సమైక్య శంఖారావం నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సమైక్య శంఖారావం నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు

సమైక్య శంఖారావం నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు

Written By news on Saturday, October 26, 2013 | 10/26/2013

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న సమైక్య శంఖారావం నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయని తెలిపారు. మరోపక్క స్టేడియం లోపలకు ప్రవేశించి ప్రముఖులు, అభిమానులు, కార్యకర్తలు, మహిళలకు ప్రత్యేక ప్రవేశాలు కేటాయించారు.
 
 మళ్లింపులు ఇలా...
 నాంపల్లి, పోలీసు కంట్రోల్‌రూమ్‌ల వైపు నుంచి వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ చౌరస్తా నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు అనుమతించరు.
 
 సుజాత స్కూల్, చర్మాస్‌ల వైపు నుంచి వచ్చే వాహనాలు బీజేఆర్ స్టాట్యూ వైపు అనుమతించరు. వీటిని గన్‌ఫౌండ్రి ఎస్బీహెచ్ నుంచి అబిడ్స్ వైపు పంపిస్తారు.
 
 సిమెట్రీ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ చౌరస్తా నుంచి హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్ వైపు పంపిస్తారు.
 
 రాజ్‌మొహల్లా రోడ్ నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు వచ్చే వాహనాలను సిమెట్రీ నుంచి మళ్లిస్తారు.
 
 బొగ్గులకుంట, తాజ్ మహల్, ఈడెన్‌గార్డెన్స్, కింగ్ కోఠి వైపు నుంచి వచ్చే వాహనాలను బషీర్‌బాగ్ వైపు అనుమతించరు. వీటిని కింగ్ కోఠి క్రాస్‌రోడ్స్ నుంచి అబిడ్స్ తాజ్‌మహల్ హోటల్ వైపు మళ్లిస్తారు.
 
 అంబేద్కర్ విగ్రహం వైపు నుంచి బషీర్‌బాగ్ జంక్షన్ వైపు వచ్చే వాహనాలను లిబర్టీ చౌరస్తా నుంచి హిమాయత్‌నగర్ వైపు మళ్లిస్తారు.
 
 రవీంద్రభారతి, నాంపల్లి వైపుల నుంచి వచ్చే వాహనాలను ఓల్డ్ కంట్రోల్‌రూమ్ మీదుగా బషీర్‌బాగ్ వైపు అనుమతించరు.
 
 సాధారణ వాహనచోదకులు స్టేడియానికి నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఉన్న మాసబ్‌ట్యాంక్, వీవీ స్టాట్యూ, ట్యాంక్‌బండ్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, ఏంజే మార్కెట్ మార్గాలను ఎంచుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
 
 ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా నగర పోలీసులు విధించిన ఆంక్షలకు నగరవాసులు, సభకు తరలి వచ్చే వారు సహకరించాలని పోలీసులు కోరారు. నిబంధనలను కచ్చితంగా పాటించి కార్యక్రమం ప్రశాంతంగా ముగిసేందుకు సహకరించాలని సూచించారు.
Share this article :

0 comments: