీన్లోని నిజమెంత?

 ఏది నిజం?
 
 ప్రత్యేక ప్రతినిధి: రాంకీ వ్యవహారంపై ఇదే కథనాన్ని ఇప్పటికే కొన్ని పదులసార్లు ‘ఈనాడు’లో అచ్చేశారు రామోజీరావు! కాకపోతే ఎప్పుడూ కూడా ఈ అసలు విశాఖ ఫార్మాసిటీకి టెంకాయ కొట్టిందే చంద్రబాబునాయుడని, సింగిల్ టెండర్ ఉన్నదనే ఆలోచన కూడా లేకుండా రాంకీకి హడావుడిగా భూములు కేటాయించింది ఆ బాబేనని, ఆపద్ధర్మ సీఎంగా ఉంటూనే ఇదంతా చేశారని ఒక్కటంటే ఒక్కసారి కూడా రాయరు.
 
ఇక ైవె ఎస్ రాజశేఖరరెడ్డి విషయానికొస్తే ఆయన ఈ ఫార్మాసిటీలో గ్రీన్‌బెల్ట్ పెంచాలని భావించారు. తరవాత కంపెనీ అభ్యర్థనలు, ప్రభుత్వ సంస్థల వివరణలు చూశాక ఆ ఆలోచన విరమించుకున్నారు. మొదట్లో చంద్రబాబు నిర్ణయించిన మేరకే గ్రీన్‌బెల్ట్ ఉండేలా నిబంధన పెట్టారు. ఇలా పెంచాలనుకుని, తర్వాత పెంచనందుకే రాంకీ సంస్థ జగతి పబ్లికేషన్స్‌లో రూ.10 కోట్లు పెట్టిందనేది ‘ఈనాడు’ వాదన. దాన్నే యథాతథంగా సీబీఐ కూడా తన చార్జిషీట్‌లో పెట్టేసింది. ఇదంతా ఎందుకు జరిగిందనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలియని విషయమేమీ కాదు. అయినా గ్రీన్‌బెల్ట్ పెంచాలనుకుని పెంచనందుకే వైఎస్ కంపెనీలో రాంకీ రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టినట్లయితే దానికి 2,143 ఎకరాల్ని ఫార్మా సిటీ కోసం కట్టబెట్టిన చంద్రబాబునాయుడికి ఎంత ముడుపులు ముట్టి ఉండాలి? దీనిపై చంద్రబాబును రామోజీ ఎన్నడూ ప్రశ్నించరెందుకు? సీబీఐ కూడా చార్జిషీట్‌లో ఆ విషయాన్ని నామమాత్రంగా ప్రస్తావించింది తప్ప చంద్రబాబును ప్రశ్నించలేదెందుకు? ఇదంతా జరిగిన కుట్రను బయటపెట్టడం లేదా? కేవలం జగన్‌మోహన్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నారనడానికి ఇంతకన్నా ఏం కావాలి?

అసలు జరిగింది ఇదీ...


  హెదరాబాద్ కాకుండా ఇతర ప్రాంతాల్లో ఫార్మా సంస్థల కోసం క్లస్టర్ ఏర్పాటు చేయాలని 1999లో చంద్రబాబు  భావించారు. విశాఖపట్నంలో ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తామంటూ 2000 జూలై 18న జీవోనం.381 విడుదల చేశారు.ఈ జీవో ప్రకారం పరవాడను ఎంపిక చేశాక... ఫార్మా కాలుష్యం దృష్ట్యా ఆ ప్రాంతం సరికాదని అభ్యంతరాలు వచ్చాయి. వాటిని బుట్టదాఖలు చేశారు బాబు. పరవాడను ఖరారు చేస్తూ 2001 సెప్టెంబర్ 24న జీవోఎంఎస్ నంబరు 501ని విడుదల చేశారు.
 
ఎల్ అండ్ టీకే టెండర్ల ప్రక్రియ...

 చంద్రబాబు హయాంలో ఏం చేయాలన్నా ఎల్ అండ్ టీనే. అందుకే అది రుణం తీర్చుకుంటూ టీడీపీ కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌ను ఫ్రీగా కట్టేసింది. యథాప్రకారం ఫార్మా పార్కు టెండర్ల ప్రక్రియను ఎల్ అండ్ టీ రాంబోల్ కన్సల్టింగ్ ఇంజనీర్స్‌కు అప్పగించారు బాబు. 2002 అక్టోబర్ 31న టెండర్లు పిలవగా, డిసెంబర్ 17న ప్రకటనలొచ్చాయి. రాంకీ ఎన్విరో ఇంజనీర్స్, రాంకీ ఎస్టేట్స్ సహా 13 సంస్థలు ఆసక్తి వ్యక్తంచేశాయి. కానీ రాంకీ సహా ఏడుగురే ఆర్‌ఎఫ్‌పీ పత్రాల్ని ఏపీఐఐసీ నుంచి కొనుగోలు చేశారు. చివరకు మూడు కంపెనీలు... జూమ్ డెవలపర్స్, మరిది, వర్ట్సిలా సంస్థలు మాత్రమే సవివర ప్రతిపాదనల్ని సమర్పించాయి. వీటిలో మారిషస్‌కు చెందిన క్రిస్సన్‌తో కలసి జూమ్ డెవలపర్స్ వేసిన ప్రతిపాదన మాత్రమే అర్హత పొందింది. కానీ  ఏపీఐఐసీ  ప్రశ్నలకు సరైన సమాధానాలివ్వలేదనే కారణంతో జూమ్ ప్రతిపాదన్నీ రద్దు చేశారు.

 నిబంధనలు మార్చిన చంద్రబాబు...
 
టెండర్ల ప్రక్రియ రద్దవటంతో బాబు కొత్త ఆలోచన చేశారు. 2003 జూన్ 28న... బిల్ట్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ (బూట్) బదులు బిల్డ్ ఆపరేట్ ఓన్ (బీఓఓ) ప్రాతిపదికకు మార్చాలని నిర్ణయించారు. తరవాత నెల రోజులకే... అంటే 2003 జూలై 31న రాంకీ ఇన్‌ఫ్రా సంస్థ ముందుకొచ్చింది. ఆసక్తి వ్యక్తీకరిస్తూ ఏపీఐఐసీకి ప్రతిపాదన సమర్పించింది. దీనిపై ఇన్‌ఫ్రా సబ్ కమిటీ నేరుగా చంద్రబాబుతో చర్చించింది. చివరికి 2003 నవంబర్ 14న రాంకీతో చర్చించే అధికారాన్ని నేరుగా ఏపీఐఐసీకే అప్పగిస్తూ చంద్రబాబు ఒక నోట్‌ను ఆమోదించారు. రెండు మూడు నెలల్లో మొత్తం రెడీ. ప్రాజెక్టును అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవటం... ఎంఓయూ కుదుర్చుకోవటం... అన్నీ జరిగిపోయాయి.  కానీ అప్పటికే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూనే చంద్రబాబు... 2004 మార్చి 11న రిజిస్టరయిన రాంకీ ఫార్మాసిటీ సంస్థతో మార్చి 12న కన్సెషన్ ఒప్పందం కుదుర్చుకున్నారు. పలు రాయితీలూ ఇచ్చారు. ఇదీ... జరిగింది.
 
ఇదీ... గ్రీన్‌బెల్ట్ నిబంధన
 
2000 మార్చిలో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పేర్కొన్న విధంగా గ్రీన్ బెల్డ్ ఉండేలా డెవలపర్ చూసుకోవాలని కన్సెషన్ ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు. దీని ప్రకారం చంద్రబాబు గ్రీన్‌బెల్ట్‌కు నిర్దేశించిన మొత్తం భూమి 352 ఎకరాలు. ఈ ఒప్పందం  ప్రకారం 2005 ఫిబ్రవరి 28న విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా)కు ‘రాంకీ’ లే ఔట్ ప్లాన్‌ను అందజేసింది. ఈ  ప్లాన్ ప్రకారం గ్రీన్‌జోన్ మొత్తం 352 ఎకరాలుంది. దీన్లో గ్రీన్ బెల్ట్ ఏరియా 58.95 ఎకరాలు, ఓపెన్ స్పేస్‌లో గ్రీన్ బఫర్ 221.21 ఎకరాలు, హెచ్‌టీ కారిడార్‌లో గ్రీన్ బఫర్ 72 ఎకరాలు ఉంటుంది. ఈ లేఔట్‌కు వుడా ఆమోద ముద్ర వేసింది.

 గ్రీన్ బెల్ట్‌పై వైఎస్ సమావేశాలు...
 
ఈనాడు చెబుతున్న దాని ప్రకారం వైఎస్ అధికారంలోకి వచ్చాక ఫార్మా సిటీపై సమీక్ష జరిపారు. దీన్లో ‘నో డెవలప్‌మెంట్ జోన్’గా ప్రకటించే గ్రీన్‌బెల్ట్ ఏరియా... బౌండరీ చుట్టూ ఒక కిలోమీటర్ ఉంటే బెటరని, అది గోడకు అవతల 500 మీటర్లు, ఇవతల 500 మీటర్లు ఉన్నా సరిపోతుందని, అక్కడ వుడాయే నేరుగా వాణిజ్య ప్రాతిపదికన మొక్కలు పెంచాలని సూచించారు. ఆ తరవాత దాన్ని గోడకు వెలుపల 250 మీటర్లు, లోపల 50 మీటర్లుగా ఉంటే చాలనుకున్నారు. ఇలా చేయటం వల్ల రాంకీకి లబ్ధి కలిగిందట!! అందుకే ఆ సంస్థ... పరోక్షంగా రూ.10 కోట్లు ‘సాక్షి’లో పెట్టుబడి పెట్టిందట!!

ఇక్కడ కొన్ని మౌలికమైన ప్రశ్నలున్నాయి

 
ఫార్మాసిటీ ప్రస్తుతం గోడకు లోపల గ్రీన్‌బెల్ట్ 50 మీటర్లుగా ఉండటం వల్ల రాంకీ సంస్థ వదిలిపెట్టాల్సిన స్థలం 58.95 ఎకరాలు. మరి ఇది చంద్రబాబు హయాంలో ప్రతిపాదించినదే కదా? దాన్ని వైఎస్ మార్చారా?  వైఎస్ 250 మీటర్ల గ్రీన్‌బెల్ట్ ఉండాలని  ప్రతిపాదించినపుడు... తాము చంద్రబాబు హయాంలో 50 మీటర్లే వదిలేట్టుగా కన్సెషన్ ఒప్పందం కుదుర్చుకున్నామని, దానికే పరిమితం కావాలని ఆయన్ను రాంకీ సంస్థ కోరే అవకాశం లేదా? అలా కోరితే మునుపటి ఒప్పందమే కనుక ఆమోదించవచ్చని ముఖ్యమంత్రి వైఎస్ భావించే అవకాశం లేదా? అలాంటి సహేతుకమైన కారణాలన్నిటినీ వదిలేసి... సాక్షిలో పెట్టుబడి పెట్టారు కనుకే ఈ మేలు చేశారనటం ఎంతవరకు సమంజసం?
   
 ఏం! జగన్‌మోహన్‌రెడ్డి వ్యాపారదక్షతపై నమ్మకం ఉండో, మున్ముందు ఇన్వెస్ట్‌మెంట్లు లాభిస్తాయనో, రాష్ట్రంలో బొమ్మనే కాదు... బొరుసునూ చూపించే పత్రిక వస్తోంది కాబట్టి దానికి మద్దతివ్వాల్సిన అవసరముందని భావించో ‘రాంకీ’ సంస్థ పెట్టుబడి పెట్టే అవకాశం లేదా? ఇదెక్కడి అడ్డగోలు తీరు? {Xన్‌బెల్ట్‌పై నిజానికి రాంకీ సంస్థకు వైఎస్ ప్రభుత్వం చేసిన మేలేమీ లేదు. మునుపటి ఒప్పందాన్నే పాటించింది. మరి ఈపాటి దానికే ‘సాక్షి’లో రాంకీ రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టిందన్న సీబీఐ వాదన నిజమైతే... 2,143 ఎకరాల్ని సింగిల్ టెండరు ప్రాతిపదికగా కట్టబెట్టేసిన చంద్రబాబునాయుడికి రాంకీ ఎంత ముడుపులిచ్చి ఉండాలి? అంత హడావుడిగా ఎన్నికల ముందు ఒప్పందం కుదుర్చుకున్నారెందుకు? ఎంత ముడుపులు తిని ఉంటారు? అసలు చంద్రబాబు హయాంలో జరిగిందన్న విషయాన్నే వదిలిపెట్టిన రామోజీరావును ఏమని భావించాలి? పదేపదే అవే అబద్ధాలు రాస్తే నిజమైపోతాయా?

 నిరూపిస్తే నేను   ఉరికైనా సిద్ధం!
 
 లేకుంటే మీరేం చేస్తారు రామోజీ?
 ‘ఈనాడు’ రాతలపై అయోధ్యరామిరెడ్డి భావోద్వేగం

 
 ‘ఈనాడు’ వార్తలపై రాంకీ సంస్థ మాజీ చైర్మన్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నర్సరావుపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఆయన... ప్రచారంలో ఉండగానే ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సారాంశమిదీ...
 రామోజీరావు గారూ! మీరు చాలా పెద్దవారు. ఒక వ్యాపారాన్ని నిర్మించడానికి ఎంత కష్టపడాలో మీకు తెలియనిదేమీ కాదు. పాతికేళ్ల పాటు ఒక్కో ఇటుకా పేర్చుకుంటూ మా కుటుంబం నిర్మించుకున్న రాంకీ గ్రూప్‌ను మీ పత్రికల్లో రాస్తున్న రాతలు ఎంతలా దెబ్బతీస్తున్నాయో తెలుసా? బిలియన్ డాలర్ల సంస్థగా ఎదిగి, స్టాక్ మార్కెట్లో లిస్టయిన రాంకీపై.. అవే ఆరోపణలను మళ్లీ మళ్లీ రాస్తున్నారు తప్ప మేమిచ్చిన వివరణను మీరెన్నడూ పట్టించుకున్నారా? మీకు తెలుసు! నేను రాజకీయాల్లోకి వస్తూ రాంకీ గ్రూప్‌లో అన్ని బాధ్యతలకూ రాజీనామా చేశా. అయినా వ్యవస్థాపకుడిగా నా స్పందన ఒక్కటే. ఫార్మా సిటీలో ‘రాంకీ’కి అయాచిత లబ్ధి కలిగిందనే మాట పూర్తి అవాస్తవం. ఒకవేళ అదే నిజమని మీరు నిరూపిస్తే నర్సరావు పేట నడిబొడ్డున ఉరి తీసుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నా!! నిరూపించలేకపోతే మీరేం చేస్తారన్నదే నా ప్రశ్న. ఎందుకంటే 18 శాతం గ్రీన్‌బెల్ట్ ఉన్న ఫార్మాసిటీ ఇండియాలో వేరెక్కడా లేనే లేదు. ఉన్న 2000 ఎకరాల్లో 368 ఎకరాల్ని గ్రీన్‌జోన్‌కే కేటాయించాం. కన్సెషన్ అగ్రిమెంట్‌కు నూటికి నూరుశాతం కట్టుబడి పనిచేశాం. మేం చెప్పేదొక్కటే! వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు రాయొద్దు. ఒక వ్యక్తి పరువు ప్రతిష్టలు దెబ్బతీయటానికి ఇలా పనిగట్టుకుని దుష్ర్పచారం చేయొద్దు. వ్యక్తిత్వాన్ని హత్యచేసే ఇలాంటి పనులు మీ స్థాయికి తగవు. ఇలాంటి వాటిని ఇకనైనా మానుకుంటారని భావిస్తున్నాను.
Share this article :

0 comments: