సీబీఐ విచారణకు సిద్ధమేనా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐ విచారణకు సిద్ధమేనా?

సీబీఐ విచారణకు సిద్ధమేనా?

Written By news on Friday, May 2, 2014 | 5/02/2014


బొబ్బిలి (విజయనగరం జిల్లా)/ శ్రీకాకుళం, న్యూస్‌లైన్: ‘‘టీడీపీ అధినేత చంద్రబాబు హయామంతా స్కామ్‌లమయమే. ఏలేరు కుంభకోణం, మద్యం కుంభకోణం, నకిలీ స్టాంపుల కుంభకోణం, తెల్గీ కుంభకోణం, స్కాలర్‌షిప్‌ల కుంభకో ణం, ఐఎంజీ, ఎల్ అండ్ టీ, రహేజా తదితర కుంభకోణాలకు చంద్రబాబు పాల్పడ్డాడు. పనికి ఆహార పథకం, ఇంకు డు గుంతలు, నీరు-మీరు పథకాల్నీ వదల్లేదు. తుఫాన్ నిధుల్ని దిగమింగేశాడు. చంద్రబాబుపై దర్యాప్తు చేయమం టే నెల రోజుల పాటు జాప్యంచేసి సిబ్బంది లేరని కోర్టుకు చెప్పారు సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ.
 
 ఈలోగా దాదాపు 18 కుంభకోణాల్లో స్టేలు తెచ్చుకుని బతుకుతున్నాడు. అటువంటి అవినీతిపరుడా... మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని, జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించేది? చంద్రబాబూ.. నువ్వే తప్పూ చేయలేదనుకుంటే, నీకంత ధైర్యముంటే సీబీఐ విచారణకు సిద్ధమేనా?’’ అని వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయ మ్మ విరుచుకుపడ్డారు. ఆమె గురువారం విజయనగరం జిల్లాలో సాలూరు నియోజకవర్గంలోని మక్కువ, పార్వతీపురం, కురుపాం.. శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ, రాజాం, పొందూరు పట్టణాల్లో జరి గిన వైఎస్సార్ జనభేరి బహిరంగసభల్లో ప్రసంగించారు. పాలకొం డ, రాజాంలలో భారీ వర్షం కురుస్తున్నా ప్రజలు లెక్కచేయలేదు.
 
 పార్టీలో 15 వేల కుటుంబాల చేరిక
 మక్కువ మాజీ ఎంపీపీ మావుడి శ్రీనివాసరావు, రంగునాయుడుల ఆధ్వర్యంలో 15 వేల కుటుంబాలు గురువారం కాంగ్రెస్‌ను వీడి విజ యమ్మ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరాయి. డీసీసీబీ డెరైక్టరు మావుడి తిరుపతిరావుతో పాటు 11 మంది సర్పంచ్‌లు, 42 మంది వివిధ స్థాయిల్లో ఉండే ప్రజాప్రతినిధులు పార్టీలో చేరారు
Share this article :

0 comments: