కోర్టు అనుమతిస్తే ముంపు ప్రాంతాల్లో జగన్ పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » కోర్టు అనుమతిస్తే ముంపు ప్రాంతాల్లో జగన్ పర్యటన

కోర్టు అనుమతిస్తే ముంపు ప్రాంతాల్లో జగన్ పర్యటన

Written By news on Thursday, October 24, 2013 | 10/24/2013

కోర్టు అనుమతిస్తే ముంపు ప్రాంతాల్లో జగన్ పర్యటన
హైదరాబాద్: కోర్టు అనుమతిస్తే  ఈ నెల 27, 28 తేదీలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ముంపు ప్రాంతాలలో పర్యటిస్తారని ఆ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు కొణతాల రామకృష్ణ చెప్పారు.  పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన  విలేకరులతో మాట్లాడుతూ బాధితులను జగన్ పరామర్శిస్తారని తెలిపారు. ఒక వేళ కోర్టు అనుమతి ఇవ్వకపోతే పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పర్యటిస్తారని చెప్పారు. ముంపు ప్రాంతాలలో పర్యటించి బాధితులను పరామర్శిస్తారన్నారు.

వైఎస్ జగన్ పిలుపు ఇచ్చిన విధంగా  ఈ నెల  26న  సమైక్య శంఖారావం సభ యథాతథంగా జరుగుతుందని కొణతాల చెప్పారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో శంఖారావం సభపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందువల్ల ఆయన  సభ జరుగుతుందని స్పష్టం చేశారు.
Share this article :

0 comments: