జీవో నెంబర్ 22.. అత్యంత దారుణం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జీవో నెంబర్ 22.. అత్యంత దారుణం

జీవో నెంబర్ 22.. అత్యంత దారుణం

Written By news on Friday, March 20, 2015 | 3/20/2015


జీవో నెంబర్ 22.. అత్యంత దారుణం: వైఎస్ జగన్వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : కిరణ్ కుమార్ రెడ్డి గతంలో జారీచేసిన జీవోనెంబర్ 13 కంటే.. చంద్రబాబు నాయుడు ఇప్పుడు జారీచేసిన జీవో నెంబర్ 22 చాలా దారుణమైనదని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన లోటస్ పాండ్ లో మాట్లాడుతూ ఈ వివరాలు చెప్పారు. కిరణ్ సర్కారు జారీచేసిన జీవో చాలా దారుణమైనదని, కాంట్రాక్టర్లకు దాంతో విపరీతమైన లబ్ధి చేకూరుతుందని, దానివల్ల రాష్ట్రం దివాళా తీసే పరిస్థితి కూడా వస్తుందని అప్పట్లో కొందరు మంత్రులు దాన్ని వ్యతిరేకించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. దాంతో అప్పటి సీఎస్ దాన్ని పక్కన పెట్టారని, గవర్నర్ పాలనలో కూడా దాన్ని అబేయెన్స్ లో పెట్టారని అన్నారు. కానీ చంద్రబాబు ఇప్పుడా అబేయెన్స్ ను ఉపసంహరించి మరీ జీవో జారీ చేశారన్నారు.

ఒకవైపు రాష్ట్రం దివాళా తీస్తోందని బాబు చెబుతారని, కానీ 2013 నుంచి కాంట్రాక్టర్లకు డబ్బులిచ్చేలా జీవో 22 తెచ్చాడని ఆయన చెప్పారు. గవర్నర్ గారు పక్కన పెడితే.. తానెలా చేస్తానంటూ ఏ సీఎం అయినా తప్పించుకుంటారని కానీ గవర్నర్ పక్కన పెట్టిన విషయాన్ని వదిలేసి.. ఏకంగా 2013 నుంచి వర్తించేలా జీవో తెచ్చారని విమర్శించారు. ప్రతి ప్రాజెక్టులో 40 శాతం వరకు సిమెంటు, స్టీలు, ఇంధన ఖర్చులు ఉంటాయని, మిగిలినవన్నీ లేబర్ ఖర్చులు, ఇతరత్రా ఉంటాయని ఆయన అన్నారు. ఈపీసీ కాంట్రాక్టులో కేవలం స్టీలు, సిమెంటు, ఇంధన ధరలు 5 శాతం కన్నా ఎక్కువ పెరిగితేనే అదనపు నిధులు కోరాలని, కానీ చంద్రబాబు 2013 ఏప్రిల్ 1 నుంచి మొత్తం చేసిన పనులన్నింటిలో అధిక ధరలు ఎస్కలేషన్ చేసుకునేలా చంద్రబాబు వెసులుబాటు ఇవ్వబోతున్నారని ఆయన అన్నారు.
Share this article :

0 comments: