నాడు రూ.1,400.. నేడు రూ. 700 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నాడు రూ.1,400.. నేడు రూ. 700

నాడు రూ.1,400.. నేడు రూ. 700

Written By ysrcongress on Tuesday, December 13, 2011 | 12/13/2011

ఇదీ బస్తా వడ్ల పరిస్థితి.. ధాన్యం రైతు దుస్థితి: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన



*ఆ వేళ బస్తా డీఏపీ ధర రూ.500.. ఇవాళ రూ. వెయ్యి
*రైతులు, పేదల సమస్యలను ఈ ప్రభుత్వం గాలికి వదిలేసింది
*పేదలు, రైతుల కోసం నిలబడ్డ ఏకైక పార్టీ ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్సే
*డిస్ క్వాలిఫై అవుతామని తెలిసి కూడా మా ఎమ్మెల్యేలు రైతుల పక్షాన నిలబడ్డారు

ఓదార్పు యాత్ర నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్ సువర్ణ యుగంలో రూ.1400, రూ.1500 పలికిన బస్తా వడ్లకు ఇవాళ రూ.720కిపెచ్చు ధర పలకని అధ్వాన పరిస్థితులు ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు, ఎరువుల ధరలు ఆకాశానికి అంటుతుండగా.. రైతులకు గిట్టుబాటు ధర లేక అప్పుల పాలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. 40వ రోజు ఓదార్పు యాత్రలో భాగంగా ఆయన సోమవారం పెదకాకాని, తాడికొండ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. 11 వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఒక్క తాడికొండ నియోజకవర్గ కేంద్రంలోనే ఆరు వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. కతేరులో బురదగుంట్ల ప్రకాశ్ కుటుంబాన్ని ఓదార్చారు. పలు గ్రామాల్లో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

ఇవాళ అక్కా, చెల్లెమ్మలు.. సూర్యుడు లేవక ముందే నిద్ర లేచి పొలానికి పోయి రాత్రి ఏడు గంటల వరకు నడుములు విరిగేలా పనిచేస్తే రూ.100 కూడా గిట్టని పరిస్థితి ఉంది. ఈ రూ.100తో కిలో చింతపండు కొందామని వె ళ్తే.. కిలో చింతపండు ధర రూ.160 పలుకుతున్న దుస్థితి ఉంది. ఒకవైపేమో రోజురోజుకూ ధరలు పైపైకి పోతున్నాయి. మరోవైపు రైతన్న పండించిన పంటకు గిట్టుబాటు లేదు.. రైతు కూలీల శ్రమకు గిట్టుబాటు లేదు. ఆ వేళ రూ.500 ఉన్న డీఏపీ బస్తా ఇవాళ రూ. వెయ్యికి పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ రైతన్నలు వరి వేసుకోవడం కంటే ఉరివేసుకోవడం మేలనుకొంటున్నారు. ఈ ప్రభుత్వమేమో రైతులు, పేదల సమస్యలను గాలికి వదిలేసింది.

డిస్‌క్వాలిఫై అవుతారని తెలిసి కూడా..
కుళ్ళు, కుతంత్రాలతో కూడిన ఆలోచనలతోనే చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై అవిశ్వాసం పెట్టారు. ఈ ప్రభుత్వం పడిపోదు అని నిర్ధారించుకున్న తరువాతే ఆయన అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు. మేం మాత్రం.. విలువల్లేని, విశ్వసనీయత లేని ఈ రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత నింపాలనుకున్నాం.. విలువల కోసం నిలబడాలనుకున్నాం. నాకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలు అవిశ్వాసానికి ఓటు వేస్తే డిస్‌క్వాలిఫై అవుతారని, ఉప ఎన్నికలకు పోవాల్సి ఉంటుందని తెలిసి కూడా ముందుకు వచ్చారు. రాష్ట్రంలో కాదు కదా.. దేశంలోనే పేదల కోసం.. రైతుల కోసం ఉప ఎన్నికలకు వెళ్తున్న ఏకైక పార్టీ ఏదైనా ఉందీ అంటే అది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని నిరూపించిన మా ఎమ్మెల్యేలకు సగర్వంగా సెల్యూట్ చేస్తున్నాను.

నైతిక విలువలు పక్కనపెట్టి..
ఇవాళ రాష్ట్రంలోనైనా.. కేంద్రంలోనైనా సోనియా గాంధీ రాజ్యమేలుతున్నారంటే అందుకు కారణమైన వ్యక్తి దివంగత నేత వైఎస్సార్. అటువంటి నేత చనిపోయాడు అనే సంగతి తెలిసి, తిరిగి రాలేడు అనే సంగతి తెలిసి కూడా ఇవాళ ఆయనను అప్రతిష్టపాలు చేయడం కోసమని ఇదే కాంగ్రెస్ పార్టీ నైతిక విలువలన్నీ పక్కనబెట్టి చివరకు చంద్రబాబుతో కుమ్మక్కైంది. వారిద్దరూ కలిసి కట్టుగా ఒక్కటై రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ల దగ్గర ఉన్న అధికారాన్ని దుర్వియోగం చేస్తున్నారు. ఇవాళ వీళ్లకు ప్రజలు పట్టడం లేదు.. ప్రజా సమస్యలు పట్టడం లేదు. ఇలాంటి పాలకులను చూస్తున్నప్పుడు బాధనిపిస్తోంది.
Share this article :

0 comments: