ఆయనకేమన్నా... 16 ఏళ్లా... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆయనకేమన్నా... 16 ఏళ్లా...

ఆయనకేమన్నా... 16 ఏళ్లా...

Written By news on Wednesday, March 18, 2015 | 3/18/2015


ఆయనకేమన్నా... 16 ఏళ్లా...వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్:  ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికార పార్టీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు బుధవారం తనపై చేసిన అనుచిత వ్యాఖ్యాలపై వైఎస్ఆర్ సీపీ  ఎమ్మెల్యే రోజా స్పందించారు.  అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రోజా మాట్లాడుతూ... తనను రోజా అంటీ అంటూ సంబోధించిన బొండా ఉమామహేశ్వరరావు వయస్సు 16 ఏళ్లా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో పట్టిసీమ ప్రాజెక్టుపై చర్చా కార్యక్రమంలో అధికార పార్టీ సభ్యుల తీరును రోజా ఈ సందర్బంగా ఎండగట్టారు.
ప్రాజెక్టులపై ఆధారాలు చూపిస్తే ఎదురుదాడికి దిగుతున్నారని ఆమె ఆరోపించారు. తోటి మహిళల సమస్యలపై ప్రస్తావిస్తే మైక్ కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సభలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియకుండా చేస్తున్నారని ప్రభుత్వ తీరును విమర్శించారు. మంగళవారం మధ్యాహ్నం సీఎం చంద్రబాబు ఎంత దారుణంగా మాట్లాడారో... ఈ రోజు టీడీపీ సభ్యులు ఎంత అహంకారంతో మాట్లాడారో అంతా చూశారని అన్నారు. అచ్చెన్నాయుడు అడ్డుగోలుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
బొండా ఉమామహేశ్వరరావు కుమారుడు యాక్సిడెంట్ చేస్తే కేసు లేకుండా చేశారని ఈ సందర్బంగా రోజా గుర్తు చేశారు. శాఖలతో సంబంధం లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే వీడియో ఫుటేజ్ బయటపెట్టాలని ప్రభుత్వానికి రోజా ఈ సందర్భంగా సవాల్ విసిరారు.
Share this article :

0 comments: