దారులన్నీ అటే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దారులన్నీ అటే

దారులన్నీ అటే

Written By news on Saturday, October 26, 2013 | 10/26/2013

హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం జరిగే ‘సమైక్య శంఖారావం’ సభకు ఎల్‌బీ స్టేడియం ముస్తాబైంది. బషీర్‌బాగ్ చౌరస్తా, అసెంబ్లీ, పబ్లిక్‌గార్డెన్ రోడ్డు, నాంపల్లి ప్రాంతాలలో జగన్‌మోహన్‌రెడ్డి చిత్రాలతో కూడిన బ్యానర్లు, కటౌట్లు,తోరణాలు ఆకర్షిస్తున్నాయి.
 గేటులు, ఎంట్రీలు ఇలా...
ఆయకార్ భవన్ వైపున్న ఔటర్ గేట్ ‘జీ’ నుంచి సాధారణ ప్రజల్ని అనుమతిస్తారు. దీని ద్వారా ప్రాంగణంలోకి ప్రవేశించిన వారు ఇన్నర్ గేట్స్ అయిన 10, 15, 17 ద్వారా స్టేడియంలోకి వెళ్లచ్చు. ఇవన్నీ సాధారణ ప్రజలతో పాటు 17వ నెంబర్ గేట్‌ను ప్రధానంగా మహిళల కోసం కేటాయించారు.
     
 నిజాం కళాశాల ఎదురుగా ఉన్న ఔటర్ గేట్లు ఎఫ్, ఎఫ్-1 నుంచి ప్రాంగణంలోకి ప్రవేశించిన సాధారణ ప్రజలు 8, 10 ఇన్నర్ గేట్స్ ద్వారా స్టేడియంలోకి వెళ్లవచ్చు. ఇదే ఔటర్ గేట్ నుంచి వచ్చిన వీఐపీలు స్టేడియంలోకి వెళ్లడానికి ఇన్నర్ గేట్ 6ను కేటాయించారు.
     
 ఖాన్ లతీఫ్‌ఖాన్ ఎస్టేట్ వైపు ఫతేమైదాన్ క్లబ్ ప్రవేశం పక్కనున్న (టెన్నిస్ కోర్ట్ వైపు వెళ్లే మార్గం) ఔటర్ గేట్ ‘ఎ’ ప్రాంగణంలోకి ప్రవేశించే మహిళలు ఇన్నర్ గేట్ 17 ద్వారా స్టేడియంలోకి వెళ్లచ్చు.
     
 ‘ఎ’ సమీపంలో ఉన్న ఔటర్ గేట్ ‘డి’ నుంచి (శాప్ ఆఫీస్ గేట్ నుం చి) కేవలం స్టేజి పైకి వెళ్లే వీవీఐపీలను మాత్రమే అనుమతిస్తారు.
     
 వ్యవసాయశాఖ కార్యాలయం ఎదురుగా ఉన్న ‘సి’ గేట్ (గతంలో క్రికెటర్స్ వెళ్లే గేట్) నుంచి కేవలం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబీకుల్ని మాత్రమే అనుమతిస్తారు.

Share this article :

0 comments: