బాబు పొట్టలో వట్టినాగులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు పొట్టలో వట్టినాగులు

బాబు పొట్టలో వట్టినాగులు

Written By ysrcongress on Sunday, December 11, 2011 | 12/11/2011

బాబు పొట్టలో వట్టినాగులు

అస్మదీయుల కోసం సీఎం హోదాలో జీవో చక్రం తిప్పిన చంద్రబాబు



హైటెక్ సిటీ భూబాగోతం తర్వాత వట్టినాగులపల్లిపై బాబు బినామీల కన్ను
ఆ గ్రామ రైతుల నుంచి కారుచౌకగా భూముల కొనుగోలు
1,170 ఎకరాల్ని ‘111’ జీవో నుంచి మినహాయిస్తూ బాబు మరో జీవో
దాంతో ధరలు అమాంతం పెరిగి భారీగా లాభపడ్డ ఆయన సన్నిహితులు
160 ఎకరాలు రెండున్నర కోట్లకు కొని.. కేవలం 18 ఎకరాలను 
ఏకంగా రూ. 73 కోట్లకు విక్రయించిన శ్రీనిరాజు

సుప్రీంకోర్టు ఆదేశాల నుంచి, జీవో 111 పరిరక్షణ నుంచి చంద్రబాబు హయాంలో కేవలం వట్టినాగులపల్లి భూములనే ఉన్నట్టుండి ఎందుకు మినహాయించారు? హైటెక్ సిటీకి కూతవేటు దూరంలోని అత్యంత విలువైన ఆ భూముల్లో తన బినామీలతో పకడ్బందీగా పాగా వేయించి.. జీవోల మాటున సీఎం హోదాను అడ్డంగా దుర్వినియోగపరిచి.. భారీగా సొమ్ము చేసుకున్న చంద్రబాబు మార్కు ఇంద్రజాలం...

హైదరాబాద్, సాక్షి ప్రతినిధి: అవినీతికి, అధికార దుర్వినియోగానికి పరాకాష్ట ఇది. నారా చంద్రబాబు నాయుడి ఆశ్రీత పక్షపాతానికి, నేరపూరిత స్వభావానికి, బినామీ బాగోతానికి నిలువుటద్దమిది. బాబు అసలు స్వభావానికి మచ్చుతునక ఇది. ఒకవైపు ప్రభుత్వాస్తుల పరిరక్షకుడిలాగా మాటలు చెబుతూ బహిరంగంగా దానికి తగ్గట్టు ఉత్తర్వులు జారీ చేసి... వాటిని అడ్డుపెట్టుకుని కారుచౌకగా భూములు కొనేస్తూ చెలరేగిపొమ్మని తన బినామీలకు చెప్పి.. భూములు వారి చేతికొచ్చాక చల్లగా వారికి మినహాయింపునిచ్చేసిన దారుణమైన కుంభకోణమిది. బాబు అండ్ కో పన్నిన ఈ కుట్రకు వేదిక వట్టినాగులపల్లి. జంట జలాశయాల పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతం రైతులతో... ఇక్కడి భూములతో చంద్రబాబు ఎలా ఆడుకున్నారో తెలుసుకుంటే మతి చెదరక మానదు. కావాలంటే మీరే చూడండి...

జంట జలాశయాలు. రాజధానివాసుల గొంతు తడుపుతూ ప్రాణం నిలబెడుతున్న నీటి కుండలు. పేర్లు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్. 1994లో నాటి కోట్ల విజయ భాస్కరరెడ్డి ప్రభుత్వం వీటి పరిరక్షణకు ‘జీవో 192’ (31-3-94) విడుదల చేసింది. జంట జలాశయాల పరిధిలోకొచ్చే భూముల వినియోగంపై పలు నిబంధనలు దీన్లో పొందుపరిచారు. అయినప్పటికీ కొన్ని ఉల్లంఘనలు చోటుచేసుకోవటంతో పర్యావరణ ఉద్యమకారులు కొందరు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేయటంతో... వాటిని అనుసరిస్తూ... ‘జీవో 111’ జారీ అయింది. 1989లో నాటి ఎన్టీ రామారావు ప్రభుత్వం... 1994లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వం జారీ చేసిన జీవోలకు కొనసాగింపుగా విడుదలైన ఈ జీవో ప్రకారం... జంట జలాశయాల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) సరిహద్దు రాళ్ల నుంచి చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో భారీ సంస్థలు, పరిశ్రమలతో పాటు ఎలాంటి కొత్త నిర్మాణాలూ చేపట్టకూడదు. 

రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లోని మెయినాబాద్, రాజేంద్రనగర్, శంషాబాద్, చేవెళ్ల, షాబాద్, శంకర్‌పల్లి, కొత్తూరు మండలాల్లోని 84 గ్రామాలు ఈ జీవో పరిధిలోకి వచ్చాయి. జీవో ప్రకారం... తమ భూమిలో 10 శాతంలో నిర్మాణాలు చేపట్టి మిగిలిన ప్రాంతాన్నంతా వ్యవసాయానికి మాత్రమే వినియోగించాలి. పెపైచ్చు సాగు కూడా ప్రమాదకర పురుగు మందులేవీ లేకుండానే చేయాలన్న నిబంధన ఉంది. భూగర్భ జలాలు, వరద నీరుతో పాటు గాలి సైతం కాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. అందుకే అప్పట్లో అక్కడి భూములు ధరల్లేక నేలచూపులు చూశాయి.

ముందు హైటెక్ సిటీ... తర్వాత వట్టినాగులపల్లి
వట్టినాగులపల్లి ఉండేది హైటెక్ సిటీ బెల్ట్‌లోనే. కాకుంటే ‘111’ జీవో ఫలితంగా అక్కడ భూముల ధరలు ఒకదశ వరకూ పెరగలేదు. అయితే 1997లో హైటెక్ సిటీని ప్రకటించటం... 1998లో అది పూర్తవటంతో దాని చుట్టుపక్కల భూముల ధరలకు బాగా రెక్కలొచ్చాయి. చంద్రబాబు సన్నిహితుడు మురళీమోహన్ ఈ పరిసరాల్లోనే భారీ వెంచర్లు కూడా వేశారు. అలా... హైటెక్ సిటీ చుట్టూరా ఉన్న భూములు హాట్ కేకులయ్యాయి. 

ధరలు ఆకాశాన్నంటడం, అక్కడ భూములు దొరికే పరిస్థితీ లేకపోవటంతో పలువురి చూపు వట్టినాగులపల్లిపై పడింది. ‘111 జీవో’ ఫలితంగా అక్కడ రైతులు కూడా కాస్త ధర వస్తే చాలునంటూ ఎదురు చూస్తున్న రోజులవి. మరి ప్రభుత్వం నుంచి ఏం సంకేతాలందాయో ఏమో గానీ.. బాబు సన్నిహితుడు కుర్రా శ్రీనివాసరావు, సత్యం ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్ (ఎస్‌ఈఎస్)ను విలీనం చేయటం ద్వారా సత్యం కంప్యూటర్స్‌లో తనకు దక్కిన షేర్లను విక్రయించి భారీ సొమ్ము మూటగట్టుకున్న చింతలపాటి శ్రీనివాసరాజు ఈ భూములపై వాలారు.

1999 నుంచే కొనుగోలు ఒప్పందాలు...
వట్టినాగులపల్లిలో భూముల కొనుగోలుకు శ్రీనిరాజు ఒప్పందాలు చేసుకున్నది 1999 చివర్లో. రిజిస్ట్రేషన్లు మొదలైంది 2000వ సంవత్సరం మొదట్లో. అంటే సత్యంలో తన షేర్ల విక్రయం మొదలు పెట్టాక!!!. తాను అప్పటికే ఏర్పాటు చేసిన టారస్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, అగ్ని ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు తోడుగా స్కార్పియో బయో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, నింభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్ని సైతం ఆయన ఏర్పాటు చేశారు. రైతులకు ఎకరాకు లక్ష రూపాయలు, లక్షన్నర ఇస్తామంటూ ఆశ చూపారు. దాంతో రైతులు కూడా భూములు విక్రయించడానికి ముందుకొచ్చారు. అలా... ఈ నాలుగు సంస్థల ద్వారా ఏకంగా 160 ఎకరాల వరకూ కొనుగోలు చేశారు. మొత్తమ్మీద దీనికి రూ.2.5 కోట్లు వెచ్చించారు. 

ఆ తరవాత ఐ-ల్యాబ్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ లైఫ్ సెన్సైస్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసి.. టారస్ బయోటెక్‌ను అందులో విలీనం చేశారు. వీటిలో కొన్ని కంపెనీలకు డెరైక్టర్లుగా శ్రీనిరాజు, ఆయన భార్య జ్యోతిరాజు, తల్లి కమలమ్మ ఉండగా.. కొన్నింట్లో ఆయన దగ్గరి బంధువులే డెరైక్టర్లుగా కొనసాగుతున్నారు. కాకుంటే అన్ని కంపెనీల్లోనూ 100 శాతం హక్కు మాత్రం శ్రీనిరాజు కుటుంబానిదో లేక చింతలపాటి హోల్డింగ్స్‌దో కావటం గమనార్హం. ఈ కంపెనీలు, తన బంధుమిత్రుల ద్వారా వట్టినాగులపల్లిలో సర్వే నంబర్ 223/3, 224/2, 233, 234, 235, 236, 237, 238, 239, 240, 241, 242, 243, 250లో రాజు నూట అరవై ఎకరాలను తన సొంతం చేసుకున్నారు.

ఆ భూముల్ని మినహాయిస్తూ 2000లో జీవో!
‘111 జీవో’ పరిధిలో ఉన్న భూములు కొన్నంత మాత్రాన లాభమేంటి? అక్కడ నిర్మాణాలు చేపట్టకూడదన్న నిబంధన ఉన్నందున వాటికి డిమాండ్ ఏముంటుంది? ధరలెలా పెరుగుతాయి? ఈ సందేహం ఎవరికైనా సహజం. బహుశా! శ్రీనిరాజుకు ఈ సందేహాలేవీ వచ్చి ఉండకపోవచ్చు..! చంద్రబాబు సన్నిహితుల కోటాలో భాగంగా తన భూముల్ని ‘111 జీవో’ పరిధి నుంచి మినహాయిస్తారనే సమాచారం ఆయనకు ముందే అంది ఉండొచ్చు. లేకపోతే కేవలం వ్యవసాయానికి ఉపయోగపడే భూముల్ని అంత పెద్ద ఎత్తున ఆయన కొనుగోలు చేసే అవకాశమూ తక్కువే. 

ఈ అనుమానాలన్నిటినీ నిజం చేస్తూ 2000 మే 2న ‘జీవో 257’ జారీ అయింది. దానిప్రకారం.. వట్టినాగులపల్లిలోని 147, 148, 149 సర్వే నంబర్లతో పాటు 166 నుండి 265 వరకు ఉన్న సర్వేలతో కలిపి మొత్తం 1,170 ఎకరాల భూముల్ని ‘111 జీవో‘ పరిధి నుంచి మినహాయించారు. అంటే ఆ భూముల్లో ఇక ఏ నిర్మాణాలైనా చేపట్టవచ్చన్న మాట. అదీ లెక్కంటే! ఇంతకూ ఆ జీవో ద్వారా మినహాయించిన భూములెవరివో తెలుసా? అత్యధికం చంద్రబాబు బంధువు నార్నె శ్రీనివాసరావు, సన్నిహితుడు కుర్రా శ్రీనివాసరావు, శ్రీనిరాజులవే. ఆ జీవో వచ్చాక కూడా.. అంతకుముందే చేసుకున్న ఒప్పందాల ప్రకారం కొనుగోళ్లు కొనసాగించారు శ్రీనిరాజు. 

జలాశయాల పరిరక్షణను, ఆ మేరకు సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానమే ఇచ్చిన ఆదేశాలను తోసిరాజని మరీ బాబు ఇంత అడ్డగోలుగా జీవో ఎందుకిచ్చారన్నది ఇక్కడ కీలకాంశం? ఏ ప్రయోజనం ఆశించి ఆయనలా చేశారన్న ప్రశ్నలతో పాటు, వాస్తవానికి ఈ భూములన్నీ బాబు బినామీ ఆస్తులేనన్న ప్రచారం కూడా అప్పట్లో భారీగా జరిగింది. జీవో 257తో పాటు, ఆ ప్రాంతంలో జరుగుతున్న పలు ఉల్లంఘనలు తమ దృష్టికి రావటంతో పర్యావరణ ప్రేమికులు కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పరిస్థితి తెలుసుకున్న కోర్టు.. జంట జలాశయాల పరిధిలో శాశ్వత నిర్మాణాలు కుదరవని, వాటికి మినహాయింపులు చెల్లవని స్పష్టం చేసింది. ఒక రకంగా ఆ జీవో అమలుపై స్టే ఇచ్చింది. దాంతో ఆ జీవో తాత్కాలికంగా పక్కనపడింది.

రంగంలోకి బాబు.. కొత్త ప్రాజెక్టుల ఊసు
రోజులు గడుస్తున్న కొద్దీ ఆ భూములకు సంబంధించి కొత్త కొత్త ప్రకటనలు వెలువడ్డాయి. 2002 చివర్లో బాబు ప్రతిపాదించిన ఫార్ములా-1 రేస్ ప్రాజెక్టు దీన్లో ఒకటి. ఈ భూముల్ని ఆనుకునే ఫార్ములా వన్ రేస్ కోర్సు తెస్తామని ప్రకటించటంతో అప్పట్లో వీటికి విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఫార్ములా-1ను నాటి విపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యతిరేకించటంతో అక్కడ ఐటీ పార్కులైనా ఏర్పాటు చేయాలని బాబు యోచించారు. ఇంతలో ఎన్నికలొచ్చి బాబు ఓడిపోవటంతో ఫార్ములా-1 ప్రాజెక్టు అటకెక్కింది. అయితే ఏపీఐఐసీ అధికారులు ఐటీ పార్కుల ప్రతిపాదనను మాత్రం ముందుకు తెచ్చారు. ఏపీఐఐసీ అందుకుసరేనంది. అవి ‘111’ జీవో పరిధిలో ఉండటంతో సీఎం ఆమోదం అవసరమైంది. కానీ జంట జలాశయాలకు ముప్పు తెచ్చే ఏ ప్రతిపాదనకూ అంగీకరించే ప్రసక్తే లేదంటూ నాటి ముఖ్యమంత్రి వైఎస్ ఈ ఐటీ పార్కుల ప్రతిపాదనను నిష్కర్షగా తోసిపుచ్చారు.

18 ఎకరాలు రూ.73 కోట్లకు విక్రయం!
ఫార్ములా-1 అటకెక్కడం, ఐటీ పార్కులకూ ఆమోదం రాకపోవటంతో ఇక ఏ ప్రాజెక్టులూ రావని నిర్ధా రించుకున్న శ్రీనిరాజు.. తాను చంద్రబాబు హయాంలో పొందిన మినహాయింపుల్ని అనుసరించి వట్టినాగులపల్లిలోని సర్వే నంబర్లు 221, 222, 223, 224లో ఉన్న 18 ఎకరాలు రూ.73.6 కోట్లకు సురానా కుటుంబానికి చెందిన భాగ్యనగర్ ప్రాపర్టీస్‌కు విక్రయించారు. అంటే ఇంకా 135 ఎకరాలు చేతిలో ఉండగానే.. రెండున్నర కోట్ల పెట్టుబడికి రూ.70 కోట్ల లాభం చేతికొచ్చిందన్న మాట. ఇపుడు ఆ 135 ఎకరాలకు గనక ‘111 జీవో’ నుంచి శాశ్వత మినహాయింపు లభిస్తే ఎకరా కనీసం రూ.10 కోట్ల చొప్పున వేసుకున్నా దాని విలువ రూ.1,350 కోట్లు. హైటెక్ సిటీకి సమీపంలో ఉన్న భూమికి 111 జీవో వర్తించకుంటే ఎకరా రూ.15 కోట్లు పలికినా ఆశ్చర్యం లేదు.

మినహాయింపు లేని భూములపై భారీ రుణాలు
శ్రీనిరాజు అక్కడితో ఊరుకోలేదు. మినహాయింపు పొందని భూముల్ని వివిధ బ్యాంకుల వద్ద తనఖా పెట్టి తన పలుకుబడిని ఉపయోగించారు. దాంతో, ఆయన కొన్నది కారు చౌకగానే అయినా... బ్యాంకులు మాత్రం ఆ భూముల్ని హామీగా పెట్టుకుని కోట్ల రూపాయల రుణాలిచ్చాయి. అగ్ని ఆగ్రిటెక్ పేరిట రూ.35 లక్షలు, నింభా బయోటెక్ పేరిట రూ.2.5 కోట్లు.. ఇలా దొరికిన కాడికి రుణాలు తీసుకున్నారు. నిజానికి శ్రీనిరాజు కొన్న భూముల్లో 10 శాతం తనఖా పెడితే... పెట్టుబడి కన్నా అధిక మొత్తం రుణంగా ఆయన చేతికందింది. మొత్తమ్మీద ఈ భూములపై రాజు రూ.45 కోట్లకు పైగా రుణాన్ని 7.5 శాతం వడ్డీకే వివిధ బ్యాంకుల నుంచి రాబట్టగలిగారు.
Share this article :

1 comments:

billarajinikar said...

He big cheater in world.. But his media exposing him, he is very good man in the world. He knows, How to manage the media. You know one day will come , that day he will be in Jail. Please Jagan Anna one thing, You will come to the power surely one day, that day you thrown him to Jail. Please this is all our friends requests. Don't do like Our great leader YSR. You know our leader given him the chance to change. but he haven't change. so please do mentioned thing..

Jai YSR CONGRESS,

From
Billa,
http://www.ameerpetstudent.in